SATYA PAVAN GANDHAM

Abstract Tragedy Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Tragedy Others

"ది సూసైడ్ నోట్"

"ది సూసైడ్ నోట్"

13 mins
314



"అందరికీ నమస్కారం...

అయిన వాళ్ళు చేసిన తప్పులకి, నా ప్రమేయం లేకుండానే చిన్నాభిన్నమైన జీవితాన్ని ఇక అనుభవించలేక తీసుకున్న ఓ సాహసోపేత నిర్ణయం ఇది.

గత కొద్ది రోజులుగా నేను మానసికంగా చాలా నలిగిపోతున్నాను. కొన్ని రోజులుగా అనే కంటే, కొన్ని సంవత్సరాలుగా అంటే బాగుంటుందేమో. దానికి గల కారణం కొన్ని అనుకొని మా ప్రమేయలు లేని పరిస్థితులు. అవి మా జీవితాలపై ప్రభావం చూపడం.

ఇంతకాలం ఈ పరిస్థితులలో నలిగిపోతూ భరిస్తూ వచ్చిన నేను, దీన్ని ఇంకా ఇంకా కొనసాగించలేకపోతున్నాను. అందుకే, ఈ కుటుంబంలో, ఈ సమాజంలో, ఈ లోకంలో ఇక ఊపిరితో ఉండడం కూడా వ్యర్థం అనిపిస్తుంది.

ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ ప్రతి ఇంట్లో సర్వసాధారణమే కదా..!

ఓ యువకుడిగా వాళ్ళకి నచ్చ చెప్పాల్సింది పోయి...

ఆ మాత్రం దానికే కన్నవారిని, అయినవారిని బ్రతికినంత కాలం బాధ పెట్టే...

ఇలాంటి ఒక తెలివితక్కువ నిర్ణయం తీసుకోవాలా అంటే....

గొప్ప చదువు, మంచి తెలివి ఉండి ఇంత అపరిపక్వతగా ఆలోచిస్తూ, ఏ క్షణికావేశంలోనో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం లేదు నేను.

ఒకప్పుడు మెరిట్ విద్యార్థిగా వెలుగొందిన నేను, ఇప్పుడు సరైన ఉద్యోగంలో స్థిరపడలేక, చేసే ప్రతి ప్రయత్నంలో విఫలమవుతూ ఓడిపోవడానికి, ఆ ఓటములను తట్టుకోలేక నేను నా ప్రాణాలను తీసుకోవడానికి గల కారణం తెలియాలి అంటే, ముందు మీకు నా గతం కూడా తెలియాలి.

                         **************

నాన్న ఒక చిన్న వ్యాపార వేత్త. తాతయ్య దగ్గర నుండి పుణికి పుచ్చుకున్న ఆ చిరు వ్యాపారం...

ఆయన తోడున్నంత వరకూ అడపా దడపా బాగానే సాగింది. కానీ, ఎప్పుడైతే ఆయన కాలం చేశారో అందులో నాన్న సరిగ్గా రాణించలేకపోయారు.

ఇక రాబడి కరువై, సంపాదన మార్గపు అన్వేషణలో భాగంగా...

అలా అంతకుముందు కొంచెం కొంచెం పోగేసిన డబ్బును వడ్డీలకు బయటకి ఇచ్చేవారు నాన్న!

ఒకవైపు నేటి మనుషుల స్వార్థపూరిత మనస్తత్వాలు ఎరిగి, వద్దని మేమెంత మొత్తుకున్నా(అమ్మ,చెల్లి,నేను) వినకుండా...

అలా మేమనుకున్నట్టు గానే అప్పులు తీసుకున్న వాళ్ళు మెల్లగా నాన్నగారు తిరిగి అడిగేసరికి ఎదురుతిరగడం మొదలు పెట్టారు. వడ్డీ సంగతి దేవుడెరుగు, ఇచ్చిన అసలకి కూడా సమాధానం లేకపోయింది వాళ్ల దగ్గర నుండి.

అప్పులు తీసుకుని మొహం చాటేస్తున్న వారిలో బయట వ్యక్తులతో పాటు, దగ్గరి చుట్టాలు కూడా ఉన్నారు లెండి.

ఈ క్రమంలోనే నమ్మిన వాళ్లు చేస్తున్న మోసాలు తట్టుకోలేక, ఆయన మద్యానికి బానిసయ్యారు. అప్పు చెల్లించని వాళ్ళతో బయట గొడవలు,

అసలు డబ్బులు ఇవ్వడం ఎందుకు, ఇప్పుడీ గొడవలు ఎందుకంటూ అడ్డుపడిన అమ్మతో ఇంట గొడవలు. ఒక్కోసారి మా ముందే మేము వినకూడని పదాలతో అమ్మని దూషిస్తూ కొడుతుంటే, నిండా పదహారేళ్లు కూడా దాటని మేము ఆయనికి అడ్డు చెప్పలేకపోయేవాళ్ళము.

అర్థరాత్రి జరిగినా... పట్టపగలు జరిగినా... అదంతా చూస్తూ ఏమీ చేయలేని ఒక నిస్సహాయతతో అలానే పెరిగాము. అంతకుముందు వరకూ ఉమ్మడి కుటుంబంలో తరుచూ పెద్దవాళ్ళ మధ్య జరిగే గొడవలతో, విడిపోయాక వీటితో మా(చెల్లి, నేను) మనస్తత్వాలు ఆ చిన్ననాటి నుండే భయమనే భీజాలు నాటుకుని, ఒత్తిళ్లనే పొదరిల్లుతో ఏర్పడడం మొదలయ్యాయి.

ఇంట్లో పరిస్థితులు అంత వ్యతిరేకమైనా..

వాటిని తట్టుకుని నిలబడ్డాం చెల్లి నేను.

తల్లిదండ్రులకిచ్చిన మాటకి కట్టుబడి మేమే దుర వ్యాపకాల వైపు మళ్ళకుండా...

చదువును నిర్ల్యక్షం చేయక, అందులో మెరుగ్గానే రాణించాము. అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పటి పది తరగతి ఫలితాల్లో ఒకరి వెంబడి ఒకరు వరుస సంవత్సరాలలో మా ఊరి స్కూల్ టాపర్స్ గా నిలిచాము.

ఆ తర్వాత కొన్నాళ్ళు ఇంట్లో పరిస్థితులు బాగానే ఉండడంతో...

ఎలాగోలా చివరికి ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన నేను, IES అవ్వాలనే లక్ష్యంతో శిక్షణ మొదలుపెట్టాను. అలా మొట్టమొదటి సారి ఇంటి నుండి బయటకి దూరంగా సిటీకి వచ్చాను.

మెట్టూ మెట్టూ ఎక్కుతూ అందరితో పోటీ పడి నా లక్ష్యాన్ని చేరుకుంటున్న తరుణంలో ,

మరొక గుదిబండ లాంటి వార్త...

ఆయన మరింతగా మద్యానికి బానిసైనట్టు తెలిసింది. గడప దాటి బయటకు రాని అమ్మ చెల్లి వీదిపాలు అవుతున్నట్టు తెలిసింది. ఆయన గురించి నాకు కొంతమంది చిన్ననాటి ఇంటి దగ్గరి స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా నాకా విషయం తెలిసింది. ఇక సిటీలో ఉండలేక ఇంటి బాట పట్టాను.

అదంతా భరించడం అమ్మకి, పెళ్ళీడుకి వచ్చిన చెల్లికి కష్టంగా ఉంటున్నా...

విషయం నాకు తెలిస్తే ఎక్కడ నేను మళ్ళీ నా లక్ష్యం నుండి గాడి తప్పుతానొనని నాకు తెలియపరచలేదు వాళ్ళు. పైకి చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళు పడుతున్న ఆ నరకయాతన గురించి తెలిసి,

నా లక్ష్యంపై ఏకాగ్రత లోపించింది. ఇక అక్కడ వుండలేక, ఆ కోచింగ్ ఆపేసి ఇంటి బాట పట్టాను. చివరికి నా గమ్యాన్ని చేరుకోవడంలో విఫలం అయ్యాను.

కొన్నాళ్ళకి ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాకా... 

కాళిగా ఉండడం ఇష్టం లేక, ఒక చిన్న జాబ్ లో జాయిన్ అయ్యాను. దానిద్వారా NCC లాంటి MNC కంపెనీ లో అతి కస్టమ్ మీద జాబ్ సంపాదించాను.

ఈ క్రమంలోనే, నా ఎదుగదలను మళ్ళీ కిందికి లాగే సంఘటన, కుడి భుజంగా భావించే బాబాయ్(నాన్నగారి తమ్ముడు) ఆకస్మిక మరణం నాన్నగారిని మరింత కృంగుబాటుకు గురించేసింది. దాంతో ఉన్న కాస్త బలగం కూడా కోల్పోయేట్టు చేసి, చివరికి నాన్న గారిని ఒంటరిని చేశాయి అప్పటి పరిస్థితులు. ఇక బాధనే వంకతో ఆయన త్రాగుడు అలవాటు మరింత పరాకాష్టకు చేరింది.

ఆ కంపెనీలో ఒక అయిదు నెలలు పడుతూ లేస్తూ జాబ్ చేశానో లేదో మళ్ళీ ఈయన తాగేశి పడి దొర్లుతున్నాడని ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ల నుండి ఒకటే ఫోన్ కాల్స్.

ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు(చెల్లి, అమ్మ) వాళ్లు మాత్రం ఏం చేయగలరు. పైగా గడప దాటి బయటకి వెళ్లని వాళ్ళు , నా తండ్రి ఇలా తప్ప తాగుతూ ఊరంతా అల్లారిపాలు అవుతుంటే, పెళ్ళీడుకి వచ్చిన పిల్లకి సంబంధాలు రావనే భయంతో బ్రతుకుతున్నారు. తనకింక పెళ్లి సంబంధాలు ఎక్కవని చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ నన్ను భయపెట్టి చివరికి నన్ను ఆ జాబ్ కూడా మానిపించేసారు. అలా కొన్ని రోజులు మళ్ళీ ఇంటికి వచ్చేసి, అక్కడే కాళిగా ఉంటూ ఆయనికి సర్ది చెప్తూ కుటుంబాన్ని లాగడం నా వంతైంది. అలా కాళిగా ఉంటున్నప్పుడే, ఏ చుట్టాలు చుట్టు పక్కల వాళ్ళు నేను జాబ్ మనేయడానికి కారకులయ్యారో.. ఇప్పుడే వాళ్ళే మాట మార్చి ఎన్నాళ్ళిలా కాళిగా ఉంటావ్ అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు.

దాంతో మళ్ళీ ఇంట్లో పరిస్థితులు చక్కదిద్ది, ఇంకా ఇంట్లో అలా కాళిగా ఉండడం ఇష్టం లేక మళ్ళీ బెంగళూర్ లో మంచి జాబ్ లో జాయిన్ అయ్యాను.

అలా ఆ జాబ్ చేస్తున్నప్పుడే,

కొన్నాళ్ళు గడిచాక మళ్ళీ ఆయన డ్రింకింగ్ కి బానిస అయ్యారని, ఇంట్లో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని తెలిసింది. ఈ కారణాలతో అక్కడ కూడా నిలబడ లేక ఆ జాబ్ కూడా మానేసి హైదరాబాద్ వచ్చేసాను. అప్పుడే సరిగ్గా కోవిడ్ పండమిక్. కొన్నాళ్ళ తర్వాత చివరికి మళ్ళీ జాబ్ లోకి వెళ్లి సెటిల్ అయ్యాను. సరిగ్గా సంవత్సరం తిరిగింది. నా ఈ ప్రయాణం మాత్రం పడుతూ లేస్తూ సాగుతూనే ఉంది. ఆయన మాత్రం ఆ త్రాగుడు అనే పద్మవ్యూహం నుండి చిక్కుకుని బయటపడలేకపోతున్నాడు.

ఒకానొక సమయంలో మంచి మంచి జాబ్ చెయ్యాల్సిన నేను, ఆయనను అదుపులో పెట్టే ప్రయత్నంలో భాగంగా బెల్టు షాప్ ల దగ్గరకి ఆయన రాకుండా అక్కడ కాపలా ఉండాల్సి వచ్చేది. అక్కడికి దిగజారిపోయింది నా కెరీర్.

అప్పటివరకూ చెల్లికి వచ్చిన సంబంధాలు అన్నీ...

నేనూ తను చెడగొట్టేవాల్లం.

కారణం...

అసలే ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్న నాతో పాటు,

ఇప్పుడు తను కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోయి వాళ్ళకి దూరమైతే తర్వాత వాళ్ళిద్దరూ ఎలా ఉంటారోనని మా భయం. 

మా చెల్లికి పెళ్లి చేయడం ఆలస్యమవుతుందని నలుగురు నానా మాటలు అన్నా, నిందలు వేసినా అసలే కోపదారి మనిషినైన నేను అవన్నీ ఒకింత ఓపిక, సహనంతోనే బరించాను. మా ఇంట్లో పరిస్థితులు మాకు తప్ప ఎవరికి తెలుస్తాయి లే అన్న ఉద్దేశ్యంతోనే సర్ధుకుపోయను..

ఆయన బాగున్నక, ఇంట్లో పరిస్థితులు కొంచెం సర్ధుకున్నాకా... చెల్లికి పెళ్లి చేద్దామనుకున్న సమయానికి, మాకు నచ్చిన సంబంధాలు చెడిపోవడం స్టార్ట్ అయ్యాయి.

కారణం...

నాన్న గారి దగ్గర అప్పులు తీసుకుని ఆయనికి విరోధులైన వారు మా కుటుంబం గురించి చెడుగా చెప్పడంతో ఎవరూ ముందుకు రాలేదు.

దానికి తోడు ఒకప్పటి మా నాన్నగారి డ్రింకింగ్ అలవాట్లు కూడా మరొక కారణం. పైగా వచ్చిన సంబంధాలు చెడగొట్టింది మాతో నమ్మకంగా, సఖ్యతగా మెలిగే మా చుట్టాలు, చుట్టుపక్కల వాల్లే.

ఆ విషయం ఆయనికి తెలుసూ...

పరిపక్వతతో ఇప్పటికైనా వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ... ఇకనైనా మేల్కొవాల్సింది పోయి, ఆయన అయిన వాళ్ళే మోసం చేశారు అంటూ మళ్ళీ మళ్ళీ అదే రొచ్చులోకి దిగి ఆపై అందులో కూరుకుపోయి మరింతగా దిగజారిపోతున్నాడు. అప్పటికే ఆరోగ్యం క్షీణిస్తుందని ఎంత నచ్చచెప్తున్నా మా మాటలు పెడ చెవిన పెట్టేవారు.

ఊరంతా తెలుసు నా గురించి, మా చెల్లి గురించి...

నాకిప్పటికీ ఒక డ్రింకింగ్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్ లాంటివి లేవని. అసలు ఒక అమ్మాయితో మాట్లాడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతానని.

పైగా సమాజ సేవ, అవయవ దానం లాంటివి వాటిలో చురుగ్గా పాల్గొంటానని.

నేనే ఇన్ని మంచి గుణాలతో ఉంటే, ఇక మా చెల్లి ఎంత పద్ధతిగా ఉంటుందో ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

మా కుటుంబ బండి ని నడిపే నాన్న విఫలం అయినా మేము గాడితప్పకుండా ఎప్పటికప్పుడు ఆ బండి సరైన మార్గంలో పెడుతూ చాలా పద్ధతిగా పెరిగాము.

మా గురించి ఇంత తెలిసి కూడా... ఈ సమాజం మా నాన్న చేసిన తప్పులకు మమ్మల్నీ బలిపశువులను చేసింది. ఎవరెవరో చేస్తున్న తప్పుల కు ప్రతిసారీ శిక్ష అనుభవిస్తూ బలి పశువులు అవుతున్నది మాత్రం మేము.

అందుకే ఒక ఎనిమిది నెలల క్రితమే సూసైడ్ చేసుకుందామని అప్పుడు కూడా ఇలానే లెటర్ రాశాను. కానీ, సరిగ్గా అప్పుడే చెల్లికి మంచి సంబంధం రావడంతో... దాని జీవితమైనా బాగుండాలని నా ఆలోచన విరమించుకుని, చివరికి దాన్ని ఎలాగోలా గట్టెక్కెంచేసాము.

నాకున్న ఈ కష్టాలకు తోడు సివిల్ ఫీల్డ్ లో ఉండే అక్రమాలకు, మోసాలకు తట్టుకోలేకపోతున్నాను. చూస్తూ సైలెంట్ గా ఉండే తత్వం కాదు నాది. తిరగబడి చాలానే ఇబ్బందులు కొనితెచ్చుకున్నాను. చివరికి చెల్లి పెళ్లి విషయంలో నాన్న ఒక్కరే చేయలేరని ఆయనికి తోడుగా ఉండడం కోసం అడిగిన సెలవులు ఇవ్వకపోవడంతో ఈ జాబ్ కూడా వదులుకున్నాను.

ఇన్ని ఇబ్బందులతో సతమవుతూ రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకొరోజు, ఇంకోరోజు కాకపోతే ఆపై రోజు అంటూ నా జీవితం బాగుపడే క్షణం కోసం ఎదురు చూడని రోజంటూ లేదు ఆ పది పూర్తయిన ఈ పన్నిండెళ్ళలో...

ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఇంత వయసొచ్చినా...

జాబు గీబూ లేకుండా కాలిగా ఉంటున్నావ్ అంటూ...

ఇంట్లో పరిస్థితులు తెలిసి కొందరు, తెలియక కొందరు నన్ను సూటి పోటీ మాటలతో పొడుస్తుంటే, ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇదంతా వివరించలేక ఇలా చివరిగా నా వేదనని అడిగిన, అడగని వారందరికీ తెలియపరుస్తున్నాను.

కనీసం నా చుట్టూ...

చెప్పేవాళ్ళు కానీ, ఒదార్చేవాల్లు కానీ లేరు. చుట్టాలు అన్న వాళ్లు ఉన్నా.... వాళ్ళు ఎంతకు అంతే, ఎవరూ మమల్ని పట్టించుకోరు.

మేనమామలు అన్న వాళ్లు కూడా దూరం అయిపోయారు.

అమ్మా నేను ఆయనికి ఇప్పటికీ చెప్పలేకపోతున్నాము. తను చెప్తుంటే మాత్రం... నేను వినకూడని భూతులు తిడుతున్నారు తనని, ఎందుకు అలా తిడుతున్నావని నేను ఎదురు తిరిగితే తాగేసి ఇంటి దగ్గర మళ్ళీ గొడవ చేస్తున్నారు.

ఇన్ని టెన్షన్లు తో రోజు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. అయినా నేను ఏ దురలవాట్లు అలవాటు చేసుకోలేదు. నాకున్న స్ట్రెస్ తగ్గించుకోవడానికి, వాటి నుండి బయట పడడానికి ఆర్ట్స్, పెయింటింగ్స్ వేయడం, కథలు, కవితలు రాయడం లాంటి చాలా ప్రయోగాలు చేశాను. కొంతవరకూ నా మానసిక ఆందోళన తగ్గింది వాటి వల్లే.

కానీ, నేను ఎదుగుతున్న ప్రతిసారీ నన్ను వెనక్కి లాగే శత్రువు నా పరిస్థితులు. ఆ పరిస్థితులు మా నాన్న గారి రూపంలో ఎదురవడం తట్టుకోలేనిది.

నాకున్న గుణాలు, లక్షణాలతో ఊరిలో మంచి పేరు సంపాదించినప్పటికీ ....

అందరూ మా నాన్న గురించి నా దగ్గర చెడుగా మాట్లాడుతుండడం జీర్ణించుకోలేని విషయం.

ఆయన తెలిసో తెలియకో చేసే పనులు వల్ల మాలాంటి కలుపుగోలు వ్యక్తిత్వం ఉన్న మనుషులకు కూడా మంది దూరం అవుతున్నారు.

నాన్న ఇప్పటికీ ఓ గొప్పోడు:

ఎందుకో నాన్న...

ఇప్పటికీ మిమ్మల్ని తప్పుపట్టాలని అనిపించడం లేదు. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు మీరు. అడిగినవన్నీ సమకూర్చారు. మాకు సరైన నిద్ర ఇవ్వడం కోసం, మీరెన్నోనిద్రలేని రాత్రులు గడిపారు.

మాకు మూడు పూటల తిండి పెట్టడం కోసం మీరు మంచి నీళ్ళతో కడుపు నింపుకున్న రోజులున్నాయి.

మాకు పండక్కి కొత్తబట్టలు కొనడం కోసం, మీరు చిరిగిన బట్ట కట్టారు.

కేవలం మీకున్న ఒత్తిళ్లు, చుట్టూ నమ్మిన వాళ్ళు చేసిన మోసాలు మిమ్మల్ని అలా మార్చేశాయి. నమ్ముకున్న వాళ్ళే మిమ్మల్ని నట్టేటా ముంచేశారు. మీకు ఆ విషయం అర్ధమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ, అన్ని తెలిసి కూడా మీరు ఇంకా తేరుకోకుండా ఇంకా ఇంకా ఆ మద్యం అనే ఊబిలో కూరుకుపోవడం మాకు నిద్రలేని క్షణాలను మిగులుస్తుంది.

ఈ రోజు నా తండ్రి చేసినా ఆ పొరపాట్లే నా ఈ మరణానికి ప్రత్యక్ష కారణం అనుకుంటే అది మీ పొరపాటే. నమ్మిన ఆయనిని మోసం చేసి, మా జీవితాలు ఇలా నాశనం అవ్వడానికి పరోక్ష కారకులైన కొందరు చుట్టాలు, సన్నిహితులు.

                      **************

అమ్మ కోసం...

అమ్మ కోసం నా నిర్ణయాన్ని మార్చుకోవాలని ఉంది.

ఎందుకంటే, తను ఓ పిచ్చిది. నేను లేకపోతే తను కూడా ఈలోకంలో ఉండలేదు. అటు పుట్టింటి వాళ్ళు, ఇటు అత్తింట్లో వాళ్ళు ఈ 29 ఏళ్లుగా తనని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కనీసం మాట కూడా పైకి మాట్లాడని తత్వం తనది. అందుకే, మా నాన్న బయట ఏ గొడవ జరిగినా ఒక్కోసారి వాళ్ళని ఎదిరించే దైర్యం లేక, లోకువగా ఉంటుందని మా అమ్మని దానికి కారకురాలు చేస్తూ నా ముందే తనపై విరుచుకుపడుతుంటారు. బయట వాళ్ల ముందు లోకువ చేసి మాట్లాడతారు.

తనని ఏమాన్నా....

అడిగేవారు లేరని దైర్యం ఆయనికి. ఎన్ని సార్లు అమ్మని నాన్నకి దూరంగా ఉండమని చెప్పినా ఆయన్ని వదిలి రాను అంటుంది.

మా అమ్మని చిన్ననాటి నుండి చాలానే చిత్ర హింసలు పెట్టారు అత్తింటి వారు. అయినా వారికి మేలు చెయ్యాలని చూసిందే తప్పా.. ఎప్పుడూ పైకి కిక్కురుమనలేదు. అలాంటి అమ్మని చిన్ననాటి నుండి చూసి చూసి నా లో ఈ కోపం, ఆగ్రహ ఆవేశాలు బాగా పెరిగిపోయాయి. ఎవరైనా ఎదుటివారు చిన్న తప్పు చేసినా, నచ్చని పని చేసినా కోపాన్ని అదుపులో పెట్టుకోక అరిచేస్తాను.

అది వాళ్ల మంచి కోసం అయినా... నన్ను తప్పుగా అర్ధం చేసుకుని దూరం పెట్టారు చాలా మంది. అన్ని ఓపిక గానే భరించాను ఇప్పటివరకూ ...

కానీ, ఇక ఇప్పుడు నా కెరీర్ ముగిసిపోతుంది అందుకే, ఈ జీవితం నాకు ఇక అక్కర్లేదు అనిపిస్తుంది. అందుకే ఈ నిర్ణయాన్ని మార్చుకుందాం అని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు.

తనని విడిచి వెళ్ళలేక, ఇప్పుడు కూడా కలిసి చచ్చిపోధాం అంటే ఏవేవో దైర్యాలు చెప్తుంది. ఎందుకంటే, నేను కాకుండా మా అమ్మని ఇంకెవరూ చూడరు. నేను లేని మరుక్షణం తను బ్రతికివుండడం కన్నా కూడా చావడమే మేలు అనిపిస్తుంది.

అందుకే అమ్మా...

నన్ను క్షమించు..!

నిన్ను వదిలేసి ఒక్కడినే వెళ్తున్నందుకు.

                         **************

చెల్లి చేసిన త్యాగం:

ఇన్నాళ్లు పడుతూ లేస్తూ బయటకి ఉద్యోగాలలో నిలదొక్కుకోవడానికి కారణం, నా వెనుకున్న దైర్యం చెల్లి. ప్రతి దాంట్లో నాతో పోటీపడి చదివి నాకన్నా పై మెట్టు పైనే నిలిచిన తను...

తను కూడా జాబ్ పేరుతో బయటకి వచ్చేస్తే, అమ్మా నాన్న ఏమైపోతారొనని ఒక పెద్ద మనసుతో ఆలోచించి ..

నా కోసం, వాళ్ల కోసం తన ఆశయాలకు అడ్డు వేసుకుంది. తన కలలను కాల రాల్చుకుంది. తన దారి తాను చూసుకోకుండా... తను చేసిన ఆ త్యాగానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు.

నిజానికి అమ్మకున్నంత సహనం, ఓపిక తన సొంతం కూడా..

అందుకే మా కుటుంబం ఇక్కడ వరకూ నెట్టికురాగలిగింది అంటే కారణం తను కూడా.

తోడబుట్టిన దాని కంటే, ఒక స్నేహితురాలిగా తనతో అన్ని పంచుకున్న నేను ఈ ఒక్క విషయం మాత్రం తనకి చెప్పకుండా వెళ్ళిపోతున్నాను.

అందుకే, చెల్లి నన్ను క్షమిస్తావు కదూ...

                    ****************

నమ్మిన స్నేహితులు తలపెట్టిన ద్రోహం...

మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా నమ్మిన నాకు, తగిన శాస్తి చేశారు. మీ అందరితో పోలిస్తే ఏ దూర అలవాట్లు లేకుండా మీలో వేరుగా ఉన్నందుకు ఈ సమాజం నాకిచ్చిన గౌరవం గంజాయి వనంలో తులసి మొక్కననీ..

కానీ, నాకొస్తున్న పేరుని జీర్ణించుకోలేక, మీకు నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగా...

నా మీద కొన్ని లేనిపోని పుకార్లు సృష్టించి, నిందలు వేసి నన్ను ఒక చెడ్డ వాడిగా సమాజంలో తీర్చి దిద్దే ప్రయత్నం చేయడం. నా ముందు మాత్రం మంచివారిలా నటిస్తూ నా సహాయాన్ని పొందడం.

                      *****************

చుట్టాలు...చుట్టు పక్కల వాళ్ళు చేసిన మోసాలు:

ఎవరికైనా ఇంట్లో వల్ల తర్వాత బాగా కావాల్సిన వాళ్ళు చుట్టాలు, చుట్టూ పక్కన వున్న వాళ్ళే...

ఇంట్లో ఇబ్బందులు చెప్తే, ఈ చిన్న వయసు వాడికి ఆ సమయంలో ధైర్యంగా ఉంటూ ఓదార్చల్సింది పోయి... మమ్మల్ని ఒంటరిగా ఒదిలేసారు.

తోడబుట్టిన చెల్లి(అమ్మ) అత్తింట్లో ఆన్ని కష్టాలు పడుతుంటే, పెళ్ళాలు మాట విని తన కష్టాలను పట్టించుకోక మూగబోయిన మేనమామల స్వరాలకు నా శతకోటి నమస్కారాలు. రేపు మీ కూతుళ్లకు ఇలాంటి అన్యాయం జరిగి మీ కొడుకులకి వచ్చే కోడళ్ళు దూరంగా పెడితే ఆ బాధ మీకు తెలుస్తుంది. కానీ, మా అమ్మకి వచ్చిన అలాంటి కష్టం ఎవరికి రాకూడదని నా కోరిక.

ఏ రక్త సంబంధం లేకపోయినా...

అత్త మామ, బాబాయ్ పిన్ని అంటూ ఆప్యాయత బంధుత్వం పెంపొందించి మీతొ ఎల్లప్పుడూ ఒక ఇంట్లో మనిషిగా కలిసిపోయిన నన్ను...

ఆపదలో ఆదుకోవాల్సిన సన్నిహితులు, చుట్టు పక్కల వాళ్లు అండదండగా ఉండాల్సింది పోయి... మా వెనుక మమ్మల్ని అవహేళనలు చేస్తూ మా కుటుంబాన్ని వీధి పాలు చేశారు. తెలిసో తెలియకో మా నాన్న గారు చేసిన పొరపాట్లకు అమాయకురాలైన చెల్లికొచ్చిన సంబంధాలు చెడగొట్టి మీ వక్ర బుద్ధి చాటుకున్నారు. అవతలి వాళ్ళ జీవితాలని నాశనం చేసేముందు ఒకసారి మీ ఇంట్లో కూడా మా లాంటి పిల్లలున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని మనవి.

అందుకే, ప్రేమ అనురాగం పంచిన మా లాంటి వారి మీద కక్ష పూనిన మీ కుసంశా ధోరణికి, క్రురత్వాలకి మీకు మీ ఈ సమాజానికి నమస్కారం. ఈ రోజు నా చావులో సింహ భాగం కారణలు మీవే. ఇకనైనా ఇలాంటి ధోరణితో బ్రతకడం ఆపండి. నాలాంటి వాళ్ళని బ్రతకనివ్వండి.

                       **************

చివరగా ప్రేమించిన అమ్మాయికి...

ప్రియమైన తనకి,

ఎప్పుడూ ఏ అమ్మాయి వంక కన్నెత్తి చూడని, అసలు పెళ్ళంటేనే ఇష్ట పడని నేను...

నా కవితలకు మీరిచ్చే మద్దతు నాలో స్ఫూర్తిని నింపి ఓ పాతికేళ్ళ వయసులో ఎందుకో మీరంటే ఇష్టం పెరిగింది. అది ప్రేమగా మారింది.

ఆనాడు మిమ్మల్ని ఇంప్రెస్స్ చేయడానికి రాసిన కవితలు ఈ రోజు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటున్నాయి. ఆనాడు విత్తుగా ఉన్నప్పుడు నీళ్ళు పోసిన మీరు..

అది చెట్టులా ఎదుగుతుంటే పక్కన లేకపోవడం నా దురదృష్టం. అపార్థం చేసుకుని మూడేళ్లుగా నాకు మీరు దూరంగా ఉన్నా... మీ మీద నా ప్రేమ మాత్రం చావలేదు. ఆకరికి నేను ఇప్పుడు చనిపోతున్నా కూడా...

ఎందుకంటే, నేను మొట్ట మొదటిగా ఇష్టపడింది, ప్రేమించింది మిమ్మల్నే కాబట్టి...

రీసెంట్ గా నా ప్రేమ గురించి తెలిసి సాక్షాత్తు మన స్కూల్ టీచరే మీ కుటుంబ సభ్యులను కలిసి నా ప్రేమ గురించి చెప్తే...

దానికి మీరు, మీ తల్లిదండ్రులు నిరాకరించారు అని తెలిసింది. కారణం నేను లక్షల్లో సంపాదించలేకపోవడం ఒకటి అయితే, మా నాన్న గారి డ్రింకింగ్ హ్యాబిట్ మరొకటి. రెండింటిలో నా తప్పేం లేకపోయినా... మీ వాళ్ల అభిప్రాయాలకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మిగిలుండేటువంటి తెలిపే సంస్కారం కూడా నేర్పింది నా తల్లిదండ్రులే. పైగా నా గుణగణాలు తెలిసి నేను చాలా మంచివాడిని, అంతకుమించిన పద్దతి గల వాడిని అని టీచర్ తో అన్నారట మీ వాళ్ళు... కానీ వచ్చిందళ్ళా నా కుటుంబంతోనే సమస్య అని తెలిసి చాలా బాధ పడ్డాను. ఎందుకంటే, నాలో మంచిని పెంచింది మీరు చెడు అనుకుంటున్నా నా తల్లిదండ్రులే.

నా ఫ్యామిలీ లో కలిసి పోయే వ్యక్తిని వాళ్ళకి కోడలిగా తీసుకురావాలి ఆశించాను. కానీ, ఇప్పుడు మీకు నా కుటుంబమే భారం అవుతుంటే తట్టుకోలేకపోతున్నాను.

మీకోసం కన్న వాళ్ళని ఒదులుకునేంత సాహసం చేయలేక అలా అని తొలి ప్రేమని చంపుకోలేక తటస్థంగా మిగిలిపోయి చాలా వేదన అనుభవించాను... లేదు లేదు ఇప్పటికీ అనుభవిస్తున్నాను కూడా.

ఈనాటికీ మీ స్థానంలో ఎంతో మంది వచ్చి ప్రేమించమని అడిగినా.. ఇంకా నా పిచ్చి మనసు మీ తోడు కోసం ఎదురుచూస్తూ వాళ్ల ప్రతిపాదనలను తిరస్కరించింది.

ఒకప్పటి స్కూల్ మెట్స్ అయిన మనం ఇప్పటికీ కలుసుకోకపోయినా... కనీసం మీ వాయిస్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియకపోయినా.... ప్రేమించింది మీ అభిప్రాయాలను, ఆలోచనలను, అభిరుచులను.

అందుకే మిమ్మల్ని చూస్తేనే ప్రేమని అనుకోలేదు.

మాట్లాడితేనే ఆప్యాయత, అనురాగమని భావించలేదు.

దూరమయ్యాకా మీ గురించి చెడుగా ఎవరేం చెప్పినా వినలేదు..

మీ పై నా ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు...

మూగది చెవిటి ది కూడా....

అవి మీకు తెలిసి, అంత స్వచ్ఛంగా ప్రేమించిన నన్ను అలా కారణం లేకుండా మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం మీకు తగునా..?

కారణాలు ఎన్నైనా కావొచ్చు...

ఈ లోకం అంతా కలిసి నన్నొక శత్రువులా చూస్తుందనిపిస్తుంది. 

"నేను పుట్టాను లోకం మెచ్చిందీ

నేను ఏడ్చాను లోకం నవ్విందీ

నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందీ

నాకింకా లోకంతో పని ఏముందీ.. డోంట్ కేర్.."

అంటూ రాసిన ఆత్రేయ వాక్యాలు నా జీవితంలో కూడా నిజమనిపిస్తుంది.

అనాధ ఆశ్రమాలకు...

వృద్ధాశ్రమాలకు...

ట్రస్ట్ లకు ఎన్నో సహాయాలు చేసిన నాకు...

ఈ సమయంలో దైర్తాన్ని నింపే ఒక్క మాట సహాయం కూడా లేదు. చివరికి ఎప్పుడూ నాలో ధైర్యాన్ని నింపే ఈ అక్షరాలు కూడా ఇదిగో ఇలా నిస్సాయతగా జాలువారుతున్నాయి.

ఒకప్పుడు యే నేనైతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని నిందించి, వాళ్ళకి జీవితం అంటే తెలియక, బ్రతకడం చేతకాక వెనుకున్న వారిని శోకసంద్రంలో ముంచే తప్పుడు నిర్ణయాలను తీసుకున్నారని విమర్శించానో

ఇప్పుడు అదే నేను ఈరోజు ఇలా....

ఒక పిరికివాడిలా, ఎవరికి ఏమి కానీ ఓ చేతకాని వాడిలా అందరికీ దూరం అవ్వాలని నిశ్చయంచుకున్నాను.

చివరి కోరిక : ఏ మనిషికైనా జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటాడు. అలా నాకొక మిగిలి ఉంది. అనాధశ్రమం వృద్ధాశ్రమం రెండూ కలిపి ఒక చోట స్థాపించాలని, తద్వారా పిల్లల పెద్దల నుండి అనుభవాలు పొందడం, పెద్దలకి పిల్లలతో ఆడుకోవాలన్న సరదాలు రెండూ తీర్చగలమని నా ఉద్దేశ్యం. దానితో పాటు నా మరణానంతరం నా అవయవాలన్నీ ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని ముందుగానే "organ india" అనే వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యాను. నా సన్నిహితులు ఎవరైనా వారిని సంప్రదించి వారికి నా డెడ్ బాడీ అప్పగించ ప్రార్థన. కనీసం నా ద్వారా ఓ నలుగురు కుటుంబాలైనా బాగుపడతాయని ఓ చిన్న ఆశ.

కనీసం ఈ నా కోరికలైనా తప్పక నెరవేరుస్తారు కదూ!

నెరవేరుస్తారులే, కనీసం మీకున్న మంచి తనంతో కాకపోయినా నేను చనిపోయానన్న జాలితో నైనా ఈ పని చేస్తారని ఆశిస్తున్నాను.

ఇక సెలవు,

ఇట్లు,

మీ పవన్."

                       *****************

ఇది సత్య పవన్ తన సూసైడ్ కి ముందు రాసుకున్న లెటర్ యొక్క సారాంశం. అలా తను లెటర్ రాసి దానిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి, ఆ లెటర్ తన జేబులో పెట్టుకుని చనిపొదామని రైల్వే ట్రాక్ పై పడుకున్నాడు. 

తనని సమీపిస్తున్న ట్రైన్ హార్న్ సౌండ్ వింటూ కళ్ళు మూసుకున్న పవన్ కి ....

తన కలలో తన తల్లి, తండ్రి దర్శనమిచ్చారు.

తను లేకపోతే అమ్మ పిచ్చిదానిలా అయిపోతుంది. అప్పటికే అయినా వాళ్ళను కోల్పోయి తానొక ఒంటరినని మద్యానికి బానిసైన తండ్రి, ఇప్పుడు చేతికి అందివచ్చిన కొడుకు కూడా పోతే ఇక బ్రతకగలడా...?

ఇక ఆ తల్లి సంగతి చెప్పక్కర్లేదు...

ఎవరూ ఆదరించిన వాళ్ళు నేనన్న వాడిని కూడా లేకపోతే రేపు వాళ్ల పరిస్థితి...?

పైగా తాను చనిపోవడానికి కారణం తండ్రి చేసిన కొన్ని పొరపాట్లని...

దాంతో ఈ సమాజం అతన్ని వడులుతుందా...?

వాళ్ళు ఎన్నైనా చేయని,

ఏం చేసినా మన భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు రోజంతా నీళ్ళు తాగి మూడు పూటలా తన కడుపు నింపిన రోజులు గుర్తుకువచ్చాయి పవన్ కి. ఆ క్షణం తన నిర్ణయాన్ని మార్చుకుని బయటపడాలని ప్రయత్నించిన పవన్ ప్రయత్నం అంతకుముందు జీవితంలో నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాల్లానే విఫలం అయ్యింది. తను బయట పడాలి అనుకునే లోపు ఆ ట్రైన్ తన మీదనుండి వెళ్ళిపోయింది. శరీరం నుజ్జు నుజ్జు అయ్యి, తను తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు.

విషయం తెలుసుకున్న పవన్ తల్లి దండ్రులు గుండెపగిలెలా రోదించారు. తన తప్పు తెలుసుకుని పవన్ తండ్రి గుండెలు బాదుకుని విలపించాడు. చివరికి కొన్నాళ్ళ తర్వాత అవమానం భారం, కొడుకు లేరన్న దిగులుతో వాళ్ళు కూడా అశువులు బాసారు.

త్రాగుడు అనే దురలవాటు ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. కొత్తగా పెళ్ళైన ఆ ఆడపిల్లకు, పుట్టింటి వాళ్ళు లేకుండా చేసింది.

                     ****************

రచయితగా నా విశ్లేషణ:

జీవితంలో ప్రతి సమస్యకి చావు ఒక్కటే మార్గం కాదు. కానీ, పవన్ కి ఉన్న కష్టాలు, అంతమంది ఒకేసారిగ అతనిపై వివిధ సందర్భాలలో చూపిన వివక్ష ఇదంతా చూసిన తర్వాత కూడా అతను తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం వెనకేసుకు రాలేకపోతున్నాను. ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటు ఏ మనిషైనా జీవితాన్ని నెట్టుకురావడం కష్టమే కానీ, చనిపోవడం మాత్రమే దానికి శాశ్వత పరిష్కారం అనుకుంటే అది పొరపాటే. పవన్ కి నిండా 30 యేళ్లు కూడా దాటుండవు, సాధించాల్సింది కూడా ఇంకా చాలానే ఉంది. తన సాధించే విజయాలతోనే వాళ్ళందరికీ సమాధానం చెప్పి ఉండాల్సింది.

కనీసం చివరికి ఒక్కసారైనా వాళ్ళమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని ఉండి ఉంటే, తనకి చనిపోవాలి అనే ఆ ఆలోచన వచ్చి ఉండేది కాదు. తన ప్రాణాలు కూడా నిలబడేవి. ఎందుకంటే పవన్ కన్నా ఎక్కువ కష్టాలు పడిన ఆవిడే పవన్ కోసం బ్రతుకుతుంది. మరి పాపం తనని అలా వదిలేసి పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్షమించరానిది.

పవన్ ఇవే ఆలోచించి చివరికి జ్ఞానోదయం అయ్యింది కాబోలు, అందుకే చివరి క్షణాల్లో తన నిర్ణయాన్ని మార్చుకుని ఆ చావు నుండి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ, విధి మన చేతుల్లో లేదు కదా..! జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

పవన్ చావుకి కారణాలు ఏమైండోచ్చు...?

పవన్ తాతగారు వాళ్ల నాన్నకి ఇచ్చిన వ్యాపారమా?

పవన్ నాన్నగారు తన చుట్టూ వున్న వాళ్ళని నమ్మి ఇచ్చిన అప్పులా?

తన కుటుంబాన్ని వీధిపాలు చేసిన చుట్టు పక్కల వాళ్ల..?

ఇన్ని జరుగుతున్నా పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసిన చుట్టాలా?

పవన్ అంతగా నమ్మిన తన స్నేహితులా?

తను పిచ్చిగా ప్రేమించిన అమ్మాయా..?

తన ప్రేమను అర్థం చేసుకోని ఆ అమ్మాయి తల్లిదండ్రులదా..?

అసలు వీటన్నింటికీ కారణమై, తాగుడు అలవాటు చేసుకున్న వాళ్ల నాన్నగారా?

ఆ అలవాటు ఆయనికి అంటించిన సన్నిహితులా?

ఎన్నికల ముందు మధ్యపాన నిషేధం అంటూ, గెలిచాక దాన్నే ఒక ముఖ్య ఆదాయంగా మారుస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాలా?

కారణం ఏదైతేనేం పవన్ లాంటి ఓ సమాజ సేవకుడిని, అంతకుమించిన ఒక మంచి వ్యక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది.

మీ అభిప్రాయాన్ని మాత్రం సమీక్ష రూపంలో తెలియజేయండి.

ఇక సెలవు..!

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏



Rate this content
Log in

Similar telugu story from Abstract