నీకోసం
నీకోసం
నీకోసం వెతకని చోటు లేదు కనపడతావేమో అని,
ఎదురు చూడని క్షణం లేదు నువ్వొస్తావేమో అని,
సప్త స్వరాల సరిగమలు నా మదిలో మెదులుతున్న ఈ వేళ
నీకోసం నా మనస్సు పదే పదే తపించింది నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని.
నీ చిన్ననాటి చిరునవ్వులు నీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు,
కానీ,
నువ్వు నాకు పరిచయమైన తర్వాత
నీ ప్రతిక్షణపు చిరునవ్వు నా హృదయం
అనే చిరునామాలో పదిలంగా దాగి ఉంటాయి.
అర్థం చేసుకుంటావని ఆశిస్తూ.......
నీ పాండు రావణ్ మహరాజ్

