STORYMIRROR

Dinakar Reddy

Drama Thriller

3  

Dinakar Reddy

Drama Thriller

కరకింకర ఆలయం

కరకింకర ఆలయం

1 min
323

పవన్! అయ్యో పవన్ ఎక్కడున్నావ్. రాకాసి గబ్బిలాలు. స్నిగ్ధ హాస్పిటల్ బెడ్ మీద నుండి లేవలేకపోతోంది. 


అసలేమైంది. నేనెందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఈ గబ్బిలాలు నా చుట్టూ తిరుగుతున్నాయి. 

మరుల మాతంగి ఇంకా నా చేతికే ఉంది. ముందు దీన్ని తీసి పడేయాలి అంటూ స్నిగ్ధ తన చేతికి ఉన్న తాయెత్తు లాంటి దాన్ని తీసి విసిరి కొట్టింది. 


మరుల మాతంగిని విసిరి కొట్టినా కరకింకర నిన్ను భక్తురాలిగానే చూస్తాడులే అనే మాటలు వినిపించాయి.


స్నిగ్ధ కళ్ళు తెరిచి చూసే సరికి కరకింకర ఆలయంలో ఉంది. కాత్యాయని ఆమెకు కొత్త బట్టలు ఇచ్చింది.


 మూర్తాభిషిక్తుడు భీస్టీ నాయక్ నువ్వు పెట్టే నైవేద్యం కోసం ఎదురు చూస్తున్నాడు అంటూ స్నిగ్ధ చేతికి తెల్లగా మెరుస్తున్న కొడవలిని ఇచ్చాడు మిహిర్ కుట్టి.

స్నిగ్ధ తనలో తనే నవ్వుకుంటూ కరకింకర విగ్రహం వైపు వెళ్ళింది.

ఆమె చుట్టూ విచిత్రమైన వస్త్రాలు ధరించిన ఉపాసకులు కరకింకరా మహమ్మారి చత్ర చాత్ర అంటూ నృత్యం చేస్తున్నారు.


కరకింకర విగ్రహం వెనుకల నుండి మస్తానమ్మ స్నిగ్ధ కి సైగ చేసింది.


అరుస్తూ వెనక్కు తిరిగిన స్నిగ్ధ మిహిర్ కుట్టి కుడి చేతిని కొడవలితో నరికి వేసింది.

ఊహించని ఈ హఠాత్పరిణామానికి ఏం చేయాలో అర్థం కాక కాత్యాయని మస్తానమ్మ గొంతును గట్టిగా నొక్కడానికి ప్రయత్నించింది.


మిహిర్ కుట్టి నరికివేయబడ్డ చేతిని చూసుకుంటూ విలవిలలాడుతున్నాడు.

ఆమెను బలి ఇవ్వండి అంటూ అరుస్తున్నాడు.


కీరా బీస్ కీరా పానీ కీరా బీస్ కీరా పానీ అంటూ మస్తానమ్మ మంత్రం వేయడానికి ప్రయత్నిస్తోంది.

అమ్మా మీరు వెళ్ళిపొండి అంటూ మస్తానమ్మ కాత్యాయనిని పక్కకు తోసింది.


స్నిగ్ధ పరుగెడుతూ ఉంది..


Rate this content
Log in

Similar telugu story from Drama