డిటెక్టివ్ శారద
డిటెక్టివ్ శారద
శారదా! అని శంకరాభరణం శంకరశాస్త్రి లెవెల్లో అరిచాడు ఆమె తండ్రి. శారద భయపడలేదు.
నాన్నా. నేను చెప్పేది నిజం. మీకు నిరూపిస్తాను చూడండి అంటూ అజయ్ కంప్యూటర్ ఆన్ చేసింది. అజయ్ శారద వాళ్ళింట్లో అద్దెకుంటున్నాడు.
ఈ మధ్య శారదకు తెలీకుండానే ఆమె ఫోటోలు కొన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ అయ్యాయి. అది నకిలీ ఖాతా అని ఆమెకు అర్థమయ్యింది. కానీ వాళ్ళ నాన్న కి అది నిరూపించడం ఎలా?
ఆమె ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించడం మొదలు పెట్టింది. తన పరిసరాల్ని బాగా గమనించింది. అజయ్ ఆమె ఫోటోలు తీసి ఉండవచ్చని అనుమానం రాగానే ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ను సంప్రదించింది. అందులో హ్యాకింగ్ సర్వీస్ ఇచ్చే వ్యక్తులతో మాట్లాడి అజయ్ లేనప్పుడు అతని వైఫై వివరాలు ఇచ్చింది.
వాళ్ళు వైఫై నుంచి అజయ్ కంప్యూటర్ హ్యాక్ చేసి శారద ఫోటోలు ఆ కంప్యూటర్ నుండి అప్లోడ్ అయినట్లు తేల్చారు.
శారద అన్ని ఆధారాలూ తండ్రి ముందు ఉంచింది.
అన్నీ విని ఆ ఫోటోలు డిలీట్ చేయించమని, ఇకపై శారదను జాగ్రత్తగా ఉండమని మందలించాడు.
కొత్త వాళ్లు వస్తున్నారని అజయ్ ని రూం ఖాళీ చేయించగలిగారు.
డిటెక్టివ్ లాగా ఆలోచించి నిజాన్ని నిరూపించగలిగింది కానీ, శారద అజయ్ ని ఏమీ చేయలేకపోయింది. మళ్లీ అతను కనపడినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో తనను తాను నిందించుకుంటూ
ఉండిపోయింది.
