దేవుడు
దేవుడు
నానికి ఆకలిగా ఉంది.భోంచేసి రెండురోజులయింది.అన్నంపెట్టేవాడు లేడు.అడిగేవాడులేడు.ఇంట్లోంచి అమ్మమీద అలిగొచ్చేశాడు.ఎందుకలిగాడూ అంటే చదువుకోమందని.సార్లు చెప్పేది అర్థం కాదు.అమ్మకు చెబితే అర్థం కాదు.
అమ్మకు దూరంగా స్కూల్ కి దూరంగా వెళ్ళిపోవాలని ఇంట్లోంచి వచ్చేశాడు.వచ్చినవాడు ఏదో ట్రైన్ కనిపిస్తే ఎక్కేశాడు.టీటీ వచ్చి దింపేశాడు.ఒకరోజు నీళ్ళతో కడుపు నింపుకున్నాడు.. రెండోరోజు క్యాంటీన్ వాడు దయతలచి టీ పోశాడు..కొంచెం టిఫిన్ అడిగితే పొమ్మన్నాడు..
నానిని రెండురోజులనుంచి గమనిస్తున్న కేంటీన్ ఓనర్ వె
ంకటయ్య నానిని పిలిచాడు
'ఏరా ఆకలిగా ఉందా'
కేంటీన్ కేషియర్ 'సార్ వీడు నిన్నటినుంచి ఇక్కడే ఉన్నాడు'
అన్నాడు
'నువ్వాగు' ఓనర్ విసుక్కున్నాడు
'ముందు వాడికన్నం పెట్టండి'
ఎవరో ప్లేట్లో తెచ్చారు
నానికి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి.
'తినరా' లాలనగా అన్నాడు ఓనర్.
తలెత్తకుండా తిన్నాడు
ఇప్పుడు చెప్పు అని మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాడు.'అమ్మ దగ్గరకు వెళతావా' అని అడిగాడు
తలూపాడు.
చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకు గుర్తుకొచ్చాడు ఓనర్ కి...ఇలా ఎవరొచ్చినా అతనిదే చేస్తుంటాడు