Sita Rambabu Chennuri

Drama

4  

Sita Rambabu Chennuri

Drama

కనువిప్పు

కనువిప్పు

1 min
488సుగుణారావు సుజాతల పెళ్ళై నాలుగు దశాబ్దాలు దాటింది.అయితే సుగుణారావు పెళ్ళైన తొలి రోజుల్లో ఎంత దర్పంగా ఉండేవాడో ఇప్పుడూ అంతే.

తనమాటే చెల్లాలనే చిన్నపిల్లాడి కోరికలింకా మనస్తత్వం అతన్నింకా వదల్లేదు.అలా అని సుగుణారావు చెడ్డవాడో చండశాసనుడో అనుకోవటానికి వీల్లేదు.తనమాటను గౌరవించాలనే చిత్తచాంచల్యం తప్ప మరొకటి లేదు అతను మనుసులో.మొదట్లో ఇబ్బందిగా అనిపించినా రాన్రానూ అలవాటుపడిపోయింది.సుగుణారావుకు ఆఫీస్ లో కూడా అదృష్టం కలిసొస్తుంది.అతని కోపతాపాలను చూసీచూడనట్టు వదిలేసేవారు.


ఎవరు భరించినా భరించక పోయినా...ఎవరేమి భావించినా సుగుణారావు కూతురు సునీత తండ్రి ప్రవర్తనపట్ల అసహనంగా ఉంది.తండ్రికి గుణపాఠం కాకపోయినా పాఠం నేర్పించాలని ఉత్సాహపడుతోంది..


ఒక్కోసారి అవకాశం చెప్పి తలుపుతట్టదంటారు.అలాంటిదే జరిగింది సునీత విషయంలో.ఆఫీస్ ఇచ్చిన ఎల్.టి.సి.అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్ లో భాగంగా తనతోపాటు తల్లిదండ్రులను తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంది.

తానొకటి తలిస్తే దైవం మొకటి తలిచినట్టు సుగుణారావుకు ఆఫీస్ సెలవివ్వటానికి నిరాకరించింది.'విధిలేని పరిస్థితుల్లో నాన్నా నిన్నొదిలేసి అమ్మను తీసుకెళుతున్నా' అని పైకన్నదికానీ లోపల చాలా సంతోషించింది సునీత.

కనీసం నాలుగు రోజులు ఒక్కడూ ఉంటే తెలుసుకుంటాడేమోనన్న ఆశతో...


•••••••••••••••


 భార్యను పంపటమయితే హూషారుగా పంపించాడు కానీ మొదటిరోజే అదెంత తప్పో అర్థమయిందో సుగుణారావుకి.పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళి రాగానే వేడికాఫీతో భార్య స్వాగతం పలికేది..పాలు పేకెట్ చింపి పాలువెచ్చపెట్టడం, కష్టపడి కాఫీపెట్టుకునేప్పటికి పుణ్యకాలం దాటిపోతోంది.హడావిడి పడి వంటమొదలెట్టాడు కానీ అదో కొలిక్కి రాకపోవడంతో సగంలో వదిలేసి ఆఫీస్ కు వెళ్ళిపోయాడు.తీరా ఆఫీస్ కు వెళ్ళాక గుర్తుకొచ్చింది గడ్డం చేసుకోలేదని.ఆకలి నకనకలాడుతుంటే కేంటీన్ కు వెళ్ళాడు.రాళ్ళలాంటి మైసూరు బజ్జీలు తినేవాళ్ళ మీద ఇదివరకు జోకులేసేవాడు.ఇప్పుడు అదే రాళ్ళలాంటి మైసూరు బజ్జీలను తిట్టుకుంటూ తిన్నాడు.లంచ్ మాత్రం కేంటీన్లో తినకూడదనుకున్నాడు."ఏమోయ్ సుగుణారావు..భగభగలాడుతూ చిందులేసేవాడివి.ఏమయ్యింది డల్ అయ్యావు.."ఎవరో ఏవేవో ప్రశ్నలడుగుతున్నారు.ఇవేవీ విన్నట్టు లేదు సుగుణారావుకి.. మొదటిసారి సిగ్గుపడ్డాడు..ఫోన్ తీశాడు.టకటక డయల్ చేశాడు.భార్య సుజాత ఫోన్ తీసింది."నన్ను క్షమించు సుజాతా.." పశ్చాత్తాపం దహించేస్తుంటే నూతిలోంచి వచ్చాయి మాటలు..ఇలాంటి మాటలు ఎప్పుడూ వినని సుజాత చేతిలోంచి ఫోన్ జారింది.

మొదటిసారి భార్యకు మనసులోనే దణ్ణం పెట్టాడు సుగుణారావు


Rate this content
Log in

Similar telugu story from Drama