t. s.

Classics Inspirational

4  

t. s.

Classics Inspirational

మనిషి -గుణం

మనిషి -గుణం

1 min
698


పూజ పూజ నేను విన్నది నిజమేనా.

ఏం విన్నావ్ అడిగింది పూజ తన స్నేహితురాలు భానుని.

మీ కాబోయే అత్తగారు పేరు గుండమ్మ అని, 

పేరే కాక గుండమ్మ కథ సినిమా లోలా గయ్యాలిగంప అంట కదా అందరూ అనుకుంటున్నారు.

వాళ్ళ ఇంట్లో మొత్తం పెత్తనం ఆమెదేనట ఆ గుండమ్మ కొడుకు అదే ఆ పెళ్ళికొడుకు వాళ్ళమ్మ మాట జవదాటడట.

తెలిసి తెలిసి ఎలా ఒప్పుకున్నావ్ ఈ పెళ్లికి గుక్క తిప్పుకోకుండా అడిగి అయాసంతో ఆగిపోయింది భాను.


అవునే అందరూ అదే అంటున్నారు.

కానీ..

ఆ పెళ్లికొడుకు నాకు నచ్చాడు. 

అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం.

ఇంత వయసు వచ్చాక కూడా అమ్మ మాట వింటాడంటే బుధ్ధిమంతుడు అని మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు.


ఆమె గయ్యాలి అని అందరూ అంటున్నారు కానీ ఎందుకో నాకు అలా అనిపించలేదు.

ఒకవేళ ఆమె గయ్యాలి అయినా నేను ఏం తప్పు చేయనప్పుడు ఆమె నన్ను ఏం అనదు కదా చూద్దాం అని ఈ పెళ్లికి ఒప్పుకున్నా.


అనుకున్నట్లుగా పెళ్లి జరిగింది.

పూజ అనుకున్నట్లుగానే గుండమ్మ గయ్యాలిగంప కాదు.

వెన్నెలాంటి మనసున్న మంచి అత్తగారు అని త్వరలోనే తెలుసుకుంది.

తనని కూతురులా చూసుకునే అత్తగారు దొరికిందని గుండమ్మని తల్లిలా చూసుకోవడం ప్రారంభించింది.


పేరుని చూసి, చెప్పుడు మాటలు విని తెలియని మనిషి గురించి తప్పుగా అనుకోకండి.

ఏ మనిషి గురించి అయినా దగ్గర నుండి చూస్తేనే తెలుస్తుంది.

మనిషిలో ఉన్న గుణం.


Rate this content
Log in

Similar telugu story from Classics