Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

నచ్చకపోతే నా ప్రాబ్లం కాదు(చిరునవ్వుతో..)

నచ్చకపోతే నా ప్రాబ్లం కాదు(చిరునవ్వుతో..)

1 min
555


ఒక్క క్షణంలో ప్రేమ పుట్టదు వేణు! అలా పుట్టేది ప్రేమ అని నేననుకోను. అనుకోలేను సంధ్య గట్టిగా చెప్పింది.


కానీ స్నేహంలోంచి ప్రేమ పుట్టకుండా ఉండాలనే అభిప్రాయం నీకు లేదు కదా. వేణు అన్నాడు.


నీకు ముందే పెళ్లి నిశ్చయమైంది. ఆ అమ్మాయి పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మీద నీకు ప్రేమ లేదంటావా? కాస్త పరిచయానికే నా మీద ప్రేమ ఉంది అంటున్న నువ్వు, ఆ అమ్మాయితో పెళ్లి దాకా వెళ్ళిన సంగతి మరచిపోయి నాతో సంతోషంగా ఎలా ఉండగలవు? చెప్పు. అలాంటప్పుడు నేను నిన్ను ప్రేమించాలని నాకెలా అనిపిస్తుంది అని అడిగింది సంధ్య.


మనం చిన్నప్పుడు తప్పటడుగులు వేసి కింద పడిపోతే వెంటనే తల్లిదండ్రులు వచ్చి మనల్ని పైకి లేపి కాస్సేపు వేలు పట్టుకుని నడిపిస్తారు. మళ్లీ మనమే సొంతంగా నడుస్తాం కదా. అదే పెద్దయిన తరువాత మనం తప్పు చేయకపోయినా ఒక్కోసారి కింద పడాల్సి రావొచ్చు. ఎవ్వరూ సాయం చేయడానికి రాలేకపోయినా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి కదా.


నా గతం నుండి నేను బయటకు రావడానికి అదేమీ జైలు కాదు. అందులో నా సంతోషాలు, దుఃఖాలు కలిసే ఉన్నాయి. ఉంటాయి. నన్ను నన్నుగా చూస్తే నీకు ప్రేమ కలుగుతుందేమో. నిన్ను హ్యాపీగా చూసుకోగలను అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నీతో నేను హ్యాపీగా ఉండగలను అనిపించింది. దాన్నే నిజం చేయగలను కాబట్టి అని చెప్పి వేణు దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నాడు.


ఏమో వేణు. నువ్వు చెప్పేవి నాకు నచ్చలేదు అంది సంధ్యా.


నేను నచ్చకపోతే అది నా ప్రాబ్లం కాదు అని వేణు నవ్వాడు.



Rate this content
Log in

Similar telugu story from Abstract