నేను కవి నీ కాను
నేను కవి నీ కాను
విశ్వమంతా బాధను గుండెల్లో మోస్తున్న
మాటల్లో చెప్పలేని బాధల్ని మౌనంగా రాస్తున్న
ప్రపంచానికి గుండె చప్పుడై వినిపిస్తున్న
నేను కవి నీ కాను
అక్షరాల్ని పదాలుగా , పదాల్ని ప్రవాహం లా మారుస్తున్న
కలాన్ని కదిలిస్తూ , కాలాన్ని కూడా మైమరిపిస్తున్న
కాగితాల్ని పుస్తకం లా మారుస్తూ ప్రపంచాన్నే ప్రశ్నిస్తున్న
నేను కవి నీ కాను
కవిత ఒక మాహా వృక్షం అయితే అదే కవిత లో నేను మొక్కని
నేను కవి నీ కాను
