Dinakar Reddy

Abstract Thriller

4.5  

Dinakar Reddy

Abstract Thriller

ఇచ్చట జ్యోతిష్యం..

ఇచ్చట జ్యోతిష్యం..

1 min
411


మీరు నమ్మిన విధంగా జ్యోతిష్యం చెప్పబడును అని వ్రాసి ఉన్న బోర్డును చూసి నవ్వుకుని అతను అడుగు పెట్టాడు.


స్వామీ! నా జాతకం చెప్పండి అంటూ తను పుట్టిన తేదీ, సమయం చెప్పాడు రాజీవ్. 

మాధవ శర్మ నవ్వుతూ నీ అంత దరిద్రమైన జాతకం ఎప్పుడూ చూడలేదు అన్నాడు.


అదేంటి స్వామీ! అంత మాటనేసారు. మరి నా పరిస్థితి ఏంటి? డబ్బులు లేకపోతే సొంత చెడ్డీ కూడా మనకు విలువ ఇవ్వదు. గర్ల్ ఫ్రెండ్ దొరకదు. ఇక నా యవ్వనం వృథా కావాల్సిందేనా అని వింతగా వాపోయాడు.


పిచ్చి వాడా! ఎందుకంత ఆవేశం? నేను లేనూ! గ్రహాల్ని క్యూ లైన్లు కట్టించి మరీ నీకు తగ్గట్టు మారుస్తాను. అందుకు ఒక పెద్ద హోమం చేయాలి. అది కూడా రహస్యంగా చేయాలి అన్నాడు.


రాజీవ్ నవ్వుతూ దానికేం భాగ్యం అంటూ ఆ హోమానికి తగ్గ డబ్బులు ఇచ్చాడు.


రేపు హోమం చేసి వస్తాను. ఎల్లుండి కలువు అని చెప్పి రాజీవ్ ని పంపించాడు.


ఆ మరుసటి రోజు మాధవ శర్మ తన అత్తగారి ఊరు వెళ్లి, కుటుంబంతో గడిపి వచ్చాడు. వస్తూ వస్తూ ఊళ్లో నీళ్ళు కాచాక మిగిలిన బూడిద కవర్లో తీసుకుని వచ్చాడు.


బస్టాండ్ నుంచి ఆటోలో ఇంటికి వచ్చి తలుపు తీసాడు. వేసిన తలుపులు, కిటికీలు వేసినట్టే ఉన్నాయి. ఇంట్లోని ఖరీదైన వస్తువులే మాయం అయ్యాయి.


లబోదిబోమంటూ మాధవ శర్మ పక్కింటి వాళ్లని వాకబు చేసాడు.


మీ బంధువులబ్బాయి ఈ వస్తువుల్ని తీసుకుని నీకు కొత్త వస్తువులు ఇస్తున్నాడటగా. అతనే నిన్న పెద్ద ఆటో తీసుకుని వెళ్లాడు. సరదా మనిషి. కళ్ళజోడు, మాస్క్ తీయమన్నా తీయలేదు. భలే జాగ్రత్త అని చెప్పాడు పక్కింటాయన.


రాజీవ్ నంబర్ కూడా తీసుకోలేదు తను. ఇదంతా ఏదో ప్లాన్ లా ఉంది. తన దగ్గరకు వచ్చి, డబ్బులు ఇచ్చి, ఊరు వెళ్లేలా చేసి మరీ ఇల్లు దోచేశాడు.


ఇవాళ నా అదృష్టం బాలేదు అనుకుంటూ మాధవ శర్మ కుర్చీలో కూర్చున్నాడు. కవరుకు ఉన్న బూడిద చేతికి అంటుకుని ఏదో గుర్తు చేసింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract