Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కథ తారుమారైంది

కథ తారుమారైంది

1 min
398


నీల నిద్ర లేచి ఆవులించి మళ్లీ పడుకోబోయి పక్కనే ఉన్న బెడ్ కాఫీ చూసి ఉలిక్కిపడింది.


రోజూ తను బెడ్ కాఫీ ఇచ్చి లేపితే గానీ నిద్ర లేవని భర్త తన కోసం బెడ్ కాఫీ కలిపి నిల్చుని ఉన్నాడు.


నీల బెడ్ కాఫీ అందుకుని ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది..


కొన్ని వందల సంవత్సరాల క్రితం..


ఒకావిడ పెద్ద దుప్పిని మంటల మీద కాలుస్తోంది. ఇంకో వైపు మరో దుప్పిని కట్టేసి ఉంచింది. ఆమె జుట్టు నల్లటి చీకటిని వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తోంది.


ఆమె భర్త కాలిన దుప్పి మాంసాన్ని చిన్న ముక్కలుగా కోస్తూ ఇలా అన్నాడు. ఇక నుంచి వేటకు నేను వెళతాను అని దిక్కులు చూశాడు.


అతని భార్య నవ్వి సరే ఒక్కరోజు నీకు అవకాశం ఇస్తున్నాను. రేపు వేట పడిందా నేను గుడిసెలోనే ఉంటాను అంది.


ఆమె భర్త మరికొందరిని పోగు చేసుకుని వేటకు వెళ్ళాడు. అయితే అదృష్టం బాగోలేనట్లు ఆరోజు చిన్న పిట్ట కూడా వారికి చిక్కలేదు.


మళ్లీ ఆడవాళ్లే వేటకు వెళ్ళడం, మగవాళ్ళు గుడిసెల్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం అలవాటైపోయింది.


ఇంకొన్ని వందల సంవత్సరాలు గడిచాయి.


నాగరికతలో ఇంకా మాతృస్వామ్య సమాజాలే వర్థిల్లుతున్నాయి.


ఇంతలో ఒక మగవాడికి మరో ఆలోచన తట్టింది. అందమైన ఆమె శరీరం పరుల కంట పడకూడదన్నాడు. 

అప్పటి వరకూ భుజబలంతో అతడికి సమానమైన ఆమె, ఒళ్లుని దాచుకోవడంలోనే తన ఉనికి ఉందని అనిపించేలా ప్రాధేయపడ్డాడు.


ఏదో ఒక క్షణంలో ఆమె సరేనంది. ఇదే తడవుగా బయటికి వెళితే ఎండకు కందిపోతావన్నాడు. పిల్లల్ని సమర్థవంతంగా పోషించడం నీకు మాత్రమే బాగా తెలుసు అని పొగిడాడు.


వేటాడిన చేతులకు గాజుల గలగలలు బాగుంటాయన్నాడు. అద్దంలో చూసుకుని అలంకరించుకోడమే ఆడదాని జన్మకు సార్థకత అని చెప్పాడు. అలా అలా సమాజాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకుని ఉంటాడు. 


నీలా! ఏంటి ఇంకా బెడ్ కాఫీ తేలేదు అని భర్త మాటలు వినిపించే సరికి తన ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది.


ఇదంతా కలా.. బెడ్ కాఫీ ఏదీ..? 


నీల అద్దంలో ముఖం చూసుకుంది. ఆనాడు వేటాడిన దుప్పిని కాలుస్తూ ఉన్న స్త్రీ కనిపించింది. అంటే నీల.. స్త్రీ ..అద్దం జారి భళ్ళున పగిలింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract