Shaik Sameera

Thriller


3  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

3 mins 214 3 mins 214

              ఎపిసోడ్ -9

వంశ్ ఫ్యామిలీ,రిథిమా గణపతి పూజ చేస్తూ ఉంటారు .వంశ్ మాన్షన్ బ్యాక్ యార్డ్ లో statue దగ్గర నించుని నా ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది రిథిమా నువ్వు ఏదో నిజం దాస్తున్నావు అబద్ధం చెబుతున్నావు నాతో నీ నిజం ఏంటో అది ఈరోజు తప్పకుండా తెలిసిపోతుంది అంటాడు .రిథిమా పూజ లో వక్రతుండ మహాకాయ అనే శ్లోకం చదువుతూ ఉంటుంది .రిథిమా వాయిస్ విని వంశ్ ఈ వాయిస్ ఎవరిదీ అని చూసి రిథిమా నీ నిజ స్వరూపం ఈరోజు తెలిసిపోతుంది అని లోపలికి వెళ్తాడు .వంశ్ నానమ్మ రిథిమా చాలా మంచి గొంతు నీది చాలా బాగా పాడావు అని అంటుంది .కబీర్ ట్రాన్స్మిటర్ చెక్ చేస్తూ రిథిమా అక్కడ ఎలా ఉందో ఏదైనా ప్రాబ్లెమ్ లో ఉందేమో టెన్షన్ పడుతూ వుంటే మిశ్రా వెనక నుండి కాఫీ తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడకుండా కబీర్ సడెన్ గా వెనక్కి తిరగడం తో కాఫీ కప్ కింద పడిపోతుంది .ఇలా ఎవరైనా వస్తారా అని కబీర్ మిశ్రా ని తిడతాడు సారీ బాస్ అని మిశ్రా వెళ్ళిపోతాడు .కబీర్ రిథిమా కోసం బాధపడుతూ ఉంటాడు .

రిథిమా గణపతికి హారతి ఇస్తుంది .ఆ హారతిని వంశ్ నానమ్మ అందరికి ఇవ్వమంటుంది .అది విని వంశ్ పిన్ని రిథిమాకి హక్కు వచ్చేసేలా ఉంది ఈ ఇంట్లో అని ఇషాని తో అంటుంది .ఇషాని రిథిమా హక్కుని ఎలా తీసేయాలో నాకు బాగా తెలుసు వంశ్ అన్నయ్యే తనని చూసుకుంటాడు dont worry అంటుంది .రిథిమా అందరికి హారతి ఇస్తూ ఉంటుంది వంశ్ రావడం చూసి తన దగ్గరికి వెళ్లి హారతి తీసుకోమంటుంది .

వంశ్ -మీ దేవుడు మీద నమ్మకం లేదు నాకు నా మీద నమ్మకం ఉంది అది చాలు దేవుడి అవసరం లేదు అంటాడు .

రిథిమా -ఎవరైతే మిమ్మలన్నీ సృష్టించారో అలాంటి దేవుడిని నమ్మరా మీరు .అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు .

వంశ్ -మీ దేవుడు నాకు ఎలాంటి సహాయం చేయలేదు నేనే కష్టపడి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఇంత పెద్ద ఎంపైర్ create చేసుకున్నాను నా capability అందుకే మీ దేవుడి దయ నాకు అవసరం లేదు .

రిథిమా -ముందే చెప్పానుగా అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు .నేను అనాథను నాకు కుటుంబం లేదు అందుకే దేవుడినే నా కుటుంబం అనుకుంటాను .నాకు ఇలాంటి లైఫ్ ఇచ్చినందుకు నేను దేవుడికి thanks చెబుతూనే ఉంటాను.

వంశ్ -ఏంటి దేవుడిని నీ కుటుంబం అనుకుంటావా ఈ పూజలు భజనలతో థాంక్స్ చెబుతావా దేవుడికి .

రిథిమా -దేవుడు మనకి ఇంత మంచి ప్రశాంతమైన లైఫ్ ఇచ్చినందుకు తల వంచి థాంక్స్ చెప్పడం తప్పు కాదు అంటుంది .అయిన ఎవరి ముందు తలవంచడం మీకు అలవాటు లేదు కాబట్టి నేనే మీ బదులు దేవుడికి థాంక్స్ చెబుతాను మీ లైఫ్ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను అని తను హారతి తీసుకొని వంశ్ కి దూరం నుంచి హారతి ఇచ్చి వెళ్ళిపోతుంది .వంశ్ బయటికి వెళ్తాడు .

రిథిమా దేవుడి ముందు మనసులో ట్రాన్స్మిటర్ వంశ్ కి దొరకుండా ఉండాలని కోరుకుంటుంది .రాజ్ కి గార్డెన్ లో విడిపోయి పడి ఉన్న ట్రాన్స్మిటర్ దొరుకుతుంది .వంశ్ రాజ్ దగ్గరికి వస్తాడు .బాస్ ఈ మేకప్ కిట్ దొరికింది అని చూపిస్తాడు .వంశ్ దాన్ని చూసి interesting very interesting అని ట్రాన్స్మిటర్ తీసుకొని లోపలికి వెళ్తాడు.ట్రాన్స్మిటర్ కనపడకుండా వెనక పెట్టుకొని రిథిమా అని గట్టిగా పిలుస్తాడు .నీకోసం దేవుడి ప్రసాదం వచ్చింది అని తన దగ్గరికి వస్తాడు .ఏంటి అని రిథిమా అడుగుతుంది .వంశ్ రిథిమా చేతిలో ఉన్న ప్రసాదం ప్లేట్ లో ట్రాన్స్మిటర్ పెడతాడు .అది చూసి రిథిమా చాలా భయపడుతుంది తన చేతులు వణుకుతూ ఉంటాయి అది గమనిస్తాడు వంశ్ .ఇలా ఎవరివైనా చేతులు వణుకుతున్నాయి అంటే వాళ్ళు ఏదో దాస్తున్నారని అర్థం చెప్పు ఈ మేకప్ కిట్ నీదే కదా అంటాడు .రిథిమా ఇది నాది కాదు మేకప్ కిట్ యే కదా ఇంత మంది అమ్మాయిలు ఉంటున్నారు ఇంట్లో ఎవరిదీ అయిన కావొచ్చు కదా అంటుంది .వంశ్ అబద్ధం చెబుతున్నావు ఎందుకంటే ఈ కిట్ నా స్టడీ రూమ్ కిటికీ బయట పడి ఉంది అక్కడికి ఈరోజు నువ్వు మాత్రమే వెళ్ళావు అంటుంది .

వంశ్ నానమ్మ వంశ్ రిథిమా అలాంటి అమ్మాయి కాదు చాలా మంచిది తనది కాకపోవచ్చు ఈ కిట్ అంటుంది .వంశ్ అమ్మ అనుప్రియ వంశ్ మేకప్ కిట్ యే కదా అది దానితో రిథిమా మనలన్నీ ఏం చేయగలదు అంటుంది .వంశ్ ఇది మేకప్ కిట్ కాదు ట్రాన్స్మిటర్ అని కనెక్ట్ చేస్తాడు .చూద్దాం ఇటు పక్కన ట్రాన్స్మిటర్ కి మనం అటుపక్క ఎవరు ఉన్నారో చూద్దాం నిజం తెలిసిపోతుంది రిథిమా పైన ఉన్న మీ నమ్మకం గెలుస్తుందో నా అనుమానం గెలుస్తుందో అంటాడు .ఆర్యన్ ఇది హై టెక్ ట్రాన్స్మిటర్ లా ఉంది మేకప్ కిట్ లాగా కనిపిస్తుంది దీనితో మన మొత్తం ఇన్ఫర్మేషన్ పంపొచ్చు అంటాడు .అనుప్రియ అయిన మన ఇన్ఫర్మేషన్ ఎవరికీ ఇస్తుంది అని అడుగుతుంది .వంశ్ నా శత్రువుల్లో ఎవరైనా అయిఉండొచ్చు అని on బటన్ ప్రెస్ చేస్తాడు .రిథిమా మనసులో కబీర్ తో మాట్లాడుతూ కాల్ కట్ అయింది ఎక్కడ కబీర్ రిథిమా అని పిలుస్తాడో అని కంగారు పడుతుంది .కబీర్ రిథిమా ట్రాన్స్మిటర్ కనెక్ట్ అయినట్టు సిగ్నల్ వస్తుంది కానీ ఎవరు మాట్లాడకపోయేసరికి చూస్తూ ఉంటాడు .వంశ్ ఇక్కడ సైలెంట్ గా ఉంటాడు అవతల ఎవరు ఉన్నారో తెలుసుకోడానికి .కబీర్ కి డౌట్ వచ్చి కర్చీఫ్ అడ్డం పెట్టుకొని నోటికి హలో ఆర్యన్ ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉందా ఎందుకు సడన్ గా కాల్ కట్ చేసావు అని అంటాడు .అది విని వంశ్ కోపంతో ట్రాన్స్మిటర్ తీసుకొని నేలకేసి కొడతాడు రిథిమా భయపడుతుంది .అందరూ ఆర్యన్ వైపు చూస్తారు నాకేం తెలియదు ఇదంతా రిథిమానే చేస్తుంది తను నన్ను ఇరికిస్తుంది అంటాడు .వంశ్ ఆర్యన్ తో రేపటి వరకు టైమ్ ఇస్తున్న నువ్వు నిర్ధోషివని ప్రూవ్ చేసుకో అని అంటాడు .రిథిమా ని చూసి ఈరోజు రాత్రి వరకు ఎలాగో బ్రతికిపో రేపు ఏదైనా జరగొచ్చు నీ నిజం తెలిసిపోవచ్చు అంటాడు .


Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller