ఏమైపోతుంది నా దేశం ?
ఏమైపోతుంది నా దేశం ?
దేశం అంటే మట్టి కాదోయ్
దేశం అంటే మనుషులోయ్
అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు
మరి నా దేశంలో ఏలాంటి మనుషులున్నారు...
మనుషుల రూపంలో మానవ మృగాలెందరో తిరుగుతు ఉన్న దేశం....
ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కడతేర్చే కసాయిలు ఉన్న దేశం....
సంపాదన మీద పడి సంబంధాలను మర్చిపోయే సన్నాసులెందరో ఉన్న దేశం....
డబ్బుకి ఇచ్చిన విలువ జబ్బు వస్తేగాని
ఆరోగ్యం ఉంటేనే అందమైన జీవితం అని తెలియని అడ్డగాడిదలెందరో ఉన్న దేశం....
ఆకలితో ఉన్నవారిని కాలుతో తన్ని
బంగారు కంచంలో నల్ల రాయికి నైవేద్యం పెట్టే నరులు ఉన్న దేశం....
మురికి నీళ్లల్లో మునిగితే చేసిన పాపాలు పోతాయని మూఢనమ్మకంలో బ్రతుకుతున్నా మూర్ఖులు ఉన్న దేశం....
ఆడపిల్లలపై అఘాయిత్యం చేసే ముందు అరక్షణం ఆలోచించని కామాంధులు ఉన్న దేశం....
ఏమైపోతుంది నా దేశం.
✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ
