t. s.

Tragedy

4  

t. s.

Tragedy

ఈ నగరానికి ఏమైంది

ఈ నగరానికి ఏమైంది

1 min
722


తేది : 20 - 03 - 2020


ఈ నగరానికి ఏమయింది !!


రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.

ఎటువైపు చూసిన ఒక్క మనిషి జాడ లేదు.

మనుషుల జాడ లేక రోడ్లన్నీ నిశ్శబ్దంగా నిద్ర పోతున్నాయి.


లాక్డౌన్ వల్ల ప్రపంచం మొత్తం నిద్ర పోతున్నట్టు నీరవ నిశ్శబ్దంలో ఉంది.


రోడ్డు మీద కుక్కలు వీర విహరం చేస్తున్నాయి.

మనుషులకి లేని స్వేచ్ఛ మాకుంది అని అంటున్నట్టు ఉన్నాయి వాటి అరుపులు.


అంతేనా ! లేక అవి కూడా "ఈ నగరానికి ఏమయింది"

ఒక్క మనిషి రోడ్డు మీద కనపడట్లేదు అని అరుస్తూ అడుగుతున్నాయ అనిపిస్తుంది.

మాయదారి వైరస్ ని వదిలించుకోవడానికి తిప్పలు పడుతూ జనాలు ఎవరికి వారు ఇంట్లో దాక్కున్న

రోజు.

నిశ్శబ్ద జీవితానికి ద్వారాలు తెరిచిన రోజు.

ఉరుకుల పరుగుల జీవితం అలవాటయిన మనిషి సహనానికి పరీక్ష పెట్టిన రోజు.


ప్రతిరోజు చరిత్ర కావాలనుకునే మనం ఇలాంటి చరిత్ర సృష్టించే మరొక రోజు రావద్దని మరీ మరీ కోరుకుందాం.

ప్రతి మనిషి ఈ రోజు ఎప్పటికీ గుర్తు పెట్టుకుని ఆరోగ్య పధ్ధతులు పాటిస్తే భవిష్యత్తులో మన దేశం సశ్యశ్యామలం అవుతుంది.

ప్రకృతి నాశనం కాకుండా మన జీవిత విధానాన్ని మార్చుకుంటే జన జీవన స్రవంతి మలయ సమీరమై మారుతుంది.


వైరస్ పునాదులపై నరకపు దుర్మరణాలు

నిలువునా నిలిచిపోయిన జీవితాలు

ఇది చూసినా మారరా మనుషులు.

మార్చుకోండి మనుగడ నిశ్వాసలు.

కుళ్ళబెట్టే కాలుష్యాన్ని దరి చేరనీయకండి.

ప్రతి వ్యక్తి నాకెందుకు అని వదిలేయకండి.

"నీ"ఒక్కడితోనే మొదలై "నా" నుంచి నడిచి జన ప్రవాహం సముద్రమంత అవుతుంది.

అందుకే మనకెందుకులే అని వదిలేయకండి.

ఆరోగ్య సూత్రాలు పాటిద్దాం.

లేకపోతే..

ఈ రోజు లాగ ప్రతిరోజూ ఇంట్లోనే దాక్కోవాల్సి వస్తుంది.

వీధులను, నగరాలను నిశ్శబ్ద స్మశానంగా చూడాల్సి వస్తుంది.



Rate this content
Log in

Similar telugu story from Tragedy