చిరునామా...
చిరునామా...
తెలియని పరిచయం అవుతున్న మనిషి జీవితం కొత్త కథ లా ఉండొచ్చు..
తెలియని వాళ్ళతో దగ్గరితనం అల ఇలా అని బానే ఉండొచ్చు.
నేస్తమా !
పరిచయం మరువలేని అనుబంధంగా మారలి సుఖం గా ఉండాలి..
అంతే కానీ ఎప్పటికీ మాయని మరక లా కాదు!!
ఎంత కాలం గడిచిన కరగని బాధగా మాత్రం మిగిలిపోయేలా ఉంటే కష్టమే కదా మిత్రమా.....
ఇద్దరి పరిచయం ఇంకొకరితో గర్వంగా పంచుకునేలా మారిన రోజు దైర్యం గా ఉంటది నేస్తమా....
పరిచయం
నవ్వుల్నే కాదు బాధ్యతలను పెంచాలి... కానీ మోయలేని భారంగా మారకూడదు మిత్రమా!!
గాయం చాలా విలువ అయినది..
ఎంతటి మనిషి నీ అయినా మౌనంగా మారుస్తుంది.....
చిరునవ్వు అనే చిరునామా నీ లేకుండా చేస్తుంది.....
మిత్రమా నీ పరిచయం చిరునవ్వుల జల్లులు కావాలి అంతే కానీ జలపాతం సైతం బాధ పడే కన్నీరు అవ్వకూడదు సుమా!
ఉప్పెన అయి ముంచే వరదల సముహం కాకూడదు
మిత్రమా......
ఇట్లు
ఓ శ్రేయోభిలాషి
