SATYA PAVAN GANDHAM

Action Inspirational Thriller

4  

SATYA PAVAN GANDHAM

Action Inspirational Thriller

"క్రికెటర్ - 1"

"క్రికెటర్ - 1"

5 mins
439


అది 1983 వ సంవత్సరం. ఆరోజు తారీకు సరిగ్గా జూన్ 26. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక మారు మూల గ్రామం. ఆ ఊళ్ళో గల పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు అక్కడున్న పిల్లలందరిని ఒకోక్కరిగా లేపి, వాళ్ళందరి జీవిత ఆశయాల గురించి అడుగుతుంది.

అందరూ ఏవేవో చెప్తున్నారు...

ఒకరు డాక్టర్ అని, ఇంకొకరు పోలీస్ అని, మరొకరు దేశ సైనిక వ్యవస్థలో సైనికుడిని ఇంకొందరు ఇంజినీర్, లాయర్, టీచర్ అంటూ అందరూ తమకు నచ్చిన, తోచిన సమాధానాలు చెప్తున్నారు.

సరిగ్గా అప్పుడే ఒక పిల్లాడు..

నిండా పదేళ్లు కూడా ఉండవు.

లేచి నిలబడి, తను మాత్రం

"నేను క్రికెటర్ అవుతా టీచర్" అంటూ బదులిచ్చాడు.

దాంతో అక్కడున్న మిగిలిన విద్యార్థులంతా ఒక్కటే ఫల్లున్న నవ్వారు. ఆ పిల్లాడి సమధానానికి ఆశ్చర్యపోయిన ఆ టీచర్ కూడా కాసేపటికి తేరుకుని,

ఆ పిల్లాడి దగ్గరకి వచ్చి

"ఏరా బడుధ్దాయ్..!

బాగా చదువుకుని, గొప్ప ఉన్నతమైన స్థితిలో స్థిరపడాలని, రెక్కలు ముక్కలు చేసుకుని మీ అమ్మ నాన్న నిన్ను బడికి పంపిస్తుంటే,

నీకు ఆటలు కావాల్సి వచ్చాయా..?" అంటూ బెత్తంతో ఆ టీచర్ ఆ పిల్లాడిని కొట్టబోతుంటే...

"ఆగండి..!

ఆగండి..!" అంటూ అప్పటికే జరుగుతున్న పరిణామాలన్నీ కిటికీలో నుండి నిశితంగా గమనిస్తున్న ఆ స్కూల్ హెడ్ మాస్టర్, లోపలికొచ్చి ఆ టీచర్ కి అడ్డుపడి, పిల్లాడి సమాధానానికి ముగ్ధుడైన ఆయన, చిరునవ్వుతో ఆ పిల్లాడి వైపు చూస్తూ...

"నీ పేరేమిటి..?

నువ్వు ఎవరి అబ్బాయివి..?" (ఆ హెడ్ మాస్టర్ కూడా ఆ ఊరి వ్యక్తే కావడంతో)

అంటూ ఆ పిల్లాడిని ప్రశ్నించాడు.

దానికి బదులుగా ఆ పిల్లాడు

"న...న...నా పేరు ప...ప... పవన్.

నే...నే...నేను ప...ప... పక్కనే ఉన్న ఈ వీధిలో బ... బ.. బంటా మేస్త్రి ఏడుకొండలు గారి అబ్బాయిని మాస్టారు.!" అంటూ తడబడుతూ సమాధానమిచ్చాడు.

నువ్వేం భయపడకు, నిన్ను ఎవరూ ఏం అనరు..

(ఆ పిల్లాడి మనసులో భయం, తన మాటల్లో అర్ధమవుతుంది ఆ హెడ్ మాస్టారుకు)

"క్రికెటరే అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు..?

అసలు నీకీ ఆలోచన ఎలా వచ్చింది నాన్న...?" అంటూ దగ్గరికి తీసుకుని మళ్ళీ ప్రశ్నించాడు ఆ హెడ్ మాస్టర్ పవన్ ని.

"అది... అది..."

అంటూ చెప్పడానికి భయపడుతూ తడబడుతున్నాడు పవన్

అసలే ఉరిమి ఉరిమి చూస్తున్నా ఆ టీచర్ వంక చూస్తూ...

"ఇక్కడ నిన్ను ఎవరూ ఏమి అనరు...

పర్లేదు డైర్యంగా చెప్పు..!

అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసు..?

నువ్వు క్రికెట్ ఆడతావా..?" అంటూ అడుగుతూ ఆ హెడ్ మాస్టర్ కొంచెం అండగా ఉంటూ దైర్యం చెప్పడంతో...

ఆ పిల్లాడు అదే పవన్

అమాయకంగా చేతులు కట్టుకుని,

"అది నిన్న మా ఇంటిదగ్గర అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. పేపర్లో ఫోటోలు చూపిస్తూ అందులో ఉన్న వాళ్ళని పొగుడుతుంటే ఎవరని అడిగితే, ఎవరో క్రికెటర్ కపిల్ దేవ్ అంట! మన దేశ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా ఓడిపోయే మ్యాచ్ గెలిపించి, ప్రపంచ కప్ మొట్టమొదటి సారిగా దేశానికి అందించి, దేశాన్ని విశ్వ విజేతగా నిలిపి దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పి, హీరో అయ్యాడని చెప్పాడు ఇంటి దగ్గర ఓ అన్న.

అంతకుముందు రోజు కూడా రేడియోలో ఆ అన్నా వాళ్ళు... మ్యాచ్ వింటుంటే అది నేను కూడా వింటూ ఎంజాయ్ చేశాను. ఆ రేడియోలో వచ్చే దాన్ని వింటూ వాళ్ళు అప్పుడప్పుడు కేరింతలు కొడుతుంటే భలే సరదాగా అనిపించింది. మ్యాచ్ గెలిచిన అనంతరం, మన దేశం ప్రపంచంలో గర్వించదగ్గ విజయం సాధించిందని మా వీధిలో అందరూ మిఠాయిలు పంచి, బాణా సంచా కాల్చారు.

మా స్నేహితుల్లో కొంతమంది అదే అన్న వాళ్ళు మ్యాచ్ ఆడుతుంటే తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు బ్యాట్ తో బలంగా బంతిని గట్టిగా కొట్టినా, బంతితో అక్కడున్న పుల్లలను(వికెట్లు) పడగొట్టినా అందరూ సంతోషంతో ఆ అట ఆడుతున్న వారిని పొగుడుతూ ప్రోత్సహిస్తుంటే చాలా ఆనందం వేసింది. మా స్నేహితులు అప్పుడప్పుడు ఆడినప్పుడు పిలిస్తే వెళ్ళేవాడిని కాదు. కానీ, ఈ రోజు నుండి ఎందుకో నాకు కూడా క్రికెట్ ఆడాలని ఉంది. ఇక్కడితోనే కాదు పెద్దయ్యాక దేశానికి ఆడాలని ఉంది" అంటూ అమాయకత్వంతో కూడిన మొహ కవలలికలతో తనకసలు క్రికెట్ పై మక్కువ ఎలా ఏర్పడిందో వివరించి చెప్పాడు పవన్ ఆ హెడ్ మాస్టర్ కి.

తన సమాధానాలకి తదేకంగా అలానే చూస్తున్నాడు ఆ హెడ్ మాస్టర్. కానీ, అక్కడున్న టీచర్ మరియు పిల్లలు మళ్ళీ పగల బడి నవ్వడం మొదలు పెట్టారు.

దాంతో ఆ హెడ్ మాస్టర్ అక్కడున్న వారందరినీ ఆ టీచర్ తో సహా ఒక సీరియస్ లుక్ తో చూస్తూ....

"చూడండి పిల్లలూ...!

ఎంచుకున్న లక్ష్యాన్ని చేరడంలో, ప్రయత్నం చేయకపోతే అది ఎగతాళి కానీ, ఒకరు ఎంచుకున్న లక్ష్యాన్ని ఎగతాళి చేయకూడదు." అంటూ అక్కడున్న పిల్లలకి సర్ది చెప్పడంతో పాటు,

ఆ టీచర్ వైపు చూస్తూ...

"ఇప్పటి ఆటగాళ్ళను కూడా ఒకప్పుడు ఇలానే వాళ్ల టీచర్స్ ఆపి ఉంటే, ఇప్పుడు గొప్పవాళ్లై దేశానికి ఒలింపిక్ మెడల్స్, అవార్డ్ లు సాధిస్తూ దేశ ప్రతిష్టని పెంచేవారా?

దయచేసి ఇంకెప్పుడూ, ఎవరిని ఇలా తక్కువ చేసి చూడకండి" అంటూ మందలించాడు.

దాంతో పవన్ తెలిసో, తెలియకో తన మనసులో నాటుకున్న క్రికెటర్ అవ్వాలనే లక్ష్యం... ఆ హెడ్ మాస్టర్ మాటలతో మరింత బలంగా మారిపోయింది.

అలా కొన్ని రోజుల తరవాత హై స్కూల్ లో చేరిన పవన్ ని ఆ హెడ్ మాస్టర్... పవన్ ను పవన్ చేరిన హై స్కూల్ డ్రిల్ మాస్టారు కి పరిచయం చేశాడు. పవన్ కున్న లక్ష్యాన్ని ఆయనికి చెప్పి, అది తను చేరేవరకు నిరంతరం సాన పెడుతూ తనని ప్రోత్సహించాలని కోరాడు.

కొంతకాలానికి పవన్ ని మొట్టమొదటిసారిగా ఈ క్రికెట్ వైపు మల్లెలా... దైర్యం చెప్తూ తనని ప్రోత్సహించిన తన స్కూల్ హెడ్ మాస్టర్ కాలం చేశారు. అది పవన్ కి తీరని లోటే!

కానీ, పవన్ ఆట చూసి ముగ్ధుడైన ఆ స్కూల్ డ్రిల్ మాస్టారు మాత్రం పవన్ చిరకాల స్వప్నం తెలుసుకుని, అతనికి సరైన దిశా నిర్దేశం చేస్తూ తనకి బాసటగా నిలిచాడు.

ఇక వెనుదిరిగి చూసుకోకుండా కాలి ఉన్నప్పుడల్లా ఆటను ఆటలా కాకుండా, ఆటే తన ప్రాణంలా దాని మీద ఏకాగ్రతను పెట్టాడు. అలా ఆ క్రికెట్ ఆటలో ప్రావీణ్యం పొందాడు.

చూస్తుండగానే సంవత్సరాలు కూడా రోజుల్లా గడిచిపోతున్నాయి.

మండల స్థాయి, జిల్లా స్థాయిలలో పాల్గొన్న ప్రతి టోర్నమెంట్ లో చాలా నిలకడగా, మరింత మెరుగ్గా రాణిస్తున్నాడు పవన్.

పవన్ వాళ్ల నాన్న గారికి చదువుంటే ప్రాణం. ఆటలంటే పరమ చిరాకు. అందుకే, ఒకపక్క తన తండ్రిని నొప్పించలేక, మరొక వైపు తనకిష్టమైన ఆటను పవన్ వదులుకోలేక తనెప్పుడు సతమతమవుతూనే ఉన్నాడు.

ఒకపక్క డ్రిల్ మాస్టారు తనని క్రికెట్ మీద ఫోకస్ చేయిస్తుంటే, మరొకపక్క మిగిలిన టీచర్స్ అతన్ని చదువు మీద ఫోకస్ చేయాలంటూ...

అదే రేపు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అంటూ...

ఆ క్రికెట్ అటు ఇటు అయితే మొత్తం తన జీవితమే నాశనం అవుతుందంటూ పవన్ పై, పవన్ తల్లిదండ్రులపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చారు. వారి మాటలు పవన్ తండ్రి అనుసరించే విధానాలకు ఊతమయ్యాయి.

ఆ టీచర్లను తప్పుపట్టడానికి లేదు. ఏ టీచర్ అయినా తన విద్యార్థి పైకి ఎదాగలనేది వారి కోరిక. అందులో అందరి మార్గాలు ఒకేలా ఉండవు కదా. అందుకే, ఎవరికి నచ్చింది వాళ్ళు సజెస్ట్ చేశారు.

అసలు ఈ తలనొప్పులు అన్ని ఎందుకు అనుకున్నాడో ఏమో.. పవన్ మాత్రం చదువును ఎప్పుడూ పక్కన పెట్టేవాడు కాదు. చదువులో కూడా రాణిస్తూ తను ఒక మంచి విద్యార్థిగా ఆ ఉన్నత పాఠశాలలో పేరు సంపాదించాడు.

ఆటల్లోను చదువులోనూ చురుకుగా ఉంటూ రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. అందుకే, పవన్ తండ్రి అతన్ని ఇక ఏం అనలేకపోయాడు.

జీవితం కూడా ఒక రహదారి లాంటిదే. గమ్యాన్ని చేరుకునేందుకు ప్రయాణించే ఆ రహదారి, ఎల్లప్పుడూ సాఫీగా మనకు అనుకూలంగా ఉంటుందనుకోవడం పొరపాటు. అప్పుడప్పుడు ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. వాటిని దాటుకుంటూ గమ్యాన్ని చేరడమే పరిపూర్ణ జీవితం.

సరిగ్గా పవన్ కి కూడా అప్పుడే తెలిసొచ్చింది ఆ విషయం.

ఒకపక్క చదువు, మరొకపక్క తను ఎంచుకున్న లక్ష్యం క్రికెట్ ఆటలతో సాఫీగా సాగిపోతున్న తన జీవితంలో అనుకొని అవరోధం.

సరిగ్గా తను పదవ తరగతిలోకి వచ్చేసరికి,

తను స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసెందుకు, అండర్ 16 డిస్ట్రిక్ట్ క్రికెట్ టీమ్ సభ్యుడిగా ఎంపికయ్యాడు.

పాపం అదృష్టం ఎదురోస్తుందని అనుకునే లోపు, దరిద్రం తన పక్కన వచ్చి వాలింది.

ఆ టోర్ణమెంట్ జరిగేది సరిగ్గా అతని పదవ తరగతి పబ్లిక్ పరీక్షల టైం లోనే...

ఒకపక్క పదవ తరగతి పరీక్షలు, మరొక పక్క తన స్వప్నానికి బీజం పడే ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ తొలి అడుగు.

ఆ చిన్న వయసు పవన్ కి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు.

పరీక్షలు కాదని క్రికెట్ అంటే,

ఆ టీచర్స్... ఇంట్లో వాళ్ళు.... పైగా అసలే ఆటలంటే అసహ్యించుకునే తన కన్న తండ్రి ఒప్పుకోరన్న భయాలు తనని అనుక్షణం వెంటాడుతున్నాయి.

ఆ సమయంలో, ఆ డ్రిల్ మాస్టారు తనకు మద్దతుగా ఉంటూ ఆయనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ టోర్నమెంట్ షెడ్యూల్ మార్పించే ప్రయత్నం చేస్తానని, తనని ధైర్యంగా ఉండమని పవన్ కి మాటిచ్చాడు.

"ఆ డ్రిల్ మాస్టారు పవన్ కోసం చేసిన ప్రయత్నం సఫలం అయ్యిందా?

ఒకడి కోసం స్టేట్ లెవెల్ లోకి జరిగే కాంపిటీషన్ వాయిదా పడిందా ?

ఒకవేళ పడకపోతే,

ఆ డ్రిల్ మాస్టారు పవన్ తల్లిదండ్రులను ఒప్పించగలిగాడా?

ఒకపక్క తన కెరీర్ కి ఉపయోగ పడే స్టేట్ లెవెల్లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్,

మరొకపక్క తన లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడే స్టేట్ లెవల్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్

పవన్ అడుగులు ఎటువైపు

క్రికెట్ వైపా..?

లేక పరీక్షల వైపా..?"

తర్వాతి భాగం

"క్రికెటర్"

- The story of a dream sacrifier

Part - 2

లో తెలుసుకుందాం ఏం జరగబోతుందో..

అప్పటివరకూ....

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల రూపంలో తెలుపగలరు. అవి నా ఈ కథకు దోహదపడుతూ నన్ను మరింత ప్రోత్సహిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు.

రచన: "సత్య పవన్ (అఆ- అక్షర ఆయుధం)"



Rate this content
Log in

Similar telugu story from Action