కూల్ సుబ్బారావు
కూల్ సుబ్బారావు


సుబ్బారావుకు మతిమరుపెక్కువ.కోపమూ ఎక్కువే.ఆమాట చెబితే తగని కోపం.ఇంట్లోవాళ్ళూ ఆఫీస్ లో వాళ్ళూ తన మాటవినటంలేదని అసహనంతో ఊగిపోతున్నాడు
సుబ్బారావుకు ఓ తమ్ముడున్నాడు.పేరు వెంకట్రావు.
సుబ్బారావుకు తమ్ముడు కంటే తమ్ముడు కొడుకంటే ఇష్టం.
తన పిల్లల కంటే తమ్ముడు కొడుకు రామ్ తో ఎక్కువ అనుబంధం...
వెంకట్రావు కొడుకుతో కలిసి టీవీ చూస్తుంటే హడావిడిగా వచ్చాడు సుబ్బారావు..
రామ్ కు అర్థమయింది పెదనాన్న ఏదో చిక్కులో పడ్డాడని.
సుబ్బారావు వచ్చాడు కానీ మాట్లాడలేదు.. కుర్చీలో కూలబడ్డాడు..
"పెదనాన్నా ఏమైంది.."
"సెల్ ఫోన్ పోయిందిరా" సమాధానం నీరసంగా వచ్చింది
"ఫర్వాలేదు.డూప్లికేట్ సిమ్ తీసుకుందాం పెదనా
న్న"
"తీసుకున్నారా..సిమ్ ఆరుగంటల తర్వాత వేయమంటాడేమిటి"
సుబ్బారావు గొంతులో అసహనం.
"ఫర్వాలేదు.సిమ్ నాకివ్వండి.నేను వేస్తాను ఫోన్లో."
"అదీ..అదీ.."సుబ్బారావు నసుగుతున్నాడు...
"ఇవ్వండి..మరి"
"అది కాదురా..ఇందాక పాన్ షాప్ దగ్గర వక్కపొడి తీసుకున్నాను.వాడికి చిల్లర ఇస్తుంటే సిమ్ కూడా పడిపోయింది.నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమోనని."
ఏమిటీయన..సెల్ పోయింది.లక్కీగా ఇంకో ఫోన్ ఉంది..తెచ్చుకున్నాడు.డూప్లికేట్ సిమ్ కూడా పోగొట్టుకున్నా డు..ఈయన్ని ఎవరు మాత్రం బాగుచేయగలరు..రామ్ తలతిరిగిపోయింది..ఈసారి రామ్ నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు...
"రామ్...రామ్...ఏమయిందిరా..". సుబ్బారావు కూల్ గా పలకరిస్తున్నాడు.