Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

ద్వేషంతో

ద్వేషంతో

1 min
15


తనతో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడాలి అన్నా భయమే. ఎవరి గురించి ఏ కాస్త పొగిడినా కోపం వచ్చేస్తుంది అంది నీల వాళ్ళ ఆయన గురించి.

నాకర్థం కాలేదు..ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంది కరుణ. మొన్న టీవీ చూస్తూ ఒకమ్మాయి పాట బాగా పాడుతుంటే పొగిడాను. అంతే. ఇంత కన్నా గొప్పగా పాడే వాళ్ళను నువ్వు చూడలేదా అన్నాడు.


అంతకు ముందు ఎవరో డాన్స్ బాగా వేస్తారని అన్నాను టీవీలో చూస్తూ. వెంటనే టీవీ ఆఫ్ చేశాడు. ఆయన అందరినీ ద్వేషిస్తూ మాట్లాడతారు. ప్రతి దానికీ విపరీతంగా కంపేర్ చేస్తూ ఉంటారు అంది నీల.


ద్వేషం అనేది చాలా పెద్ద మాట..అలా అనకు. మీ బంధువుల్లో ఎవరి టాపిక్ అయినా వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ గురించి మాట్లాడి చూడు. అతనికి కేవలం టీవీలో వచ్చే వాళ్ళ మీద నెగెటివ్ ఫీలింగ్ ఉందా. లేదా మిగిలిన వాళ్ళ మీద కూడా అదే ఫీలింగ్ కలుగుతుందా అనేది అతని రెస్పాన్స్ బట్టి అంచనా వేయొచ్చు అంది కరుణ. 


సరే అంది నీల.


Rate this content
Log in

Similar telugu story from Abstract