Sunkara Hrao

Thriller

4.3  

Sunkara Hrao

Thriller

డైమండ్ రాబరీ

డైమండ్ రాబరీ

7 mins
457


బాస్! మీకోసం సేట్ రతన్ లాల్ గంట నుండి వెయిటింగ్ . మనిషి చాలా టెన్షన్ లో వున్నాడు. సోఫాలో కూర్చోకుండా రిసెప్షన్ రూంలో మార్నింగ్ వాక్ చేసేస్తున్నాడు. కనీసం వాటర్ కూడా ముట్టుకోకుండా మీదర్సనానికి వ్రతంచేస్తున్నట్లు తన లోకంలో వుండి పోయాడు. నేను స్టెల్లా చెప్పినా లాభం లేక మేము సైలెంట్ అయిపోయాము.”

అవినాష్ రిపోర్ట్ వింటూ..చిన్నగా నవ్వి 

“ఏదో బిజినెస్ గొడవ అయ్యుoటుoది..సేట్ ను లోపలికి పంపించి నువ్వు స్టెల్లా కూడా వచ్చేయండి.”

డిటెక్టివ్ బాలి ఆర్డర్ ప్రకారం ముగ్గురూ ఆయన టేబుల్ ముందు ఆసీనులయ్యారు .

“రతన్ లాల్ జీ ! ఆప్ బతాయియే ప్రొబ్లెం క్యాహై?”

“బాలీ సాబ్ ! మై బర్ బాద్ హోగయా ..మొన్న మాది షాప్ కు 

ఒక బూటిఫుల్ లేడీ వచ్చి పాంచ్ కరోర్ కా డైమండ్ నెక్లేస్ ఖరీదా . ఫైవ్ కరోర్కా డిడి భి దియా. మగర్ ఉస్ దిన్ అచ్చా నై బోల్కే రిసీట్ లేకే గయా. ఈ వీక్ ల అచ్చి లేకే జాతుం బోల్కే గయా. మగర్ నెక్స్ట్ దిన్ ఆకే నెక్ లెస్ లేకే గయా.”

“ఎవ్విరి థింగ్ ఫైన్ ..ఇస్ మె ప్రొబ్లెం క్యాహై?”

టేబుల్ ముందున్న గ్లాస్ తీసుకుని మొత్తం వాటర్ రెoడు గుక్కల్లో తాగేసి మొదలు పెట్టాడు సేట్.

“తీన్ దిన్ కే బాద్ వోయి లడకి ఫిర్ ఆకే నెక్ లెస్ పూచా.   మై పరేషాన్ హోగయా .సంఝానే కొ ట్రై కియా.           అమ్మా ! మై సచ్ బోల్రుం ..మై నే ఆల్ రెడీ ఆప్ కో డెలివరీ కర్దియా . దేఖో ఏయీహై ఆప్ దియే సొ రిసీప్ట్..మైనే బతాయత. వో లడకి బిగ్గరగా హస్కే ఔర్ ఏక్ రిసీట్..బతాకే ...

“సేట్ సాబ్ !నేను మీషాప్ కు యింతకముందు రాలేదు. మీరు జాగ్రత్తగా చూడండి..ఇది మీరిచ్చిన రసీదు.చెక్ చేసుకోండి. నేనే వచ్చి నెక్లెస్ తీసుకెళ్ళానని చెప్తున్నారు. నేను మీకు డిడి యిచ్చిన నెక్స్ట్ డే కొడైకనాల్ వెళ్ళి పోయాను.యిప్పుడు ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్నాను.వన్ మినిట్ ..ఇవి ఇండిగో ఫ్లైట్ టికెట్స్. ఎయిర్ పోర్ట్ సిసి కెమారాలు చెక్ చేస్కొండి. ఆ రోజు టెన్ ఫిఫ్టీన్ ఫ్లైట్ కెళ్ళి...యివ్వాళ ఎలవెన్ ఫిఫ్టీన్ ఫ్లైట్ లో వచ్చాను.”

“రిసీట్..ఫ్లైట్ టికెట్స్ వెరీఫై చేశాను సాబ్..మొదటి లేడీ యిచ్చింది కలర్ జిరాక్స్ సార్. దూసరి లడకి యిచ్చింది ఒరిజినల్ సాబ్. ఫ్లైట్ టికెట్స్ కూడా ఓకే సార్. మా వాడు ఎయిర్ పోర్ట్ కు పోయి చెక్ చేసినాడు సర్.”

“సేట్ జీ! ..అయిదు కోట్ల డీల్ ఇది. మరీ యింత తేలికగా ఎలా మోసపోయారు. ఐపిటి యూ ..”

“సాబ్ !నాది నసీబ్ అచ్చా నై . నెక్లాస్ నైదియేతో పోలీస్ కంప్లయింట్ భీ యిస్తానంది సాబ్.”

నీ బొంద అందమైన అమ్మాయి ని చూడగానే సొల్లు కార్చేసుకుని ..ఇంప్రెస్స్ చేయాలని ముoదూ వెనుకా చూసుకోకుండా మోసపోయి ఉంటావు. స్వగతంలో అనేసుకున్నాడు అవినాష్.

అవినాష్ స్వగతాన్ని క్యాచ్ చేసిన స్టెల్లా “ఎస్ యూఆర్ కరెక్ట్ అన్నట్లు కళ్ళు తిప్పింది.”

యిద్దరి విన్యాసాల్ని గమనించిన బాలీ గుంభనంగా నవ్వుకున్నాడు.

“లేదు సాబ్ ! మిమ్మలి కలిసినాక మీది సలహా లేనేకే బాద్ కరేంగే బోల్కే ..మీది ఆఫీస్ కొ ఆయా . ఇంకా పాలిష్ వర్క్ నై హువా బోల్కే కల్ మై ఫోన్ కరుతుం బోల్కే సంఝాయ.”

“మేము మీ కేసు టేక్అప్ చేస్తాము. మీతో బాటు మా అవినాష్ 

స్టెల్లాలు మీతో మీషాప్ కు వస్తారు. మీ వర్కర్స్ తోకలిసిపోతారు. ఆ అమ్మాయికి ఫోన్ చేసి డే ఆఫ్టర్ టుమారో టెన్నో క్లాక్ కీ వచ్చి నెక్లెస్ తీసుకో మని చెప్పండి. మీది  నెక్లేస్ కేస్..మై నే సాల్వు కరుoగా .”

ఒక్కసారిగా లేచిన సేట్ బాలి చేతులు పట్టుకుని దాదాపు ఏడ్చేసినంత పని చేసాడు.

            *****

థర్డ్ ఐ డిటెక్టివ్ ఏజెన్సీ ఆఫీస్.

బాలి ముందు స్టెల్లా అవినాష్ లు ..క్లాస్ టీచర్ ముందు 

ఒబీడియంట్ గా జవాబులు చెపుతున్న విద్యార్ధుల్లా ..బాలి డౌట్స్ కు సమాధానాలు చెపుతున్నారు.

“అవినాష్! షాప్ లోకి ఆ లేడీ ఎంటర్ అయిన దగ్గరినుంచి షాప్ వాళ్ళు చెప్పిన సీన్ బై సీన్ నేరేట్ చెయ్.అన్నట్లు షాప్ లో సిసి కెమారా ఫూటేజ్ చూసారా ?

ఎస్ బాస్ ! నా అనుమానం ఇద్దరు కాదు ఒక్క అమ్మాయే నని.”

“ఔను బాస్ ! నాదీ అదే ఫీలింగ్.”

“డిటెక్షన్ లో నోఫీలింగ్స్ . క్లూస్ అండ్ కట్ త్రోట్ మోటివ్స్ కావాలి .మీరు యిద్దరూ ..ఇద్దరు కాదు ఒక్క అమ్మాయే నని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఓకే నేనూ మీ రూట్ లోకే వస్తాను. అయితే ఎయిర్ పోర్ట్ అమ్మాయి యెవరు?ఒకే అమ్మాయి ఒకే టైములో రెండు చోట్ల సాధ్యమా? యూజ్ యువర్ బ్రెయిన్.”

“బాస్ అంతటితో ఆపేయండి. ఇఫ్ యు హేవ్ అని మాత్రం అనకండి.”

అడ్డం పడిపోయిన అవినాష్ ను చూస్తూ చిన్నగా నవ్వి 

 “దెన్ బోత్ అఫ్ యు యూజ్ యువర్ డిటెక్టివ్ హెడ్స్.”

“బాస్ !మీరు నవ్వను అంటే..నాదో చిన్న డౌట్.మొదటి సిసి కెమారాలో పైట కుడి ప్రక్క కు వేసుకుంది.రెండో సిసి కెమారాలో యెడమ ప్రక్కకు వేసుకుంది. “

“ఏయ్ !పిచ్చి స్టెల్లా ! రెండో సిసి ఫూటేజ్ ఫ్రo మిర్రర్. బాస్ చుట్టు వున్న నగలను చూస్తూ తను స్టెల్లా ననే సంగతే మర్చిపోయింది. ఎoత డిటెక్టివ్ అసిస్టెంట్ అయినా అమ్మాయే కద బాస్?                                 “బాస్!అలా గమనించ బట్టే కదా “ఎస్ డబ్లుబైసిక్స్ ఎఫ్ డి “కేస్ లో క్లూ దొరికింది.”

స్టెల్లా యు అర్ కరక్ట్.అవినాష్ అవి మిర్రర్ ఫొటోస్ అని గుర్తించాడు. అమ్మాయి డ్రెస్సిoగ్ లో వున్న చిన్న తేడానిగుర్తించింది స్టెల్లా.సొ యూబోత్ఆర్ యూజిoగ్ బ్రైన్స్. “

ఫోన్ రింగ్ అవడంతో.                        “బాస్! జాకి ఆన్ ఫోన్ ..రిపోర్టింగ్ ఫ్రo ఎయిర్ పోర్ట్. 

హి యీజ్ సెండింగ్ వాట్స్ యాప్ ఫొటోస్ అండ్ సిసి కెమెరా క్లిప్పింగ్స్ .”

మాట్లాడుతూనే బాలి యెదురుగా వున్న లాప్ టాప్ కు తన ఫోన్ కనెక్ట్ చేసాడు. 

మొదటి క్లిప్పింగ్ అమ్మాయి చెక్ ఇన్ అవడం .టైం పదిన్నర.

రెండో క్లిప్పింగ్ అమ్మాయి అరైవల్. టైం ట్వెల్వ్ ఫార్టీ.

మొదటి క్లిప్పింగ్ డేట్ అండ్ టైం సేట్ చెప్పిన వివరాలతో సింక్ అయ్యింది. 

రెండో క్లిప్పింగ్ లో వున్న ఎయిర్ పోర్ట్ అమ్మాయి షాప్ లోకి వచ్చి నెక్ లేస్ క్లెయిమ్ చేసిన అమ్మాయితో సరిపోయింది.

“బాస్ ! నాకో క్లూ దొరికింది. ఎయిర్ పోర్ట్ అమ్మాయీ ఒరిజినల్ రిసీట్ తో నెక్ లేస్ క్లైo చేసిన అమ్మాయి సేంటుసేం బాస్. యిక్కడ చూడండి..”

వేలితో పాయింట్ చేసి చూపించింది స్టెల్లా .

“బాస్ ! షాప్ లో ఈ అమ్మాయి వున్న టైం లో ఎయిర్ పోర్టులో కూడా అదే అమ్మాయి వుంది ?ఇదేమీ సినిమా కాదు గదా ?

“సినిమా కాదు కానీ క్లూ దొరికి పోయింది. .”

చిరునవ్వుతో చెపుతున్న బాస్ వంక అయోమయంగా చూసారు స్టెల్లా అవినాష్ లు.

“డియర్ అప్ కమిoగ్ డిటెక్టివ్స్ మరీ బుర్రలు బద్దలు కొట్టుకో కండి.

మీ అభిప్రాయం ప్రకారం ఏ అనే అమ్మాయి ఎయిర్ పోర్టులో చెక్ ఇన్ అయ్యింది. దాదాపు అదే టైం లో బి అనే అమ్మాయి షాప్ కొచ్చి నెక్ లేస్ తీసుకుంది. మళ్లి నిన్న ఏ అనే అమ్మాయి ఎయిర్ పోర్ట్ నుండి తిన్నగా షాప్ కొచ్చిఒరిజినల్ బిల్ చూపించి తన నెక్ లేస్ యిమ్మని అడిగింది. సేటు స్టేట్మెంట్ ప్రకారం బి అనే అమ్మాయి యిచ్చిన బిల్ కలర్ జిరాక్స్ ..యింతవరకు క్లియర్ కదా ?”

ఓకే బాస్ ! ఈ కేసులో అసలు బి అనే అమ్మాయి లేదని నా అభిప్రాయం.ఎయిర్ పోర్ట్ లో చెక్ ఇన్ అయిన అమ్మాయే 

ఫ్లైట్ ఎక్కకుండా బయట పడి రెడీ గా ఉంచుకున్న కార్లో ఓఆర్ఆర్ మీదుగా హాఫ్ యాన్ అవర్లో షాప్ కు రావచ్చు బాస్. నెక్ లేస్ తీసుకోని మరో ఫ్లైట్ లో కోడైకనాల్ వెళ్ళి నిన్న తిరిగొచ్చిసేట్ ను కలిసి మళ్ళీ నెక్లేస్ క్లైo చేసి వుంటుంది.”

“యు మీన్ చెక్ ఇన్ తర్వాత కూడా బయటకు రావచ్చు అంటావ్?”

“ఎస్ బాస్ .అదో పెద్ద సమస్యే కాదు. ప్రతిరోజూ కిలోలకొద్ది బంగారం బయటికొచ్చేస్తుంది పట్టుబడకుండా.”

“కానీ చాలామంది దొరికిపోతున్నారుగా?”

“మైడియర్ పిచ్చి స్టెల్లా! దొరికేది గోరoత..దొరకనిది కొండంత. మనం ఫ్లైట్ బోర్డ్ అయ్యే ప్లేస్ కు ఆనుకునే హౌస్ కీపింగ్ వార్డ్ వుంది. బ్రైబ్ చేసి డ్రెస్ మార్చుకుని హ్యాపీగా క్రిందకొచ్చి టాయిలెట్స్ లో దూరి అగైన్ డ్రెస్ చేoజ్ చేసుకుని సిటీ కొచ్చి వుంటుంది..వెరీ సింపుల్.”

“అంటే..సేట్ చెప్పిన టైం కరెక్ట్ కాదంటావు?”

“అవును బాస్ ! సేట్ టైం సరిగా అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు.”

“అవినాష్ ! ఏ అనే అమ్మాయి తప్ప బి అనే అమ్మాయే లేదని నీ వాదన.”

“అవును బాస్ ! నా అభిప్రాయం కూడా సేం టు సేం.”

స్టెల్లా అవినాష్ ను సపోర్ట్ చేసింది.

“ఓకే ..యంగ్ బ్రైన్స్ ...నేను ఏసీపీశాoడిల్యను కలిసి వస్తాను.  ఈ కేస్ లో క్రైమ్ ఎలిమెంట్స్ లేవు కానీ .. అయిదు కోట్లoటే చాలా పెద్ద అమౌంట్. అమ్మాయి ఓబిగ్ షాట్ కూతురు. నేను శాoడిల్యా శిరీష రేపు మఫ్టీ లో షాప్ కు వస్తాము . మీరు రేపు షాప్ లో ఈ రెండు విషయాలలో క్లూలు సపాదించి రెడీ గా వుండండి.”

తను రాసి పెట్టుకున్న చిన్న స్లిప్ అవినాష్ కిచ్చాడు డిటెక్టివ్ బాలీ  

         *****

“బాస్ ! ఇది ప్యాకింగ్ సెక్షన్. కోటి దాటిన ఆభరణాలను ప్రత్యేక బాక్సులో ప్యాక్ చేసి యిస్తారు. మొన్న బి అమ్మాయి కి ఈ గోల్డ్ కలర్ బాక్స్ ఇవ్వబోతే ఈ బాక్స్ నచ్చలేదని అటుయిటు తిరగేసి చూసి నెక్లేస్ బాగ్ లో వేసుకొని వెళ్ళిపోయిందట. “

“ఓకే ..ఈ బాక్స్ ప్యాక్ చేయించి శిరీషకు యివ్వు. రేపు నైనో క్లాక్ కే యు మస్ట్ బి రెడీ విత్ మల్హోత్రా .

ఓకే బాస్ !

           ****

కరెక్ట్ గా గడియారం పది గంటలు చూపిస్తుoడగా ఏ అమ్మాయి షాప్ లోకి అడుగుపెట్టింది.సేట్ మర్యాదగా ఆహ్వానించి కుర్చీ చూపించాడు.అంతలో అవినాష్ గోల్డ్ బాక్స్ తెచ్చి ఎ అమ్మాయికి అందించాడు. అమ్మాయి బాక్స్ ఓపెన్ చేసి నెక్ లేస్ చూస్తూనే 

“సెట్ జీ! ఇది నేను ఆర్డర్ యిచ్చింది కాదు.”

“సారీ అమ్మాజీ ! అరే భాయ్ జరా దేఖకే కాం కరోనా ..”

అవినాష్ బాక్స్ తీసుకోని వెళ్ళిపోయాడు.

పదిహేను నిమిషాల తర్వాత వేరే రూం నుండి బాలీ తో బయటి కొచ్చిన శాoడిల్య ..అమ్మాయిని చూస్తూ.

యుఅర్ అండర్ అరెస్ట్.

అనగానే అమ్మాయి తూలిపడిపోబోతూ తెల్ల ముఖంతో చూసింది.

*********                          ఏసీపీ శాoడిల్యఆఫీస్ ..టీవీ ఛానల్ రిపోర్టర్స్ తో నిండిపోయింది.

పారిశ్రామికవేత్త రఘురాం మైక్ ముందుకొచ్చారు.

“మీకు చాలా టెన్షన్ క్రియేట్ చేశారు నా కుమార్తెలు.       ఇద్దరూ ఐడెంటికల్ ట్విన్స్.మీ షాప్ లో నెక్ లేస్ ఆర్డర్ చేసి తీసుకెళ్ళిన అమ్మాయి రమ్య. అదే టైం లో కొడైకెనాల్ ట్రావెల్ చేసింది కృష్ణ. రమ్య యిక్కడ కృష్ణ ఆంధ్రాలో క్రిమినాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.అసైన్ మెంట్ వర్క్ అoటు..ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని డిడి తీసుకోని..ప్రాజెక్ట్ అయిపోగానే సేట్ జీకీ క్షమాపణలు చెపుతామని నన్ను ఒప్పించారు.అసలా ప్రాజెక్ట్ ఏమిటో మా అమ్మాయిలు వివరిస్తారు.

అమ్మాయిలిద్దరూ గుసగుసలాడుకొన్నారు. కృష్ణ మైక్ తీసుకుంది.

డియర్ అంకుల్స్ !మమ్మల్ని క్షమించండి. ఈ సమ్మర్ అసైన్ మెంట్ గా ..”క్రైమ్ నెవెర్ పేస్..నేరస్తుడికి రెండే కళ్ళు చట్టానికి వెయ్యి కళ్ళు “..అనే సబ్జెక్టు తీసుకున్నాము. ప్రాక్టికల్ గా పరీక్షించాలనే క్యూరియాసిటితో ఈప్రయత్నం చేసాము. మనం ఓడిపోతాము అని నేను చెప్పినా మన అమ్మానాన్నలే మనల్ని గుర్తు పట్టలేరు ..చూద్దాం చట్టం ఏమి చేస్తుoదో అని మా రమ్యక్క ఇలా ప్లాన్ చేసింది. సేట్జీ గుర్తుపట్టలేదు.రెండో నెక్లేస్ యివ్వడానికి రెడీ అయిపోయారు.

శాండిల్య కల్పించుకొని .                  క్రిమినాలజీ లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేస్తున్న మీకు థర్డ్ ఐ డిటెక్టివ్ ఏజెన్సీ మిస్టర్ బాలి అండ్ కో గురించి తెలియదా?నెక్లెస్ యివ్వడమనేది ట్రాప్.”

రమ్య లేచి 

“విన్నాము గానీ యింత ప్లాన్డుగా చేసినాదొరికిపోతామనుకోలేదు. బట్ హౌ?

డిటెక్టివ్ బాలీ వివరించాడు.                “క్రిమినాలజీ చదువుతున్న మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈకేస్ లో ఫండమెంటల్స్ విస్మరించారు.                     నెంబర్ వన్ ..ఐడెన్టిటి.. హైడ్ చేసుకోవాలి కానీ మీరు రివీల్ చేసు కున్నారు.                             నెంబర్ టు.. క్లూవదలకూడదు. కానీ మీరుక్లూ ఇచ్చేశారు.         నెంబర్ త్రి.. గ్లవ్స్ లేకుండా క్రైమ్ కమిట్ కాకూడదు. ఫింగర్ ప్రింట్స్ వదిలేసారు.

ఎయిర్ పోర్ట్ అమ్మాయి కృష్ణ ..షాప్ కొచ్చిన అమ్మాయి రమ్య వాకింగ్ స్టైల్స్ డిఫరెంట్ . మా అవినాష్ సిసి కెమారా క్లిప్పింగ్స్ ప్లేచేయగానే నాకు అర్ధమైపోయింది.యిద్దరమ్మాయిల స్కీం యిదని.

కలర్ జిరాక్స్ యిచ్చారు ..ఒరిజినల్ లేకుండా హౌడుయు గెట్ జిరాక్స్?

ఫింగర్ ప్రింట్స్. ఆ రోజున నెక్లెస్ తో బాటు బాక్స్ కూడా తీసుకు వెళ్ళివుంటే ఆ బాక్స్ మీదున్న నీఫింగర్ ప్రింట్స్ మాకు దొరికేవికాదు. కేస్ చాలా కాoప్లికేట్ అయ్యేది. యివ్వాళ బాక్స్ మార్చింది కూడా నీఫింగర్ ప్రింట్స్ కోసమే . నువ్వు షాప్ లో కూర్చున్న టైం లోనే ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ మల్హోత్రా రెండు బాక్స్ ల మీదున్న ఫింగర్ ప్రింట్స్ ఒక్కరివే నని నిర్ధారించారు. అందుకే చీటింగ్ కేస్ క్రింద నిన్ను అరెస్ట్ చేయాలనుకున్నాము.

“ఔనుసర్ !ఆ రోజు నా చేతిలో చిన్న హ్యాండ్ బాగ్ వుంది. బాక్స్ అందులో పట్టదు. ఆ ఖరీదైన బాక్స్ చేతిలో వుంటే అoదరూ గమనిస్తారని ..పైగా క్రైం కమిటయ్యే మూమెంట్ అది..టెన్షనే టెన్షన్ .సర్ ! నేరం చేయాలంటే గట్స్ వుండాలి. “                    “అమ్మాయిలూ మీలో స్పార్క్ వుంది. మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయినాక ఇంటరెస్ట్ వుంటే “ వెల్కం టు అవర్ థర్డ్ ఐ డిటెక్టివ్ ఏజెన్సీ” *


Rate this content
Log in

Similar telugu story from Thriller