Dr.R.N.SHEELA KUMAR

Romance

3.1  

Dr.R.N.SHEELA KUMAR

Romance

గువ్వల మువ్వ

గువ్వల మువ్వ

2 mins
1.7K


అదో ప్రశాంతమైన వాతావవరణం. జోరుగా గాలి, చల్లని చిరు జల్లు, గొడుగు పట్టుకొని ఒకవైపు ఓని పైట జరిపోతుందేమో అనే భయం, లంగా తడిచిపోతుందేమో అనే తపన ఆలస్యమయితే ఎక్కడ అమ్మ తిడుతుందో అనే భయం, అప్పటికి ఎలాగో ఖష్ట పడి నళిని, నలినంగా ఇంటికి చేరుకుంది. అమ్మ ఏంటీ వర్షం లో ఇలా తడిచి రాకపోతే ఎక్కడైనా ఆగి వర్షం ఆగిన తరవాత రావొచ్చుకదా. నువ్వేమైనా ఇంకా చిన్న పసిపాపవా తడవడానికి అని విరుచుకు పడింది అమ్మ. వెంటనే నాన్న సరే లేవే వచ్చేసింది కదా వదిలేయ్ అన్నారు. ఆహా ఇక ఆ సంతోషానికి హద్దులు లేవు.

రాత్రి 8అయ్యింది ఎదురుగ కిరాణాషాపు నుండి 8ఏళ్ళ అబ్బాయిలు అక్క నీకు ఫోన్ వచ్చింది అన్నాడు. సరేరా వస్తానంటూ పరిగెత్తుకు వెళ్ళింది నళిని. హలో, అంటూ ఎవరు అని అడిగింది. వెంటనే నరేష్ ఎవరో ఎందుకు ఫోన్ చేస్తారు చెలి నేనే నరేష్ అన్నాడు. అంతే నళిని కళ్ళు నేలపై నిలవలేదు. ఇవాళే కదా కలిసాం మళ్ళీ ఫోన్ చేశావేంటి అని భయంతో అడిగింది. ఏమి లేదు వర్షం పడింది కదా ఇంటికి జాగ్రత్తగా వెళ్ళావా అని అడుగుదామని అన్నాడు. వెంటనే ఓ మందహసం తో కలిసిన కోపంగా అంత అక్కర వున్నవాడివైతే ఇంటి దగ్గర దింపి వెళ్లాలి vఅన్నది. ఓహ్ అలా అయితే రేపు కలుద్దాం ఇంటి దగ్గరే దింపుతాను అన్నాడు. సరే అమ్మ పిలుస్తూ వెళ్ళాలి అంటూ ఫోన్ పెట్టేసి వెళ్ళింది. అమ్మ ఈ సమయంలో ఎవరు ఫోన్ అని అడిగింది సుమ అమ్మ దానికి పాఠంలో సందేహం అంటూ నెమ్మదిగా జారుకుంది. అందరు వారి వారి గదుల్లోకు వెళ్ళరు నళినికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ నరేష్ మాట్లాడే విధాన్ని తలుచుకుంటూ నవ్వుతూ ఉంది. ఇలా రేటయి 2అయ్యింది పడుకునే సరికి. మరుసటి దినం కాలేజీ కి వెళ్లిన వెంటనే సుమ తో నరేష్ గురించి చెపుతు, అమ్మ అడిగితె ఫోన్ నువ్వే చేసేనాని చెప్పు అంటూ ఓ చాక్లెట్ ఇచ్చింది. సుమ సరెలేవే మీ ప్రేమకు నేను వారదిని. అన్నది.

సాయంత్రం 4గంటలకు బీచ్ దగ్గర నళిని, నరేష్ లు కలిశారు. అప్పుడు నరేష్ కళ్ళుమూసి కళ్ళకు మువ్వల పట్టెలు పెట్టాడు. అవి పెట్టిన ఆ కళ్ళకు అందమా లేక ఆ కళ్ళకు పెట్టిన ఆ పట్టీలకు అందమా అన్నట్లున్నాయి. నళిని నువ్వు నాకు పట్టీలిచ్చావ్ నేనేమివ్వగలను అని అడిగింది. నేనడిగింది ఇస్తావా అని అడిగాడు ఏమడుగుతాడో అనే భయం ఓ ప్రక్కన కానీ నరేష్ మంచి మనసు వున్నవాడు కనుక ఈ రోజు మీ ఇంట్లో మన పెళ్ళికి సమ్మతం అడుగుదామంటూ సంతోషంగా ఆ గువ్వల జంట మువ్వల సవ్వడితో వెళ్లారు, తల్లిదండ్రులు సమ్మతంతో వివాహం చేసుకున్నారు. సంతోషంగా జీవనాన్ని సాగించారు.


Rate this content
Log in

Similar telugu story from Romance