Shaik Sameera

Thriller


3  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins 205 4 mins 205

               ఎపిసోడ్ -6

రిథిమా మీద వంశ్ గన్ aim చేసి చెప్పు నిన్ను ఎవరు పంపించారు ఇక్కడికి నన్ను మోసం చేసినవాళ్లు ఎవరు బ్రతకలేరు అంటాడు .రిథిమా మనసులో కబీర్ ఐ లవ్ యు నేను ఓడిపోయాను మిషన్ లో అనుకోని కల కంటుంది వంశ్ కి తన నిజం తెలిసిపోయిందని భయంతో పొరపొతుంది వంశ్ నానమ్మ రిథిమాకి నీళ్లు ఇస్తుంది .ఇషాని నానమ్మ ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మన లాంటి వాళ్ళ ఫుడ్ ఎక్కడ పడుతుంది చెప్పు అంటుంది .అందుకు సియా తనని ఎవరో తలుచుకున్నారు .ఆర్యన్ ఇక్కడ వంశ్ అన్నయ్య పర్మిషన్ లేకుండా ఎవరిని ఎవరు తలుచుకోకూడదు అనగానే వంశ్ కోపంతో వెళ్ళిపోతాడు .రిథిమా వాటర్ తాగి కిందపడిన ట్రాన్స్మిటర్ తీసుకొని ఎవరికీ కనిపించకుండా తన బ్యాగ్ లో పెట్టుకుంటుంది .రిథిమా ఇంటి బయటికి వెళ్లి ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేస్తుంది .కబీర్ కి రిథిమా ట్రాన్స్మిటర్ కనెక్ట్ అయినట్టు సిగ్నల్ వస్తుంది .

కబీర్ - హలో రిథిమా are you safe అంటూ వుండగా రిథిమా ఏడవటం వినిపిస్తుంది .

రిథిమా - హలో కబీర్ iam safe కానీ నాకు ఇక్కడ చాలా భయమేస్తుంది .ఈ ఇల్లు ఈ మనుషులు నాకు భయమేస్తుంది ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు వెంటనే అని ఏడుస్తుంది .

కబీర్ - ప్లీజ్ రిథిమా ఏడవకు నేను నిన్ను తీస్కెళ్లిపోతాను .అసలు నాదే తప్పు నా మిషన్ కోసం నేను నిన్ను ఇరికించాను .నేను చాలా స్వార్థంగా ఆలోచించాను నా మిషన్ కోసం iam sorry నేను వచ్చి తీసుకొని వస్తాను నిన్ను ఈ మిషన్ ఆపేద్దాం అంటాడు .

రిథిమా -వద్దు కబీర్ అలా అనకు .నేను భయపడ్డాను కానీ ఇప్పుడు నీతో మాట్లాడక చాలా ధైర్యం వచ్చింది. నేను ఇప్పుడు ఈ మిషన్ కోసం వర్క్ చేస్తాను 

కబీర్ - వద్దు రిథిమా నీకన్నా ఈ మిషన్ నాకు ఎక్కువ కాదు ప్లీజ్ వచ్చేయ్ .

రిథిమా -ప్లీజ్ కబీర్ నేను నీ లైఫ్ పార్టనర్ ని కదా నీ మిషన్ కోసం వర్క్ చేయలేనా చేస్తాను వంశ్ కి సంబంధించిన ప్రూఫ్స్ తప్పకుండా సంపాదిస్తాను అని ఎవరో రావడం సౌండ్ విని ట్రాన్స్మిటర్ కట్ చేసి దాక్కుంటుంది .

వంశ్ గార్డెన్ ఏరియా వైపు వెళ్లడం రిథిమా చూస్తుంది .వంశ్ ని ఫాలో అయితే ఏదైనా ప్రూఫ్స్ దొరుకుతాయేమో అని తన వెనకే ఫాలో అవుతూ ఉంటుంది .రిథిమా వంశ్ ని ఫాలో అవుతూ ఫ్లవర్ వాజ్ కిందపడేస్తుంది టెన్షన్ లో ఆ సౌండ్ విని వంశ్ ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తాడు .రిథిమా వంశ్ కి కనపడకుండా దాక్కుంటుంది .వంశ్ కి ఎవరు కనపడరు ఎవరు లేరని చూసి గార్డెన్ ఏరియా లోకి వెళ్తాడు .రిథిమా కూడా వంశ్ వెనకే వెళ్తుంది .వంశ్ గార్డెన్ ఏరియా లో ఒక విగ్రహం తో నన్ను మోసం చేసావు అందుకే దానికి శిక్ష వేసాను నీకు .నన్ను ఎవరు మోసం చేసిన వాళ్ళకి కూడా అదే శిక్ష పడుతుంది నీకు పడినట్టు నీ మోసం నా మనసులో అలాగే ఉంది అందుకే ఇంకా ఎక్కువ జాగ్రత్త గా ఉంటున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు .దూరం నుంచి చూస్తున్నా రిథిమా వంశ్ ఎవరితో ఈ టైములో మాట్లాడుతున్నాడు అని చూడాలని కొంచెం ముందుకి వెళ్ళబోతే రిథిమా కాలు ఎండిన ఆకుల మీద పడి సౌండ్ వస్తుంది అది వంశ్ విని ఎవరు అని వెతుకుంటూ వస్తాడు .రిథిమా తొందరగా ఇంటిలోకి వెళ్ళిపోతుంది .కానీ వంశ్ కి గార్డెన్ ఏరియా లో ఉన్న మట్టి కాళ్ళ గుర్తులు కనిపిస్తాయి వాటిని ఫాలో అవుతూ వెళ్తాడు .

రిథిమా తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి తనవి ఏవి కింద పడలేదు కదా అని చెక్ చేసుకుంటుంది .వంశ్ ఆ గుర్తులు రిథిమా రూమ్ వరకు ఉండటం చూసి రేపటి రోజు చాలా స్పెషల్ గా ఉంటుంది అని వెళ్ళిపోతాడు .రిథిమా తన బెడ్ మీద పడుకొని కబీర్ ఇచ్చిన హార్ట్ సింబల్ పిల్లో ని పట్టుకొని కబీర్ ని తలుచుకుంటుంది .కబీర్ రిథిమా హాస్టల్ లో ఉన్నపుడు ఈ పిల్లో గిఫ్ట్ గా ఇస్తాడు .ఈ పిల్లో తనతో వుంటే తనే తనతో ఉన్నట్టు అని చెప్పి ఇస్తాడు అది గుర్తొచ్చి ఆ పిల్లో గట్టిగా పట్టుకొని నిద్రపోతుంది .

రిథిమా మార్నింగ్ లేచి రెడీ అవుతూ వుండగా వెనక నుండి ఎవరో తన పైన కత్తి aim చేసి ఉంటారు .రిథిమా వెనక్కి తిరిగి చూస్తే వంశ్ పిన్ని తమ్ముడు మెహెర్ ఉంటాడు కత్తి తో రిథిమా అతన్ని చూసి భయపడి అరుస్తుంది .ఆ అరుపుకి మెహెర్ తన చేతిలోని కత్తి కింద పడేస్తాడు ఎందుకు అరిచావు అని అడుగుతాడు మెహెర్ .ఇలా కత్తి తో నిలుచుంటే భయపడరా ఎవరైనా అంటుంది రిథిమా .మెహెర్ నేను ఒక novelist ని ఒక నవల రాస్తున్నా అందుకు ప్రాక్టీస్ చేస్తున్న ఇది డూప్లికేట్ కత్తి అంటాడు .నవల స్టోరీ ఏంటంటే ఇలాగే ఒక మాన్షన్ లో ఒక అమ్మాయి తన ఐడెంటిటీ మార్చుకొని వస్తుంది ఎలా ఉంది స్టోరీ అని రిథిమా ని అడుగుతాడు .రిథిమా స్టోరీ అయిన నా గురించే చెప్పినట్టు ఉంది అని టెన్షన్ పడుతుంది మెహెర్ వెళ్ళిపోతాడు .

వంశ్ నానమ్మ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంట్లో గణపతి పూజ పెట్టానని ఎవరైనా హెల్ప్ చేయమని పూజ చేయడంలో అని ఇంట్లో వాళ్ళని అడుగుతుంది కానీ అందరూ ఏదో ఒక వర్క్ ఉందని తప్పించుకుంటారు .డిసోజా వచ్చి వంశ్ ఫ్యామిలీ మెంబర్స్ ని వంశ్ అందరిని హాల్ లోకి రమ్మని పిలుస్తున్నాడని చెబుతుంది .అప్పుడే అక్కడికి వచ్చిన మెహెర్ వంశ్ పిలుస్తున్నాడా అందరిని ఎవరి నిజస్వరూపం తెలిసిపోయింది అంటాడు అందరూ హాల్ లోకి వెళ్తారు .రిథిమా కూడా హాల్ లో ఉంటుంది వంశ్ తన ఫ్యామిలీ తో పాటు నన్ను కూడా ఎందుకు పిలిచాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది .వంశ్ వచ్చి అందరికి హౌస్ రూల్స్ తెలుసు కానీ రాత్రి ఒకరు రూల్స్ బ్రేక్ చేసి గార్డెన్ ఏరియా లోకి వచ్చారు ఎవరు వాళ్ళు చెప్పండి అంటాడు .అందుకు ఇషాని అన్నయ్య మమ్మలని ఎందుకు అడుగుతున్నావు మాకందరికీ హౌస్ రూల్స్ తెలుసు మేము ఎందుకు హౌస్ రూల్స్ బ్రేక్ చేస్తాము కొత్తగా వచ్చిన రిథిమా నే బ్రేక్ చేసి ఉండాలి తననే ఇంట్రాగేట్ చేయి అంటుంది .వంశ్ రిథిమా ని నిన్న రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటాడు నా రూంలో నే నిద్రపోయాను అంటుంది అలా అయితే నువ్వు వెళ్ళిపో అంటాడు వంశ్ రిథిమా తో తను వెళ్తుంది .వంశ్ వెనక నుండి నువ్వు రూమ్ లో వుంటే నీ సాండల్స్ పైన గార్డెన్ ఏరియా మట్టి ఎలా వచ్చింది అని అడుగుతాడు రిథిమాని .రిథిమా అది విని షాక్ అవుతుంది .Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller