Shaik Sameera

Thriller

3  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins
288


             ఎపిసోడ్ -13

వంశ్ కొట్టే వ్యక్తి కబీర్ కాదు అని రిథిమాకి తెలిసిపోతుంది . క అని రిథిమా అనడం వంశ్ విని క తో ఏం పేరో ఇతనిది చెప్పు అని రిథిమా ముందే అతన్ని బాగా కొడతాడు .రిథిమా అది చూసి స్టాప్ ఇట్ ప్లీజ్ కొట్టొద్దు అంటుంది .కబీర్ కొత్త ఫోన్ తీసుకొని రావడం మిశ్రా చూసి ఇంత స్ట్రెస్ లో కూడా కొత్త ఫోన్ కొన్నారా అని అడుగుతాడు .అందుకు కబీర్ రిథిమా నా నెంబర్ కి కాల్ చేసింది వంశ్ ట్రాప్ అని తెలియక నా లోకేషన్ తెలిసిపోతుందని ఫోన్ మార్చేసాను అంటాడు .పాత ఫోన్ ఏం చేసారు అని కబీర్ ని మిశ్రా అడుగుతాడు .కబీర్ ఎవరో తెలియని ఒక వ్యక్తి కారులో తన ఫోన్ పడేయటం గుర్తు చేసుకొని మిశ్రా తో చెబుతాడు అదే విషయం .

వంశ్ -ఎవరు ఇతను క తో ఇతని పేరేంటి కుమార్ ఇంకేదైనా ఉందా చెప్పు అని రిథిమా ని అడుగుతాడు .

రిథిమా -ఇతనెవరో నాకు తెలియదు .ఎందుకు మీరు ఇతన్ని ఇంతలా కొడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు .

వంశ్ -అబద్ధం చెబుతున్నావు .నీకు ఇతనెవరో తెలియకపోతే ఇతని మొబైల్ లో నీ నెంబర్ ఉంది అదే కొన్ని గంటల ముందు యాక్టీవ్ అయిన నెంబర్ తో చేసిన కాల్ ఉంది ఎందుకు ఉంది అని అడుగుతాడు .

రిథిమా -నేను కాల్ చేయడం వలన ఇతన్ని కొడుతున్నారా ? అసలు జరిగిన నిజమేంటో చెబుతాను .నేను ఇతనికి కాల్ చేశాను లిఫ్ట్ చేసాడు మాట్లాడాను కూడా కానీ రాంగ్ నెంబర్ ఇది .సేజల్ కి కాల్ చేయబోతే నెంబర్ మర్చిపోవడం తో ఇతని నెంబర్ కి కనెక్ట్ అయింది .సేజల్ నెంబర్ కూడా ఇన్ని రోజులు కాంటాక్ట్ లో లేకపోవడం వలన మర్చిపోయాను .thanks to you అని బాధపడుతుంది .

వంశ్ -ఆ మనిషిని రిథిమాని చూపించి తనెవరో తెలుసా అని అడుగుతాడు .అతను తెలియదు అంటాడు .అది విని వంశ్ అతని వాలెట్ చెక్ చేస్తాడు అందులో అతను సేల్స్ మాన్ అనే ఐడెంటిటీ కార్డు కనిపిస్తుంది .అతను కాన్ఫరెన్స్ కి వెళ్లి వస్తుంటే మీరు తీసుకొచ్చారు అని అంటాడు .వంశ్ అందుకు రాజ్ అని కోపంతో అరుస్తాడు .రాజ్ వచ్చి అతన్ని తీస్కెళ్ళిపోతాడు .

రిథిమా - మీరు ఈ ఫోన్ నాకు ఫీజు లాగా ఇవ్వలేదు నా మీద మీకు ఉన్న డౌట్స్ తీర్చుకోవడానికి మీరు వేసిన ట్రాప్ .మీ డౌట్స్ వలన ఒక నిర్దోషిని అంతలా కొట్టారు .మీ గురించి మీరు ఏం అనుకుంటున్నారు అని మొబైల్ నేల కేసి కొట్టి వెళ్ళిపోతుంది .

వంశ్ -రిథిమా వెళ్ళిపోయాక interesting వెరీ interesting అంటాడు .

వంశ్ ఫ్యామిలీ మొత్తం హాల్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు .వంశ్ బాబాయ్ రాఘవ్ ఇంట్లో పూజలు చేయించండి .వచ్చే వారం నా పులి వంశ్ ఒక డీల్ క్రాక్ చేయబోతున్నాడు ఆ డీల్ ఓకే అయితే మన బిజినెస్ ఇండియా టాప్ మోస్ట్ బిజినెస్ లో మనది ఉంటుంది అని చెబుతాడు .అందుకు ఇషాని అన్నయ్యకి దేవుడు అవసరం లేదు తన strength తోనే ఎలాంటి డీల్ అయిన క్రాక్ చేయగలడు ఇంట్లో కొంతమంది ఉన్నారు ఖాళీగా ఉండే బదులు కొంచెమైనా వంశ్ అన్నయ్యకి సహాయం చేస్తే బాగుండు అని ఆర్యన్ ని చూసి అంటుంది .దానికి వంశ్ అమ్మ అనుప్రియ ఇషాని మనమంతా ఒకే ఫ్యామిలీ ఇలా ఒకరిని ఒకరు తక్కువ చేసి మాట్లాడకూడదు అంటుంది .అందుకు ఇషాని మనమంతా ఒకటే ఫ్యామిలీ నా అని వెటకారంగా అంటుంది .

అది విని నానమ్మ ఆపండి చాలు అంటుంది .వంశ్ ఒక మంచి అబ్బాయి తనే బిజినెస్ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటున్నాడు .మీ అందరికి ఏ లోటు రాకుండా వంశ్ చూసుకుంటున్నాడు అలాంటప్పుడు మీరందరూ తన గురించి కూడా ఆలోచించాలి కదా తన కోసం ఒక మంచి అమ్మాయిని వెతికి వంశ్ కి పెళ్లి చేయాలనీ ఎందుకు అనుకోరు మీరు అని అడుగుతుంది .దానికి వంశ్ పిన్ని చంచల పోయిన సారి వంశ్ జీవితం లో జరిగినదానికి అంటూ వుండగా వంశ్ నానమ్మ ఆపేస్తుంది వంశ్ పిన్నిని .వంశ్ అమ్మ అనుప్రియ అత్తయ్య వంశ్ కి ఎవరైనా నచ్చటం అనేది అసలు జరగదు .వంశ్ ఎప్పుడు తన వర్క్ నే ముఖ్యం అనుకుంటాడు ఎప్పుడు ఆఫీస్ వర్క్ లోనే బిజీ గా ఉంటాడు ఎవరు చెప్పిన వంశ్ వినడు అంటుంది .ఆర్యన్ మా రెస్పాన్సిబుల్ అన్నయ్య ఇప్పుడు బిజినెస్ లో కాదు స్టాఫ్ తో బిజీ గా ఉంటున్నాడు ఎప్పుడు అంటాడు .ఇషాని రిథిమా తోనా చిరాకుగా అంటుంది .అప్పుడే వచ్చిన వంశ్ enough stop it అంటాడు .ఆర్యన్ దగ్గరికి వచ్చి నీకు ఉన్న ఖాళీ టైమ్ లో నా వెనక స్పై చేస్తున్నావా నీకు తగ్గ పని చేస్తే నువ్వు నీకే మంచిది అని వెళ్లిపోతుంటాడు .వంశ్ ని నానమ్మ పిలుస్తుంది నానమ్మ బాగా అలిసిపోయాను కాసేపాగి మాట్లాడతాను అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు .

వంశ్ తన రూమ్ లో ఇంత పెద్ద తప్పు ఎలా చేశాను అని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ వుండగా ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించి అటు వైపు చూస్తాడు .రిథిమా ఒక చేతిలో బ్యాగ్ తో ఒక చేతిలో లెటర్ తో వస్తుంది .

వంశ్ -నీకు ఈ మాత్రం manners ఉంది కదా ఎవరి రూంలోకి అయిన వెళ్ళేటపుడు తలుపు కొట్టాలని తెలుసు కదా అంటాడు .

రిథిమా -maners గురించి మీరు మాట్లాడకపోవడమే బెటర్ MR.VR మీ అనుమానం కోసం ఒక మనిషిని అంత నిర్దయగా కొట్టారు చావు బ్రతుకుల్లో అతన్ని వదిలేసారు అని లెటర్ వంశ్ కి ఇస్తుంది .

వంశ్ -whats this అని అడుగుతాడు 

రిథిమా -నా resignation letter iam resigning అంటుంది .మీరు మీ చెల్లెలి ట్రీట్మెంట్ కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అది బలవంతంగా నేనేం మీ ముందుకి వచ్చి నాకు జాబ్ ఇవ్వండి అని అడగలేదు .మీ చెల్లెలి కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఎందుకంటే తన లైఫ్ అంటే మీకు చాలా కేర్ ఉంది కాబట్టి .అలాగే మీరు కొట్టిన వ్యక్తి కి కూడా అలాంటి రిలేషన్స్ ఉండి ఉంటాయి కదా .మీలాంటి arrogant ,doubtful మనిషి దగ్గర నేను జాబ్ చేయను .మీకు నా మీద ఉన్న అనుమానాలను తీర్చుకోడానికి నిర్దోషులు బలి అవ్వడం నాకు ఇష్టం లేదు .మిమ్మలన్నీ మీరు దేవుడు అనుకోని మిగతా వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం మానేయండి అంటుంది .

వంశ్ -stop ఇంతవరకు ఎవరు ఇలా నాతో మాట్లాడలేదు .

రిథిమా -నేను మాట్లాడటం ఇంకా పూర్తి కాలేదు .మీరు చాలా లావిష్ లైఫ్ బ్రతుకుతున్నారు కదా .మీకు అన్ని సుఖాలు చిన్నప్పటి నుండి ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చినట్టు వచ్చాయి కదా .ఈ మాన్షన్,ప్రాపర్టీస్ అన్ని చూసుకొనే కదా మీకు ఇంత అహంకారం ,మొండితనం ఉన్నాయి .మిమ్మలన్నీ ఎవరైనా మీ చెంప మీద కొట్టి మంచి చెడుల తేడా గురించి నేర్పించి వుంటే బాగుండేది ఎవరైనా అలా చేసి వుంటే ఈరోజు ఆ వ్యక్తి కి శిక్ష పడేది కాదు అంటుంది 

వంశ్ -just stop it .నువ్వు లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు.

రిథిమా -లేదు MR.VR నేను మీకు ఈ లోకంలో మీ నౌకర్లే కాదు మనుషులు కూడా ఉంటారని తెలియచేస్తున్నాను GUDBY అని తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది .

వంశ్ -రిథిమా ఇచ్చిన లెటర్ మడిచేసి interesting very interesting అనుకుంటూ రిథిమా వెళ్లిన వైపే చూస్తూ ఉంటాడు .

రిథిమా మాన్షన్ నుండి బయటికి వెళ్తూ మనసులో సారీ కబీర్ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను .నా వాళ్ళ నిర్దోషులకి శిక్ష పడటం భరించలేను అందుకే కబీర్ నీకు ఈ మిషన్ ఎంత ముఖ్యమో తెలిసి కూడా ఇలా మధ్యలో వదిలి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటూ వెళ్తూ వుంటే మాన్షన్ గేట్ క్లోజ్ అయిపోతుంది .రిథిమా గేట్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేయాలనీ చూస్తుంది అది ఓపెన్ కాదు హెల్ప్ కోసం అరుస్తుంది.అప్పుడే రాజ్ వస్తాడు బాస్ పర్మిషన్ లేకుండా ఎవరు మాన్షన్ నుండి బయటికి వెళ్ళలేరు అని డిసోజాతో రిథిమాని తీసుకొని రమ్మంటాడు .డిసోజా రిథిమా దగ్గరికి వెళ్లి లోపలికి పద రిథిమా అని అంటుంది .రిథిమా షాక్ అవుతుంది .


Rate this content
Log in

Similar telugu story from Thriller