Shaik Sameera

Thriller


3  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins 140 4 mins 140

               ఎపిసోడ్ -8

రిథిమా వంశ్ లోపలికి రావడం చూసి స్టడీ రూంలోని ఒక బుక్ తీసుకొని చదువుతూ ట్రాన్స్మిటర్ కనపడకుండా అడ్డుగా నిలుచుంటుంది .వంశ్ వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడగానే వంశ్ వైపు తిరుగుతుంది రిథిమా .ఇదంతా కబీర్ ట్రాన్స్మిటర్ నుండి వింటూ ఉంటాడు .

రిథిమా -MR.VR మీరు వెళ్లిపోయారు అనుకున్న నాకు ఒక బుక్ కావాలని అడిగితే సియా మీ స్టడీ రూంలో మంచి బుక్ కలెక్షన్ ఉంది అంటే చూద్దామని వచ్చాను.నాకు తెలుసు ఇక్కడికి మిమ్మలన్నీ అడగకుండా రాకూడదని అంటుంది .

వంశ్ -నిన్న రాత్రి నువ్వు చేసిన తప్పుకి నిన్ను క్షమించాను అంటే నువ్వు నిజం చెప్పావని మాత్రమే .ఏదో ఒకటి చేసి నేను నిన్ను అనుమానించేలా చేయకు .ఇంకోసారి ఏదైనా తప్పు చేస్తే explanation ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వను .నీకు తెలియదు నాకు అబద్ధం ,మోసం అంటే చాలా అసహ్యం అని తన లాప్టాప్ తీసుకొని వెళ్ళిపోతాడు .

రిథిమా వంశ్ వెళ్లిపోయాడని ట్రాన్స్మిటర్ తీసుకొని డిస్కోనెక్ట్ చేస్తుంది .వంశ్ మళ్ళీ వచ్చి రిథిమా అని పిలుస్తాడు .రిథిమా ట్రాన్స్మిటర్ ని కిటికీ నుండి కిందకి పడేసి వంశ్ వైపు తిరుగుతుంది .వంశ్ ఇంకో సారి స్టడీ రూమ్ లోకి పర్మిషన్ లేకుండా రావొద్దని చెబుతాడు .రిథిమా అని వెళ్తూ వుంటే వంశ్ ఈ మాన్షన్ నా ప్రపంచం ఇక్కడ నాకు తెలియకుండా ఏం జరగదు అని చెబుతాడు రిథిమా వెళ్ళిపోతుంది .

వంశ్ నానమ్మ పూజ గదిలో వినాయక విగ్రహం స్థాపిస్తుంది .వంశ్ నానమ్మ ఫ్యామిలీ అందరితో సాయంత్రం 4గంటలకు పూజ ఉందని అందరూ ఎంత బిజీగా ఉన్న రావాలని చెబుతుంది .రిథిమా తో పూజ గది కి ఎదురుగా ముగ్గు వేయమంటుంది .అది విని వంశ్ అమ్మ అనుప్రియ రిథిమా మన ఇంట్లో స్టాఫ్ మాత్రమే ఇలాంటివి ఇంట్లో వాళ్లే చేయాలి కదా అత్తయ్య అంటుంది .అందుకు వంశ్ నానమ్మ రిథిమా నే పూజ కోసం నాకు సహాయం చేసింది ఇలాంటివి రిథిమానే చేయగలదు ఎందుకంటే తనకే పూజ విధానాలు అన్ని తెలుసు కాబట్టి అంటుంది .అందుకు అనుప్రియ రిథిమా ఈ వర్క్ యే కాదు సియా ట్రీట్మెంట్ మీద కూడా concentrate చేయమని చెప్పి వెళ్ళిపోతుంది .

రిథిమా ముగ్గు వేయాలని రంగులు తీసుకొని వేస్తూ వుండగా వంశ్ వచ్చి రిథిమాని చూస్తూ ఉంటాడు .రిథిమా ట్రాన్స్మిటర్ ఎవరికైనా దొరుకుతుందేమో ముగ్గు వేసేసి ట్రాన్స్మిటర్ వెతకాలని వేస్తూ వుండగా ఒక కలర్ తన బుగ్గ పైన అంటుకుంటుంది .ముగ్గు త్వరగా వేసేస్తుంది ట్రాన్స్మిటర్ వెతకాలని వంశ్ నానమ్మ ముగ్గు చాలా బాగా వేశావు అలాగే పూజ కోసం హారతి పళ్లెం సియా తో కలిసి రెడీ చేయమంటుంది .రిథిమా ట్రాన్స్మిటర్ కోసం వెళ్ళబోతూ వంశ్ తనని చూడటం గమనించి ఇప్పుడు వెళితే వంశ్ కి అనుమానం వస్తుందని వంశ్ నానమ్మ చెప్పినట్టు చేస్తూ ఉంటుంది .రిథిమా పూజ కోసం హారతి పళ్లెం రెడీ చేసి వంశ్ వెళ్ళిపోయి ఉంటాడు అని ట్రాన్స్మిటర్ వెతకడానికి గార్డెన్ ఏరియా కి వెళ్తుంది .వంశ్ రిథిమా వెళ్ళటం చూస్తాడు .రిథిమా తను ట్రాన్స్మిటర్ ఎక్కడ పడేసిందో అక్కడ వెతుకుతుంది కానీ తనకి ట్రాన్స్మిటర్ కనిపించదు ఏమైంది ట్రాన్స్మిటర్ ఎవరైనా తీసుకున్నారా అని కంగారు పడుతూ వుండగా వంశ్ వెనక నుండి ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు .

వంశ్ -రిథిమా దొరికిందా నువ్వు వెతుకుతున్నది ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు .రిథిమా టెన్షన్ పడటం చూసి తన చేయి పట్టుకొని పల్స్ చెక్ చేసి నీ హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఉంది .ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంతలా అని అడుగుతాడు 

రిథిమా -MR.VR హార్ట్ బీట్ ఎండ ఎక్కువ ఉంది కదా అందుకే అలా ఉందేమో అంటూ వుండగా వంశ్ తన చేయి పట్టుకొని తన దగ్గరికి లాగుతాడు .తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు .

వంశ్ -నేను ఎవరినైనా ఒక్కసారి పట్టుకుంటే వదలను .నేను మనుషులతో పాటు వాళ్ళ కళ్ళని కూడా చదవగలను .ఇప్పుడు నీ కళ్ళని చూస్తే అర్థం అవుతుంది నువ్వు దేనికోసమో బాగా వెతుకుతున్నావని టెన్షన్ పడుతున్నావని నువ్వే అదేంటో నిజం చెబితే బాగుంటుంది అని అంటాడు తన చేయి వదలకుండా .

రిథిమా -MR.VR నేను మీ వర్క్ యే చేస్తున్నా అందుకే ఇక్కడికి వచ్చాను అంటుంది 

వంశ్ -ఏం వర్క్ అది అని అడుగుతాడు 

రిథిమా -మీకోసం నానమ్మ ఏర్పాటు చేసిన పూజ కోసం గార్డెన్ ఏరియా లో ఉన్న పూలు సరిపోతాయో లేదో బయట నుండి తెప్పించాలేమో చెక్ చేయమంటే చూద్దామని వచ్చాను .మీకు నమ్మకం లేకపోతే సారీ మీరు ఎవరిని నమ్మరు కదా నానమ్మ ని అడగండి తను చెబుతారు అని వెళ్ళిపోతుంది లోపలికి .

రిథిమా ,సియా ,నానమ్మ పూజ కోసం రెడీ చేస్తూ వుంటే ఇషాని రిథిమా వేసిన ముగ్గు తొక్కేస్తుంది .అది చూసి రిథిమా ఇషాని కాసేపట్లో పూజ మొదలవబోతుంది నీ సాండల్స్ తీసేయొచ్చు కదా అంటుంది .అందుకు ఇషాని నువ్వు ఇక్కడ స్టాఫ్ మాత్రమే నాకు రూల్స్ పెట్టాలని చూడకు అంటుంది .వంశ్ నానమ్మ పూజ గది పైన స్టూల్ ఎక్కి పూల మాల కట్టమని ఇషాని కి చెబుతుంది తను కేర్ లెస్ గా వెళ్ళిపోతుంది .అది చూసి నానమ్మ నేనే చేస్తాను అంటే రిథిమా నేను చేస్తాను అని స్టూల్ ఎక్కి పూల మాల కడుతూ ఉంటుంది .ఆర్యన్ రిథిమా ని చూసి తనని కొట్టడం గుర్తొచ్చి స్టూల్ కి జర్క్ ఇచ్చి వెళ్ళిపోతాడు .రిథిమా స్టూల్ జర్క్ అవ్వడం తో కింద పడబోతుంటే వంశ్ వచ్చి పట్టుకుంటాడు తనని పడకుండా .రిథిమా తన కళ్ళు మూసుకొని వంశ్ భుజాన్ని గట్టిగా పట్టుకుంటుంది .

వంశ్ రిథిమా తో నీ గోళ్ళ తో గుచ్చడం మానేస్తే బాగుంటుంది అంటాడు .రిథిమా కళ్ళు తెరిచి సారీ అంటుంది తన చైన్ కబీర్ ఇచ్చిన రింగ్ ఉన్న చైన్ వంశ్ షర్ట్ బటన్ కి పట్టుకుంటుంది .రిథిమాని వంశ్ కిందకి దించుతాడు అప్పుడు చైన్ రింగ్ రెండు వేరుగా పడిపోతాయి .వంశ్ ఆ రింగ్ తీసుకొని దాన్ని ఓపెన్ చేయాలనీ చూస్తూ ఉంటాడు .రిథిమా కబీర్ తను ఉన్న ఫోటో ఎక్కడ చూస్తాడేమో అని రింగ్ తీసేసుకుంటుంది వంశ్ చేతి నుండి రింగ్ .వంశ్ నీకు ఎంగేజ్మెంట్ కాలేదని చెప్పావు మరి ఈ రింగ్ నీ మనసుకి ఇంత దగ్గరగా ఎందుకు పెట్టకున్నావు అని అడుగుతాడు .రిథిమా ఈ రింగ్ నా పాత జ్ఞాపకం అందుకే ఇలా పెట్టుకున్న అంటుంది .వంశ్ ఎలాంటి జ్ఞాపకం అది అంటాడు .రిథిమా అది నా పర్సనల్ మ్యాటర్ నేను నా personals ఎవరితోనూ షేర్ చేయను .మీరు మీ personals ఎవరితోనూ షేర్ చేయరు కదా నేను అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది రిథిమా రింగ్ తీసుకొని .వంశ్ రాజ్ ని పిలిచి రిథిమా గార్డెన్ ఏరియాలో ఏదో వెతుకుతూ ఉంది ఏంటో check చేయి ఒకసారి అని తనని పంపుతాడు .వంశ్ రిథిమా నువ్వేదో దాస్తున్నావని నాకు తెలుసు నిజం చాలా త్వరగా బయటపడుతుంది అని అనుకుంటాడు .Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller