Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

సాయంత్రం హత్య

సాయంత్రం హత్య

1 min
322


ఎవరైనా దొరుకుతారా అని చూసాను. వీడి గురించి చెప్పడానికి.


మాష్టారూ! అని ఎంత వినయంగా పలకరిస్తున్నాడు. దగుల్బాజీ వెధవ. కాదు కాదు. ఖూనీకోరు. 


సాయంత్రం వ్యాహ్యాళికి వెళితే కనిపించాడు. ఒక హంతకుడికి పాఠాలు చెప్పిన టీచర్ అని గుర్తుకు రాగానే నాలో సహనం చచ్చిపోయింది.


మొహం చిట్లించి అతను అడిగిన ప్రశ్నలకు తలూపాను.

జైలు నుంచి విడుదలైన వాడిలా లేడు. జుత్తు కాస్త తెల్లబడింది. మంచి బట్టలు వేసుకుని, క్రాపు చేయించుకుని ఏదో పెళ్లికి బయలుదేరినట్లే ఉంది వ్యవహారం. వాణ్ణి చూస్తే ఎందుకురా ఇలా చేశావ్ అని అడగాలనిపించలేదు.


అసలు ఎందుకు ఎదురుపడ్డాడురా బాబూ అనిపించింది.

తనస్సలు తప్పు చేయలేదన్నట్లు పది నిముషాలు ఏదో చెప్పుకొచ్చాడు. 


అయినా అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకీ సంగతులు. నాదగ్గరికొచ్చి చెప్పడం వృథా. నేనెలాగూ కోర్టు తీర్పే నమ్ముతాను.


ఆ పది నిముషాలు వింటున్నట్టు నటించి అక్కడి నుంచి బయటపడ్డాను.


వాడి మొహంలో ఏదో తృప్తి కనిపించింది. నిజాన్ని చెప్పినప్పుడు కలిగే తృప్తి..! 


అయినా నేను వ్యక్తిని ఎలా నమ్మను? వ్యవస్థను కదా నమ్మాలి..



Rate this content
Log in

Similar telugu story from Abstract