Shaik Sameera

Thriller


3  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins 193 5 mins 193

             ఎపిసోడ్ -17

రిథిమా స్టడీ రూమ్ నుండి కిందకి వచ్చి డిసోజాని పై రూమ్ నుండి క్లీన్ చేసిన చెత్త ఎక్కడ వేస్తారు అని అడుగుతుంది.డిసోజా మాన్షన్ లోని మొత్తం చెత్త గేట్ బయట ఉన్న పెద్ద డస్ట్ బిన్ లో వేస్తాము అని చెబుతుంది.రిథిమా అది ఎప్పుడు క్లియర్ అవుతుంది అడుగుతుంది అందుకు డిసోజా ఈవెనింగ్ 5క్లాక్ కి క్లియర్ అవుతుంది అంటుంది.అది విని రిథిమా గడియారం వైపు చూసి 3:30 అవ్వడం చూసి త్వరగా వెళ్లాలని వెళ్తుంది.వంశ్ రాజ్ తో స్టడీ రూంలో నీకు తెలుసు కదా షీరా ఎంత ముఖ్యమో అని అనగానే రాజ్ iam sorry boss అంటాడు.వంశ్ రాజ్ తో మాన్షన్ మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ చేయి ఇంట్లో ప్రతి కార్నర్ షీరా దొరకడం మనకి చాలా ముఖ్యం టైమ్ చాలా తక్కువ ఉంది అంటాడు.రిథిమా బయటికి వెళ్తూ వుండగా వంశ్ అమ్మ అనుప్రియ చూసి రిథిమా ఎక్కడికి వెళ్తున్నావు కొంచెంసేపట్లో నీ మెహందీ స్టార్ట్ అవుతుంది.ఇంకా వంశ్ గురించి తెలుసుకోలేదు కదా నువ్వు వంశ్ కి ఆలస్యం అస్సలు నచ్చదు go and get ready అంటుంది.రిథిమా అందుకు కొంతసేపటిలో రెడీ అవుతాను అంటుంది.అనుప్రియ ఇప్పుడు ఎందుకు రెడీ కావు వెళ్లి నీ మెహందీ కన్నా ముఖ్యమైనది ఏం ఉంది.రిథిమా ఈ హౌస్,ఈ పెళ్లి,మేము నీకు కొత్త కావొచ్చు.నేను నా కొడుకు విషయంలో చాలా ప్రొటెక్టీవ్.వంశ్ ని ఎవరు హర్ట్ చేయడం నాకు నచ్చదు.మైండ్ ఇట్ ఎవరు అయిన నాకు నచ్చదు. నువ్వు ఈ హౌస్ ఎంప్లాయ్ కాదు వంశ్ వైఫ్ వి కాబోతున్నావు నువ్వే రూల్స్ బ్రేక్ చేస్తే సర్వెంట్స్ ని ఎలా కంట్రోల్ చేయగలవు.వంశ్ రూల్స్ బ్రేక్ చేసే హక్కు అమ్మ అయిన నాకే లేదు కాబట్టి నువ్వు చాలా కేరింగ్ గా ఉండాలి.నేను ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉంటా ఎప్పటివరకు అంటే నా వంశ్ ని నువ్వు సంతోషంగా ఉంచగలవు అని నాకు నమ్మకం నమ్మకం కలిగే వరకు చూస్తూనే ఉంటాను go and get ready అంటుంది.

రిథిమా వెళ్తూ మనసులో ఒకటిన్నర గంటలో ఎలాగైనా షీరా ని డస్ట్ బిన్ నుండి తీసుకొని రావాలి అని అనుకుంటూ రెడీ అవ్వటానికి రూమ్ కి వెళ్ళిపోతుంది.కబీర్ రిథిమా,వంశ్ పెళ్లి అని న్యూస్ పేపర్ లో చూసి నో అని అరుస్తూ వంశ్ ట్రాప్ ఇది రిథిమాని ట్రాప్ చేయడానికి ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి రిథిమాని తీసుకొని వచ్చేస్తాను అని వెళ్ళబోతుండగా మిశ్రా ఆపేస్తాడు.సార్ వంశ్ మాన్షన్ లోకి వెళ్లడం అంటే పులి బోనులోకి వెళ్లడమే మీ చిన్న తప్పు కూడా రిథిమా ప్రాణాలకి ప్రమాదం అవుతుంది గుర్తుందిగా పోయినసారి ఏం జరిగిందో అని కబీర్ ని ఆపుతాడు.అందుకు కబీర్ అయితే ఏం చేయను పెళ్లి అయ్యేదాకా ఎదురు చూడాలా నేను మన మిషన్ కోసం రిథిమా పెళ్లి ఒక క్రిమినల్ తో అవుతున్న చూస్తూ ఉండాలా అని రిథిమా తనకి ఇచ్చిన రింగ్ చూస్తూ రిథిమా ట్రైన్డ్ స్పై కాదు ఒక సెన్సిటివ్ అమ్మాయి ఇదంతా తను ఎలా హేండిల్ చేయగలదు తను ఎంత బాధపడుతుందో అని కబీర్ బాధపడుతూ వంశ్ రిథిమాని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు దీని వెనక వంశ్ ప్లాన్ ఏదో ఉంది అనిపిస్తుంది.నేను రిథిమాతో మాట్లాడాలి అనగానే మిశ్రా ఎలా మాట్లాడతారు అంటుంది అందుకు కబీర్ ఏదైనా చేస్తాను ఆ వంశ్ నీడ కూడా నా రిథిమా మీద పడటానికి వీల్లేదు అంటాడు.

రిథిమా కూడా రూంలో కబీర్ గురించి ఆలోచిస్తూ కబీర్ పేరు తన చేతి మీద మెహందితో రాయడం కబీర్ పేరుఉన్న మెహందీ తప్ప తన చేతి మీద వేరే పేరు ఉన్న మెహందీ పెట్టుకొనని కబీర్ కి మాట ఇవ్వడం గుర్తొచ్చి రిథిమా తన చేతి మీద వంశ్ పేరుతో మెహందీ పెట్టుకోకూడదని ఐరన్ బాక్స్ తో తన చేయి కాల్చుకుంటుంది.వంశ్ షీరా ని ఎవరు తీసి ఉంటారని ఆలోచిస్తూ రిథిమా రూంలోకి వచ్చి రిథిమా అని పిలుస్తాడు.రిథిమా తన చేయి వెనక్కి పెట్టుకొని వంశ్ వైపు తిరుగుతుంది.వంశ్ రిథిమాని చూసి రిథిమా నువ్వు ఇంకా రెడీ కాలేదా నాకు అనిపించింది అమ్మాయిలకి తమ పెళ్ళికి రెడీ అవ్వటం అంటే చాలా ఇష్టమని .ఇది అయితే నీ మెహందీ ceremony నువ్వు ఎందుకు రెడీ కాలేదు ఏమైంది నేను చూడలేనిది ఏదైనా ఉందా అని అడుగుతాడు.అందుకు రిథిమా నేను రెడీ అవ్వటానికి నాకు టైమ్ అక్కరలేదు అంటుంది.రిథిమా చేయి వెనక పెట్టుకోవడం చూసి ఏమైంది నీ చేయి ఎందుకు వెనక పెట్టుకున్నావు అనగానే ఊరికే పెట్టుకున్న అంటుంది రిథిమా.అందుకు వంశ్ చూపించు అని తన చేయి పట్టుకునేలోపు రిథిమా వంశ్ ని ఆపి తన కాలిన చేయి చూపిస్తుంది వంశ్ కి.

వంశ్ రిథిమా చేయి చూసి కూర్చో అంటాడు.రిథిమా కూర్చోగానే first aid kit తెచ్చి ఇస్తాడు.రిథిమా కిట్ నుండి క్రీమ్ తీసి రాసుకోవడం చూసి వంశ్ నువ్వు ఈ బాధని ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అంటాడు .అందుకు రిథిమా ప్రేమకి,బాధకి చాలా దగ్గర సంబంధం ఉంది.ఇలాంటి లోతైన భావాలూ అర్థం చేసుకోవడానికి ప్రేమ,ప్రేమని అర్థం చేసుకునే మనసు ఉండాలి అంటుంది రిథిమా.రిథిమా తన చేతికి బ్యాండేజ్ కట్టుకొని అయిపోయింది మీరు వెళితే రెడీ అవుతాను అని వంశ్ తో అనగానే వంశ్ లేచి వెళ్తూ కావాలని చేయి కాల్చుకోవడం వెనక ఉన్న అర్థం ఏంటి అని అడుగుతాడు.అది విని రిథిమా ఎవరైనా కావాలని ఎందుకు చేయి కాల్చుకుంటారు ఐరన్ చేస్తూ వుండగా చేయి కాలింది అంటుంది.ఇదంతా చేయడానికి సర్వెంట్స్ ఉన్నారుగా అంటాడు వంశ్.రిథిమా మన పనులు మనం చేసుకోవటంలో ఉన్న సుఖం వేరే వాళ్ళతో చేయించటంలో రాదు.అది ఐరన్ చేయటం అయిన మన బాధని మనమే భరించడమైన అని డోర్ దగ్గరికి వెళ్లి నిల్చుంటుంది వంశ్ ని బయటికి వెళ్ళమని.వంశ్ బయటికి వెళ్ళిపోతాడు రిథిమా డోర్ క్లోజ్ చేసుకుంటుంది.డోర్ బయట వంశ్ నవ్వుతూ interesting very interesting అని వెళ్ళిపోతాడు.

రిథిమా రెడీ అయ్యి కిందకి దిగుతూ తన వాచ్ చూసుకుంటూ అరగంట మాత్రమే ఉంది నా దగ్గర ఎలాగైనా షీరా ని డస్ట్ బిన్ నుండి తీసుకొని రావాలి అనుకుంటూ మెట్లు దిగుతూ ఉంటుంది.రిథిమా రావడం చూసి వంశ్ నానమ్మ వంశ్ కి చూపిస్తుంది వంశ్ రిథిమాని స్టన్నింగ్ గా చూస్తూ ఉంటాడు.ఇషాని రిథిమాని చూసి ఇలాంటి designer బట్టలు తనకి కంఫోర్టుగా ఉండి ఉండవు she dont deserve it అనుకుంటుంది.వంశ్ తనని అలానే చూడటం రిథిమా కూడా చూస్తుంది వంశ్ ని.వంశ్ నానమ్మ మెహేంది ceremony స్టార్ట్ చేయండి కాబోయే పెళ్లి కూతురు కూడా వచ్చేసింది అని రిథిమాని కూర్చోబెడుతుంది.రిథిమా చేతికి ఉన్న బ్యాండేజ్ చూసి ఏమైంది అని వంశ్ నానమ్మ అడుగుతుంది.అందుకు సియా తన చేయి కాలింది అని చెబుతుంది.అది విని అనుప్రియ కొంచెంసేపటి ముందు బానే ఉంది కదా మెహేంది రోజు మెహేంది పెట్టకపోతే అశుభం కదా అనగానే వంశ్ నానమ్మ ఏం కాదు కుడి చేయి కాకపోతే ఎడమ చేయికి పెట్టొచ్చు.చంచల ని రిథిమాకి మెహేంది పెట్టమని వంశ్ నానమ్మ చెబుతుంది.

రిథిమా మనసులో కబీర్ కి మాట ఇచ్చాను నా చేతిలో ఎవరో పేరు ఉన్న మెహేంది పెట్టుకొనని అనుకుంటుంది.చంచల రిథిమాకి మెహేంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది.రిథిమా మనసులో ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసో లేదో నాకు తెలియదు కబీర్ నాకైతే నువ్వు ఎప్పుడు నాకు తోడుగా ఉన్నావని అనిపిస్తుంది అనుకుంటుంది.మెహేంది cone లో కబీర్ మెసేజ్ పెట్టి పంపిస్తాడు అది చూసి రిథిమా చంచల ని డైవర్ట్ చేసి ఆ cone తీసుకొని మెసేజ్ చూస్తుంది.మెహేంది లో ఎవరు పేరు అయిన ఉండని డియర్ అందులో మన ప్రేమ రంగే ఉంటుంది అని ఉంటుంది అది చూసి రిథిమా కబీర్ వచ్చి తనని తీసుకెళ్తాడని ఎలాగైనా అని హ్యాపీగా నవ్వుతుంది.రిథిమా నవ్వటం చూసి వంశ్ సడెన్ గా రిథిమా ఎందుకు నవ్వుతుంది అని చూస్తూ వుండగా నానమ్మ పిలవడంతో వెళ్ళిపోతాడు.

రిథిమా గడియారం వైపు చూసి ఇంకా 5కి 15మినిట్స్ ఉండటమే చూసి ఎలా బయటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ వుండగా సియా డాన్స్ చేయమని రిథిమాని అడుగుతుంది.రిథిమా నో అంటుంది సియా నాకోసం చేయమనగానే లేచి రిథిమా డాన్స్ చేస్తూ వుండగా కబీర్ పంపిన మెసేజ్ పేపర్ కింద పడిపోతుంది.వంశ్ రిథిమాని అనుమానంగా చూస్తూ ఉంటాడు.కబీర్ పంపిన మెసేజ్ పేపర్ వంశ్ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది గాలికి.వంశ్ కిందకి చూస్తాడు పేపర్ ఉండటంతో తీసుకోవాలని వంగబోతాడు కిందకి.వంశ్ దగ్గరికి పేపర్ వెళ్ళటం చూసిన రిథిమా వంశ్ కబీర్ మెసేజ్ చదివితే తను ఎక్కడ దొరికిపోతానో అని టెన్షన్ పడుతుంది.Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller