Sunkara Hrao

Crime

3.9  

Sunkara Hrao

Crime

కిడ్నాప్

కిడ్నాప్

7 mins
801


“అంకుల్! నాపేరు నందినీరెడ్డి..ఆ రోజు మీరు మా ఇంటికి పార్టీ కీ వచ్చారు గుర్తుందా అంకుల్ ! జూబిలీహిల్స్ రోడ్ నెo బర్ టెన్ నాన్నగారి పేరు మోహన్ రెడ్డి..మీ ఫ్రెండ్ ..నన్ను మీకు పరిచయం చేసినప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీ సెల్ నంబెర్ ఫీడ్ చేసుకున్నాను. స్టెల్లా శిరీషఅక్కలతో సెల్ఫీ కూడా తీసుకున్నాను. అవినాష్ జాకీ అంకుల్స్ తోకూడా ఫోటోలు తీసుకున్నాను..గుర్తువచ్చానా అంకుల్?”

అన్ ఎక్స్పెక్టెడ్ కాల్ అది. టైo తొమ్మిదిన్నర.

స్పీకర్ ఆన్ చేసి అవినాష్ కు సిగ్నల్ యిచ్చి 

డిటెక్టివ్ బాలీ ఆలోచనలో పడిపోయాడు. ఒక్కసారిగా మోహన్ రెడ్డి గుర్తుకొచ్చాడు.ఎస్ ..హి యీజ్ ద మేన్.తెలుగు రాష్ట్రాల్లో ఏ వన్ కంట్రాక్టర్.

“ఎస్ నందినీ..గుర్తుకొచ్చింది.హౌ ఈజ్ డాడ్?”

“హి ఈజ్ ఫైన్ అంకుల్. నా పరిస్థితే అయోమయమైపోయింది.”

“ఏమయ్యిందిరా ?ఎక్కడనుండి మాట్లాడుతున్నావు?”

“అదే తెలియడం లేదు అంకుల్. నన్ను యెవరో కిడ్నాప్ చేసి ఈ ఫ్లాట్ లో బంధించారని అనుమానంగా వుంది. ఫ్లాట్ లో మనుషులు ఎవరూ కని పించ లేదు. నో సౌండ్స్ ఈవెన్.కానీ నాకు అవసరమైన ఫుడ్ , కూల్ డ్రీంక్స్,నైటీస్ అన్నీ వున్నాయి.”

“కిటికీలు ఓపెన్ చేసి చూసావా?”

“ట్రై చేశాను అంకుల్..ఆల్ అర్ సీల్డ్. ఆల్ అర్ వుడెన్ విండోస్ . డోర్ కూడా లాక్ చేసి వుంది.”

“నిన్ను యెప్పుడు కిడ్నాప్ చేసారో చెప్పగలవా ?”

“రాత్రి నా ఫ్రెండ్ ప్రియాంక బర్త్ డే పార్టీ కి వెళ్ళాను అంకుల్. టెన్ తర్టీ వరకు గుర్తుంది . ఆ తర్వాత గుర్తు లేదు. మార్నింగ్ లేచే సరికి యిక్కడ వున్నాను. “

“నీ ఫ్రెండ్ ప్రియాంకా అడ్రస్ చెప్పగలవా నందినీ ?”

“వైనాట్ అంకుల్. ప్లాట్ నెంబర్ ఫార్టీనైన్ ..రోడ్ నెంబర్ లెవెన్ బంజారా హిల్స్ .”

“ఓకే ..మోహన్ కి అదే మీ డాడికి ఫోన్ చేసావా ?”

“లేదంకుల్? ఆయన చాలా గాభరా పడిపోతారు. డాడి హార్ట్ పేషెంట్ కూడా . నేను ప్రియాంకా హౌస్ లో ఉంటానని అనుకుంటారు. మాకు యిది మామూలే అంకుల్.”

అడ్రస్ నోట్ చేసుకున్న అవినాష్ చిన్న పోస్ట్ ఇట్ స్టిక్ పాడ్ స్టెల్లా కు అందించాడు.

అది చూస్తూనే స్టెల్లా జాకీ కీ మెసేజ్ యిచ్చింది. 

“ఓకే రా నందినీ ? ఒక్కసారి ఫ్లాట్ అంతా తిరిగి బయటి ప్రపంచాన్ని చూసే అవకాశo ఉందేమో చెప్పు.చిన్న క్రాక్ ను కూడా వదలకు.నందినీ నా మాటలు అర్ధం అయ్యాయా?”

“అర్ధం అయ్యాయి అంకుల్ ? పోతే ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఈవిషయం డాడి మమ్మీలకు తెలియ నివ్వకండి ప్లీజ్?”

“నువ్వు కంగారుపడకు. ఐ విల్ టేక్ కేర్ .”

ఫోన్ లో మాటలు వినపడకుండా చేతితో బ్లాక్ చేసి 

“అవినాష్ పాస్ ఆన్ దిస్ నెంబర్ టుశిరీష..అండ్ అస్క్ హర్ టు ట్రాక్ దిస్ నెంబర్ అండ్ ట్రాక్ ద నియరెస్ట్ సెల్ టవర్ అల్సొ.”

“అంకుల్! ఎవ్విరీ ప్లేస్ సెర్చ్ చేశాను. బాత్ రూం లో పన్నెండు ఫీట్ల యెత్తులో ఒకే ఒక కన్ సీల్డ్ ఎగ్జాస్ట్ ఫాన్ వుంది .అంతే తప్ప మరో హోల్ గానీ క్రాక్ గానీ కనిపించలేదు.”

“నువ్వున్న రూం కు ఏసీ వుందా?”

“నో అంకుల్. ఓన్లీ ఫ్యాన్ .”

“ఇట్స్ ఓకే నందినీ.భయపడకు. “

“నాకు భయం లేదంకుల్..నేను నల్సార్ లా స్టూడెంట్ ని.పోతే నా హ్యాండ్ బాగ్ తీసేసుకున్నారు. “

“నీసెల్ వదిలేసారన్నమాట?”

“నో అంకుల్. నేను మాట్లాడుతోంది ఆండ్రాయిడ్ స్మార్ట్ రిస్ట్ వాచ్ నుంచి. మామూలు రిస్ట్ వాచని వదిలేసి వుంటారు. ఈ వాచ్ కీ వైఫై ఫెసిలిటీ కూడా వుంది. మా కాంపస్ లో సిగ్నల్స్ పూర్ అందుకే వాట్సప్ కాల్స్ మాట్లాడుతుoటాము ..దాని కోసమే ఈ స్మార్ట్ ఫోన్.నావాచ్ లో వీడియో కాల్ ఫెసిలిటీ లేదంకుల్.”

“అదేమీ ప్రొబ్లెం కాదు. కానీ నువ్వున్న పరిసరాలు తెలియాలంటే నువ్వు తప్పకుండా బయటి ప్రపoచాన్ని చూడగలగాలి ఆలోచించు.


           *********

అప్పటికే ప్రియాంక ఫోన్ కాల్ తో మోహన్ రెడ్డి యింట్లో అలజడి మొదలై పోయింది.

“అంకుల్ ? నేను ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తోంది. తనని ఫోన్ చేయమని చెప్పరా?”

“అదేంటి నందిని మీ ఇంట్లో లేదా? రాత్రి ఇంటికి రాలేదు.నీతో లేదా?”

“నో అంకుల్ ..రాత్రి పదిన్నరకే బయలుదేరిపోయింది.మార్నింగ్ కాలేజ్ కి వెళ్ళాలి ..పదింటికే తన కారులో పిక్ అప్ చేసుకుంటానంది. అందుకే నైన్ తర్టీ నుండి ట్రై చేస్తున్నా అంకుల్ “

“మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిoదేమో కనుక్కున్నావా తల్లీ ?”

“అదికూడా అయిపోయింది అంకుల్. మా బెస్ట్ ఫ్రెండ్ సాయిపూర్ణ కు కూడా కాల్ చేశాను. అదీ నన్నే అడుగుదామని ట్రై చేస్తున్నానంది. తనకు నేనూ పూర్ణ తప్ప ఇంకో ఫ్రెండ్ లేదు.”

అప్పటికే నూతన సచివాలయం నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న మోహన్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చిన మీడియా వుప్పందుకుంది.అన్నిచానల్స్ లో ప్రముఖ కాoట్రాక్టర్ మోహన్ రెడ్డి కుమార్తె మిస్సింగ్ అన్న వార్త స్క్రోలై పోయిoది. నగరమంతా అట్టుడికి పోయింది.

ఏసీపీ శాండిల్య క్లూస్ టీం తో వచ్చేసాడు.

బాలి తో కాంటాక్ట్ చేయాలని ట్రై చేసి ఫోన్ దొరకక పోవడంతో డిఎస్ పీ ని థర్డ్ ఐ ఆఫీస్ పరుగెత్తించాడు.

రోడ్ నెం టెన్ జూబిలీహిల్స్ మోహన్ రెడ్డి బంగ్లా రాజకీయ నాయకులతో ..నగర ప్రముఖులతో క్రిక్కిరిసి పోయింది.అన్ని చానల్స్ లో లైవ్ టెలికాస్ట్ మొదలై పోయింది .మోహన్ రెడ్డి ని ట్రీట్ చేస్తున్న అపోలో హాస్పిటల్ డాక్టర్ల బృందం వచ్చి మోహన్ రెడ్డికి సెడేటివ్ యిచ్చి టెన్షన్ కు దూరం చేశారు. నందినీ రెడ్డి మదర్ ఛాయాదేవిని ..సిస్టర్ లతారెడ్డి ఇంటర్ వ్యూ లు అన్ని చానెల్స్ లో ప్రసారం చేసేసారు. నల్సార్ లాస్టూడెంట్స్ కూడా కాలేజ్ బస్సులలో వచ్చి గుమికూడి పోయారు. 

           *******

“అంకుల్..నేనే చూస్తాను . ఐ విల్ ట్రై మై బెస్ట్.” 

“ఓకే నందినీ.. ముందు నువ్వు ఫ్లాట్ అంతా తిరుగుతూ నువ్వు చూస్తున్న వస్తువుల్నీ నీకు వాళ్ళు ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ ని వర్ణిస్తూ వుండు . “

ఓకే అంకుల్.నాలెక్క ప్రకారం ట్వెల్వ్ బై ట్వెల్వ్ వుంటుంది బెడ్ రూం. సిక్స్ బై త్రి సింగల్ కాట్ విత్ మాట్రెస్ .రెండు బెడ్ షీట్స్ వున్నాయి.నొ ఏసి. ఆల్ విండోస్ అర్ లాక్ డ్ అండ్ ప్యాక్ డ్ ఫ్రo అవుట్ సైడ్ . హాల్లో ..ఫ్యాన్ మాత్రమే వుంది. ఓ మూల చిన్న ఫ్రిడ్జి వుంది. 

కిచన్ ..ప్లేట్స్ గ్లాసులు స్పూన్స్ గోడకో కెంట్ వాటర్ ఫిల్టర్ వుంది. 

“ఫైనల్ గా బాత్ రూం . చిన్న మగ్ ..లిక్విడ్ సోప్ ..హ్యాండ్ వాష్ బాటిల్ వుంది. షవర్ బాత్ ఫెసిలిటీ వుంది.”

“రూఫ్ హైట్ చెప్పగలవా ?

“టెన్ ఆర్ ట్వెల్వ్ ఫీట్ వుంటుంది.”

“ట్రై టు ఎస్టిమేట్ కరెక్ట్ లీ ..నీ జవాబును బట్టే నెక్స్ట్ స్టెప్ “

“ఓకే అంకుల్ ..నా హైట్ ఫైవ్ సెవెన్ ..నాకన్నా డబుల్ వుంటుంది ..అంటే ట్వెల్వ్ ఫీట్ “

అర్ యూ స్యూర్ ?”

దాదాపు అంతే అంకుల్ ?.

“ఓకే నందినీ ! ఈట్ సంతింగ్ అండ్ టేక్ రెస్ట్ . నీ వాయిస్ 

అoతా రికార్డు చేసాము . అనాలసిస్ చేసి ప్లాన్ చేస్తాను . వితిన్నె హాఫ్ యాన్ హావర్ ఐ విల్ బి బాక్.”

బాస్ ! శిరీష సెల్ టవర్ ను ఐడెంటిఫై చేసింది. శంషాబాద్ ఏరియా.

వెరీ గుడ్ .జాకీ ని శంషాబాద్ పీ ఎస్ కు పంపించు. స్టేషన్ సిఐ కమలాకర్ . ఇప్పటికే అన్ని చానల్స్ లో ఈ విషయం టాంటాం అయిపోయి వుంటుంది. సింగిల్ బెడ్ రూం ఫ్లాట్స్ వున్న అపార్ట్ మెంట్స్ చాలా అరుదుగా వుంటాయి. టెల్ హిం టు ట్రేస్ అవుట్ విత్ పోలీస్ ఫోర్సు. నువ్వు కమలాకర్ తో మాట్లాడు.”

శిరీష దాదాపు పరుగెత్తుకుoటు వచ్చి 

“బాస్! డిఎస్పీ రవీంద్ర గారు వచ్చారు.మిమ్మల్ని తీసుకు రమ్మన్నారట శాండిల్య గారు. కెన్ ఐ సెండ్ హిం బాస్?”

“నా ఫోన్ ట్రై చేసి బిజీ రావడంతో నాకోసం పంపించి వుంటారు. గో అండ్ కనెక్ట్ టు శాండిల్య ఫ్రo ల్యాండ్ ఫోన్ .ఐ విల్ టాక్ అండ్ టెల్ .రవీoద్రని వెయిట్ చేయమని చెప్పు.శాండిల్య సర్ ఈజ్ కమింగ్ అని చెప్పు.అవినాష్ !శాండిల్య రాగానే కేస్ ఎక్స్ప్లెయిన్ చెయ్”

శాండిల్య ను తన రూం లో కూర్చో బెట్టి నందినీ కేస్ ఎక్స్ ప్లెయిన్ చేసాడు అవినాష్.

“ఓకే అవినాష్ ! కేస్ ఈజ్ వెరీ సీరియస్ ... మోహన్ రెడ్డి పోలిటికల్లీ వెరీ స్ట్రాంగ్ ..సీఎం తప్ప దాదాపు మినిస్టర్స్ అంతా వచ్చేశారు.మీడియా లో ఈ వార్త ఇప్పటికే వైరల్ అయిపోయింది.”

సర్ !మాబాస్ అదే పనిమీద వున్నారు.నందినీరెడ్డి ని తప్పకుండా రక్షిస్తారు .రండి బాస్ ఛాంబర్ కు వెళ్దాము.  

అప్పుడే వచ్చిన జాకీ కాల్ కు ఆన్సర్ చేస్తూ వస్తూనే 

బాస్! కమలాకర్ హెల్ప్ తో జాకీ సింగల్ బెడ్ రూం ఫ్లాట్స్ ఐడెంటిఫై చేసాడట ..పదివున్నాయట.

శాండిల్య ఆ మాటలకు వెoటనే రియాక్ట్ అయ్యారు.

మిస్టర్ బాలీ ! ఐ విల్ టేక్ కేర్ అఫ్ ద ఇష్యూ . కమలాకర్ టెన్ బెటాలియన్స్ తో టెన్ అపార్ట్ మెంట్లపై ఒక్కసారే మెరుపుదాడి చేస్తాడు . యు టేక్ కేర్ అఫ్ నందినీ రెడ్డి. 

          ******

“అమ్మా నందినీ !రిఫ్రెష్ అయ్యావా? అర్ యూ రెడీ ఫర్     దఅడ్వెoచర్?”

“ఐయాం రెడీ అంకుల్ “

“క్లోజ్ ద మెయిన్ డోర్ అండ్ లాక్ ఇట్ “

“ఓవర్ అంకుల్.”

“టెల్ ద హైట్ అఫ్ ద ఫ్రిడ్జ్.”

“మేబిఫైవ్ ఫీట్ ..విత్ రోలర్ వీల్స్ స్టాండ్ ఫైవ్ అండ్ హాఫ్.”

“ఓకే ..కెన్ యు పుష్ ద ఫ్రిడ్జ్ టు బాత్ రూం ఎగ్జాస్ట్ వాల్?”

“బాత్రూం ముందు త్రిఇంచెస్ ఫ్లాటుఫాం వుంది ..అయినా ఐవిల్ ట్రై అంకుల్ ..కాలేజ్ డేస్ లో కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను.”

“మొత్తానికి సక్సెస్ అంకుల్..”


“ముందు కిచెన్ లొకి వెళ్ళి అట్లకాడ ఐ మీన్ బిగ్ స్పూన్ లాంటిది సoపాదించు. నెమ్మదిగా ఫ్రిడ్జిఎక్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రిమూవ్ చెయ్. ఫ్యాన్ బయటపడకుండా మేనేజ్ చెయ్.”

“ఓకే అంకుల్! మమ్మీ దోసెలువేసేటైములో యూజ్ చేసే బిగ్ ఫ్లాట్ స్పూన్ దొరికింది. ఫ్రిడ్జి ప్రక్కనే కమోడ్ వుంది ..దాని మీద కాలేసి ఫ్రిడ్జి ఎక్కి ఫ్యాన్ రిమూవ్ చేసి మాట్లాడుతాను.”

            *****               “రాజాపిజ్జా హౌస్..శoషాబాద్.. ఫోన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ అండ్ ఫోర్ నైన్స్ .”

బిలబిలమoటు చుట్టుముట్టిన పోలీస్ ఫోర్స్ ను చూస్తూనే గుడ్లు తేలేసాడు ధర్మరాజు పిజ్జా హౌస్ ఓనర్. 

“పదిగంటలకు బయలుదేరి డెలివరీ చేసిన డెలివరీ బాయ్స్ ను  పిలిపించు. “                                 జాకీ మాటలు వింటూనే మగ్గురు ముందుకొచ్చారు.                        “కరెక్ట్ గా టెన్ ఫిఫ్టీన్ టైములో మీరు యెక్కడ వున్నారో గుర్తు చేసుకోండి.మీతోబాటు ఇన్స్పెక్టర్స్ వస్తారు ..కరక్ట్ ప్లేస్ చూపించండి. “

          ***** 

మోహన్ రెడ్డి ఇంటిముందు కోలాహలం.బాలీ అండకో తో బాటు మోహన్ రెడ్డి ..నందినీ రెడ్డి .. శాoడిల్యా ...కమీషనర్ అఫ్ పోలీస్ మంత్రులు మీడియా .

బాలీ మొదలు పెట్టాడు.

“నాకు తొమ్మిదిన్నరకు నందినీరెడ్డి కాల్ చేసి తననెవరో రాత్రి పదిన్నరకు కిడ్నాప్ చేసి ఓఫ్లాట్లో బంధించారని చెప్పింది.తన హ్యాండ్ బాగ్ కూడా తీసేసుకున్నారని ..తన స్మార్ట్ రిస్ట్ వాచ్ నిమాత్రం గమనించకుండా వదిలేసారని చెప్పింది.అమ్మాయి ధైర్యవంతురాలు..కాబట్టి మా ప్లాన్ ప్రకారం స్మార్ట్ గా బిహేవ్  చేసి పన్నెండు అడుగుల యెత్తులో వున్న యెగ్సాస్ట్ ఫ్యాన్ తొలగించి యెదురు గా రోడ్ మీద పోతున్న రాజాపిజ్జా హౌస్ డెలివరీ వెహికల్ వెనుకున్న అడ్రస్ చెప్పింది. పోలీస్ డిపార్టుమెంటు స్మార్ట్ గా స్పందించి అమ్మాయిని రక్షించారు.

దీని వెనుకున్న కిడ్నాప్ గ్యాంగ్ యెవరు ?లక్ష డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిoది ..దానికీ నందినీరెడ్డి యిచ్చిన క్లూ            ఆటంబాంబులా పేలింది.”

పిన్ డ్రాప్ సైలెన్స్.అన్ని కెమారాలూ నందినీ బాలీలమీదే జూమ్ అయ్యాయి.మైక్ నందినీ కిచ్చాడు బాలీ .

            ******

“రాత్రి పదిన్నరకు ఫ్రెండ్ పార్టీ నుండి నాకార్ దగ్గరకు వెళుతుంటే ఎవరో మత్తుమందు వాసన చూపించి ఓసింగల్ బెడ్ రూం ఫ్లాట్లో బంధించారు .నాబాగ్ తీసుకుని మామూలు గడియారమనుకుని నా స్మార్ట్ వాచ్ ని వదిలేసారు. డిటెక్టివ్ బాలీ అంకుల్ మా ఫ్యామిలీఫ్రెండ్.డాడిని రిక్వెస్ట్ చేసి అంకుల్ ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకున్నాను. ఆ ఫోన్ నెంబరే నన్ను ఈరోజు బ్రతికించింది. తొమ్మిదిన్నరకు స్పృహ రాగానే అంకుల్ కి ఫోన్ చేసాను.ఆయన డైరెక్షన్ ప్రకారం యాక్ట్ చేసి ట్వెల్వ్ ఫీట్ హైట్లో వున్న ఎగ్సాస్ట్ ఫ్యాన్ పీకి బయటికి చూసి అప్పుడే నా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళుతున్న పిజ్జా హౌస్ బైక్ మీదున్న అడ్రస్ చెప్పాను.అంతే ఫిఫ్టీన్ మినిట్స్ లో పోలీస్ అంకుల్స్ వచ్చి సేవ్ చేశారు.”

బాలీ మైక్ తీసుకున్నారు .

“మాస్టాఫ్ తో బాటు పోలీస్ కూడా కాల్ వచ్చిన సెల్ టవర్ యేరియాను ట్రేస్ చేశారు. డెలివరీబాయ్ పదింబావుకు తానున్న ప్లేస్ చూపించాడు.. అతని రూట్ కు ఆపోజిట్ డైరెక్షన్ లోవున్న సింగల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ ను ట్రేస్ చేసి కమలాకర్ గ్రూప్ తో కలిసి ఎటాక్ చేశారు.అమ్మాయి సేఫ్ బట్ కిడ్నాప్ చేసింది ఎవరు ?అప్పుడు నందినీరెడ్డి క్లూ యిచ్చింది .

అంకుల్ నాబేగ్ లో నా కార్ కీచైన్ వుంటుంది. దానికి వైఫై కంపేటబిలిటీ వుంది. నా వాచ్ లో యాప్ యాక్టివేట్ చేస్తే  కీ చైన్ లోoచి సైరన్ టైప్ సౌండ్ వినిపిస్తుంది. నా మతి మరుపుకురెమిడిఅని కొనుక్కున్నాను. పోలీస్ ఫోర్స్ ను ఆక్టివేట్ చేసి కీ చైన్ సాయంతో ఆ గ్యాంగ్ ను ట్రేస్ చేసి పట్టుకున్నాము. కిడ్నాప్ గ్యాంగ్ అంతా బాస్ ఆజ్ఞల కోసం యెదురు చూస్తూ ప్రక్కనేవున్న అపార్ట్ మెంట్ లో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు.ఆ అపార్ట్మెంట్ అమ్మాయిని బంధించిన అపార్ట్మెంట్ కూడా మోహన్ రెడ్డి తో సెక్రటేరియట్ టెండర్ కోసం పోటీపడిన బాల్రెడ్డివే. పోలీస్ మర్యాదలతో గేంగ్ తమ బాస్ పేరు చెప్పారు.నందినిని కిడ్నేప్ చేసి మోహన్ రెడ్డిని బ్లాకుమెయిల్ చేద్దామనుకున్న బాల్రెడ్డి ప్లాన్ తలక్రిందులవడంతో అవమానాన్ని జీర్ణించుకో లేక ఆత్మహత్య చేసుకున్నాడు.”

“బాలీ!మై దోస్త్ !నా కూతుర్నికాపాడిన నీకు ..”

“మోహన్ !నేను కాదు నీ కూతురి సమయస్పూర్తి ధైర్యాలే కాపాడాయి.”  

            సమాప్తం 


Rate this content
Log in

Similar telugu story from Crime