Shaik Sameera

Thriller


3  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins 225 5 mins 225

             ఎపిసోడ్ -12

వంశ్ ఏమైంది రాజ్ అని అడుగుతాడు .రాజ్ unknown person ని పట్టుకోవడానికి గేట్స్ క్లోజ్ చేయడానికి వెళ్తుంటే ఇషాని బయటికి వెళ్తుంది తనని ఆపి ఇక్కడికి తీసుకొచ్చాను అంటాడు .అందుకు ఇషాని తన హ్యాండ్ బ్యాగ్ విసిరేసి నువ్వు నన్ను ఆపడమే కాకుండా మా అన్నయ్య ముందు నాపైన కంప్లయింట్ చేస్తావా నీకెంత ధైర్యం అని రాజ్ పైన అరుస్తుంది .ఇషాని హ్యాండ్ బ్యాగ్ నుండి కేబుల్ కట్టర్ పడటం చూసి వంశ్ దాన్ని తీసుకొని ఈ కట్టర్ నీ బ్యాగ్ లో ఎలా వచ్చింది అని అడుగుతాడు .అందుకు ఇషాని మీరు ఇంట్లో వాళ్ళని కూడా అనుమానిస్తున్నారా మీరు అనుమానించాలంటే ముందు రిథిమాని అనుమానించాలి అంటుంది .రిథిమా కట్టర్ చూసి ఇది ఇషాని బ్యాగ్ లో కబీర్ పెట్టాడా అని మనసులో అనుకుంటూ అయితే కబీర్ సేఫ్ గా వెళ్ళిపోయాడు అని రిలీఫ్ అవుతుంది.

వంశ్ ఇషాని అనుమానించట్లేదు అడుగుతున్నాను కరెంట్ లేనపుడు అది లాక్ డౌన్ టైమ్ లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు లేదా ఎవరిని అయిన తప్పించడానికి హెల్ప్ చేస్తున్నావా అని అడుగుతాడు .ఇషాని క్లాప్స్ కొడుతుంది మీ అనుమానాలన్నీ నేను కేర్ చేయను ఏది అనుకుంటారో అది అనుకోండి అంటుంది .వంశ్ బాబాయ్ ,పిన్ని ,ఆర్యన్ వస్తారు రిథిమా అక్కడ నుండి దూరంగా వెళ్తుంది .వంశ్ ఇషాని అనుమానించట్లేదు నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తున్నా అంటాడు .ఇంట్లో వాళ్ళ పైన డౌట్ పడుతూ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అని ఇషాని అడుగుతుంది .వంశ్ పిన్ని నిజమే కదా నిన్న ఏమో ఆర్యన్ మీద ఇప్పుడేమో ఇషాని మీద డౌట్ పడటం కరెక్ట్ కాదు అంటుంది .వంశ్ బాబాయ్ వంశ్ కరెక్ట్ గానే చేస్తున్నాడు తనదయిన శైలి లో ఫ్యామిలీ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు మనం కూడా రూల్స్ పాటించాలి కదా అంటాడు .అది కరెక్ట్ కాదు అని ఆర్యన్ అంటాడు .వంశ్ బాబాయ్ పిన్ని గొడవపడుతూ ఉంటారు .అప్పుడే వంశ్ నానమ్మ ఆపండి మీ గొడవలు అని అరుస్తుంది .ఈ ఇల్లు ఎప్పుడు మీకు ఆప్యాయతల గురించి నేర్పించలేదు ఒకవేళ నేర్పించి వుంటే ఈ ఇల్లు ఇలా ఉండేది కాదు అని చెప్పి తన తల పట్టుకుంటుంది .రిథిమా నానమ్మ ని పట్టుకుంటుంది వంశ్ కూడా వచ్చి నానమ్మ బాధపడొద్దు ఎవరైతే మన ఇంట్లోకి వచ్చాడో వాడిని అతనికి హెల్ప్ చేసిన వాళ్ళని వదలను అని రిథిమా వైపు చూసి వెళ్ళిపోతాడు .

కబీర్ VR మాన్షన్ నుండి వచ్చేటపుడు తన కాలు బెణుకుతుంది .మిశ్రా తన కాలికి కట్టు కడుతూ మీ తలరాత బాగుంది లేకపోతే ఇంత చిన్న దెబ్బతో VR మాన్షన్ నుండి బయటికి వచ్చేవారు కాదు అంటాడు .వంశ్ నన్ను పట్టేసుకునేవాడే కానీ ఎలాగో తప్పించుకునేశాను అంటాడు కబీర్ .వంశ్ శరీరం లో రక్తం కన్నా అనుమానమే ఎక్కువ ప్రవహిస్తుంది అందుకే తన అనుమానాన్ని ఇషాని మీదకి డైవర్ట్ చేశాను కట్టర్ తన బ్యాగ్ లో వేసి అంటాడు .మిశ్రా అయితే మనం గెలిచాము కదా అంటాడు .అందుకు కబీర్ ఇప్పుడు విన్ అయ్యామని పార్టీ చేసుకునే టైమ్ కాదు వంశ్ తన ఇంట్లోకి వచ్చిన unknown పర్సన్ పట్టుకోవడానికి ఏదైనా చేస్తాడు అంటాడు .

వంశ్ మార్నింగ్ మాన్షన్ బయట గార్డెన్ ఏరియా లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటూ బాల్ గోల్ చేస్తూ ఉంటాడు .రాజ్ వంశ్ దగ్గరికి వస్తాడు తనని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని పంపిస్తాడు .రిథిమా గార్డెన్లో వైట్ డ్రెస్ లో పూలు కోస్తూ పూలబుట్టలో వేస్తూ ఉంటుంది .వంశ్ తననే చూస్తూ ఉంటాడు రిథిమా తన మొహం మీద పడిన ముంగురులను సరి చేసుకోవడం అంతా వంశ్ చూస్తూ ఉంటాడు .వంశ్ బాల్ గోల్ చేయాలనీ బాల్ పైకి ఎత్తేసరికి రిథిమా చేతిలో ఉన్న పూలబుట్టకి ఉన్న అడ్డం ఫోకస్ తన కళ్ళలో పడి గోల్ మిస్ అవుతుంది వంశ్ షాట్ మిస్ అయ్యిందని కోపంలో చేయి ముందుకి విసిరినట్టు చేస్తాడు తన భుజం పట్టేసి పెయిన్ తో అరుస్తాడు .

రిథిమా- వంశ్ అరుపు విని తన దగ్గరికి వెళ్తుంది ఏమైంది అని అడుగుతుంది. 

వంశ్ -నీ వాళ్ళ షాట్ మిస్ అయింది అని కింద కూర్చుంటాడు వంశ్ .

రిథిమా -నా వల్ల షాట్ మిస్ అయిందా నిలబడండి అంటుంది వంశ్ ని .

వంశ్ -ఎందుకు 

రిథిమా -స్ట్రెచింగ్ చూపిస్తాను మీకు పెయిన్ తగ్గడానికి .

వంశ్ -నాకు పెయిన్ ఏం లేదు రిలాక్స్ అంటాడు .

రిథిమా -చూస్తే అలా అనిపించట్లేదు పెయిన్ భరించలేకపోతున్నారు అంటుంది .

వంశ్ లేచి నిలబడతాడు .

రిథిమా- వంశ్ తో స్ట్రెచింగ్ చేపిస్తూ ఇంత జోష్ లో బాస్కెట్ బాల్ ఆడాలిసిన పనేముంది అని అడుగుతుంది .

వంశ్- ఇది గేమ్ కాదు నా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది .నాకు ఏదైనా విషయంలో క్లారిటీ రాకపోతే నేను బాల్ ఎన్ని సార్లు గోల్ చేస్తానో అంత క్లారిటీ నాకు వస్తుంది కానీ ఈరోజు కొంచెం కూడా క్లారిటీ రాలేదు నాకు అంటాడు. 

రిథిమా -దేని మీద క్లారిటీ రాలేదు మీకు

వంశ్ -నీ మీదే అంటాడు .స్ట్రెచింగ్ చేపిస్తున్నపుడు రిథిమా మెడ లో ఉన్న చైన్ బయటికి రావడం వంశ్ చూస్తాడు .

రిథిమా -మీరు బయటికి కనపడేంత మీరు చూపించేంత స్ట్రాంగ్ కాదు ఇంత చిన్న బాధ కూడా భరించలేకపోతున్నారు .

వంశ్ -శరీరం యొక్క బాధ భరించడం సులభం కానీ మనసు పెట్టే బాధ భరించలేము అంటాడు.

రిథిమా -తెలుసు అంటుంది 

వంశ్ -ఎలా 

రిథిమా -ఫీజియోథెరపిస్టుని కదా బాధ తో పరిచయం ఉంటుంది కదా అంటుంది .అందుకు వంశ్ అవును అని తల ఊపుతాడు అది చూసి రిథిమా ఇంత ఈజీగా ఒప్పేసుకున్నారు నేను చెప్పినదానికి మీ వంశ్ రాయ్ సింఘానియా థియరీ అడ్డు రాలేదా అంటుంది.

వంశ్ -పెయిన్ తగ్గిందని బెటర్ అని లాయర్ & డాక్టర్ తో గొడవ మన మీదే ఎఫక్ట్ చూపిస్తుంది .ఇలాంటి టైమ్ లో నువ్వు చెప్పిన దానికి ఒప్పుకోకపోతే ట్రీట్మెంట్ ఏదో తేడా చేసి ఏదైనా చేస్తావు కదా అని జోక్ చేస్తాడు .రిథిమా నవ్వుతుంది .ఎంత అందమైన నవ్వో అంతే అందమైన రహస్యం కూడా ఉంటుంది నవ్వు వెనక దాచిపెడతారు ఎవరికీ తెలియకుండా అంటుంది.

రిథిమా -ఒక మందు చెబుతాను తెప్పించుకోండి అది తీసుకుంటే మీకు పెయిన్ తగ్గుతుంది .సియా ట్రీట్మెంట్ ఉందని వెళ్ళిపోతుంది .

వంశ్ దగ్గరికి రాజ్ వచ్చి బాస్ కరెంట్ పోయి వచ్చాక సీసీటీవీ ఆన్ అవ్వడానికి కొంచెం టైమ్ పడుతుంది ఆ టైమ్ ని use చేసుకొని ఆ unknown person తప్పించుకున్నాడు ఇంటి నుండి సీసీటీవీలో రికార్డు అవ్వకుండా అంటాడు .అందుకు వంశ్ సరే నేను చెప్పింది తెచ్చావా అని అడుగుతాడు రాజ్ ఒక గిఫ్ట్ ప్యాక్ వంశ్ కి ఇస్తాడు .రిథిమా సియాకి ట్రీట్మెంట్ చేస్తూ వుండగా వంశ్ వచ్చి ఆ గిఫ్ట్ రిథిమాకి ఇవ్వబోతాడు .రిథిమా ఏంటి ఇది అని అడుగుతుంది నీ ఫీజు నా భుజానికి స్ట్రెచ్ చేపించి పెయిన్ తగ్గించావు కదా అంటాడు .అందుకు రిథిమా గిఫ్ట్ అవసరం లేదు నేను డాక్టర్ గా నా responsibility మాత్రమే చేశాను అంటుంది .అందుకు వంశ్ కోపంగా నాకు సహాయం చేయడమే వచ్చు సహాయం తీస్కోడం రాదు ఎవరి ఋణం అయిన వెంటనే తీర్చుకోవాలి లేకపోతే మనకి అవకాశం రాకపోవచ్చు అని గిఫ్ట్ సియా పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు .

సియా ఆ గిఫ్ట్ తీసుకొని ఎందుకు నువ్వు అన్నయ్య ని అప్సెట్ చేస్తావు ఈ గిఫ్ట్ తీసుకో అని రిథిమా చేతిలో పెడుతుంది .రిథిమా ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తే అందులో మొబైల్ ఉంటుంది.అది చూసి సియా అన్నయ్య ఇలాంటి గిఫ్ట్ ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు అన్నయ్యకి నీ మీద నమ్మకం వచ్చింది అనిపిస్తుంది అంటుంది .రిథిమా ఇప్పుడే వస్తాను అని మొబైల్ తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది .రిథిమా వంశ్ కి నా మీద నమ్మకం కలిగినట్టు ఉంది ఈ విషయం కబీర్ కి చెబితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అని తనకి కాల్ చేస్తుంది .కబీర్ జీప్ లో వెళ్తూ ఉంటాడు కాల్ unknown number నుండి రావడం చూసి ఎవరా అని లిఫ్ట్ చేస్తాడు .రిథిమా హలో కబీర్ వంశ్ నన్ను నమ్ముతున్నాడు అంటుంది .అందుకు కబీర్ రిథిమా ఇది ఎవరి నెంబర్ నీకు ఎందుకు అనిపిస్తుంది వంశ్ నిన్ను నమ్ముతున్నాడని అని అడుగుతాడు .అప్పుడు రిథిమా కబీర్ వంశ్ నాకు మొబైల్ గిఫ్ట్ ఇచ్చాడు ఆ నెంబర్ నుండే నీకు కాల్ చేస్తున్నా ఈ నెంబర్ కి జామర్ clearence కూడా ఉంది ఇక నీకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని హ్యాపీ గా చెబుతూ ఉంటుంది .అందుకు కబీర్ జీప్ ఆపి రిథిమా ఇది వంశ్ ట్రాప్ కాల్ కట్ చేయి అని కాల్ చేస్తాడు వంశ్ కి తన లొకేషన్ తెలిసిపోయి ఉంటుందని మొబైల్ ఆఫ్ చేస్తాడు .వంశ్ రిథిమా యే నెంబర్ కి కాల్ చేసిందో మొబైల్ ట్రాకర్ ద్వారా లోకేషన్ తెలుసుకొని అతనెవరో తీసుకొని రమ్మని రాజ్ ని పంపిస్తాడు .రిథిమా చేసిన ఈ తప్పు వల్ల తన నిజమేంటో తెలిసిపోతుంది అనుకుంటాడు వంశ్ .రిథిమా కబీర్ చెప్పినట్టు ఇది వంశ్ ట్రాప్ ఏమో అని టెన్షన్ పడుతుంది .

కొద్దిసేపటికి రిథిమా మొబైల్ కి అన్నోన్ number నుండి కాల్ వస్తుంది రిథిమా లిఫ్ట్ చేస్తుంది .వంశ్ హలో అని నీ సీక్రెట్ నా దగ్గర ఉంది నువ్వు వస్తే నీకు చూపిస్తాను అని కాల్ కట్ చేస్తాడు .రిథిమా కబీర్ దొరికాడేమో వంశ్ కి అని ఆలోచిస్తూ మాన్షన్ బయటికి రాగానే వంశ్ పంపించిన కార్ ఉంటుంది దాన్ని ఎక్కమని డ్రైవర్ చెప్పగానే ఎక్కుతుంది .రిథిమా వంశ్ కి కబీర్ దొరికాడని తనని చంపేసినట్టు ఊహ వస్తూ ఉంటుంది .కార్ ఒక ప్లేస్ లో ఆగగానే రిథిమా తొందరగా లోపలికి వెళ్తుంది అక్కడ ఒక అతన్ని మొహం కనిపించకుండా అవతల వైపుకి ఒక చైర్ కి కట్టేసి కొడుతూ ఉంటాడు వంశ్ .అది చూసి రిథిమా భయపడి ఏడుస్తుంది .వంశ్ కొట్టే దెబ్బలకి అతను చైర్ తో సహా రిథిమా వైపు కింద పడతాడు అది చూసి రిథిమా క అంటూ షాక్ లో ఉండిపోతుంది .Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller