kondapalli uday Kiran

Abstract Classics Children

4  

kondapalli uday Kiran

Abstract Classics Children

చిన్ననాటి జ్ఞాపకాలు.

చిన్ననాటి జ్ఞాపకాలు.

1 min
552



నా పేరు సాయి. మా ఊరు మందస. పొద్దున్నే లేవగానే కోడి కూతలతో, పక్షుల రాగాలతో నా జీవితం మొదలవుతుంది. లేచిన వెంటనే వేప పుల్లతో పళ్ళు తోముకుంటాను. కుంకుడు కాయలతో స్నానం చేస్తాను. తొమ్మిది అవ్వగానే బడికి వెళ్తాను. మా స్నేహితులతో కలిసి దాగుడుమూతలు, తొక్కుడుబిళ్ల, బొంగరాల ఆట, ఎంచక్కా ఆడుకునే వాళ్ళం. ముఖ్యంగా నేను గోలీలాట బాగా అడేవాడిని. మా తరగతి గదిలో నేనే ఫస్ట్ వచ్చేవాడిని. నాకు శంకర్ అనే స్నేహితుడు ఉండేవాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు, షికార్లకు తిరిగేవాళ్ళం. బడిలో ఉన్నంతసేపు ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవాళ్ళం. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మా ఆవులకు,మేకలకు గడ్డి పెట్టేవాడిని. వాటితో మాట్లాడేవాడిని. అవి కూడా నాతో మాట్లాడుతాయి. అవంటే నాకు చాలా ఇష్టం. వాటితో ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా 15 సంవత్సరాలు తెలియకుండానే గడిచిపోయాయి. నాకు హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. నేను వద్దనుకున్నా అమ్మ నన్ను పంపించింది. అక్కడ పొద్దున్నే లేస్తే చాలు ఏవో బైకులు, లారీలా శబ్దాలు. అసలు నాకు నచ్చేదే కాదు!. మళ్లీ నాకు మా ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అదే 40 వేలు ఊర్లో ఉండి సంపాదించుకుంటా అని చెప్పాను. అమ్మకు ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి మళ్ళీ ఊరికి తిరిగి వచ్చేసాను. వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. 40 వేలు కాదు ఏకంగా 50 వేలు రాబడి వస్తుంది. మళ్లీ నా ఆవులను, ఊరును చూసాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది"అని సాయి వాళ్ళ భార్యతో తన చిన్ననాటి జ్ఞాపకాలను చెపుతున్నాడు. అందుకే ఊరిని మించిన స్వర్గం ఉండదంటారు.


Rate this content
Log in

Similar telugu story from Abstract