చిలక - గోరింక 1
చిలక - గోరింక 1
శుభోదయపు తెల తెల వారిన
పలకని చిలుక
పలికే గోరింక ఎదురు చూస్తూ ఉండి పోయింది!
గోరింక కి తెలీదు కదా
చిలుక జోస్యం చెప్తూ తన జోస్యం చుస్కొలేదు
మరణం అంచుల వరకు వచ్చే సరికి
గోరింక ఎప్పుడూ లాగే
గూడు వైపు చూడ సాగింది
చిలక రాలేదు
కాలాలు గడుస్తున్న
చిలుక గూడు నీ గోరింక రక్షిస్తునే ఉంది..
గోరింక కి నమ్మకం చిలుక కచ్చితంగా వస్తుంది అని..
చిలుక శ్వాస కోల్పో లేదు.
తన మనసు లో ఒదిగి పోయింది అయింది..
అంటుంది గోరింక
అటు గా వెళ్ళే గద్ద లా తో..
అలా కొన్ని రోజులు గడిచాక
ఒక చిట్టి చిలక వచ్చి ఆ గూడు లో ఆడుకో సాగింది..
ఆ చిట్టి చిలుక గోరింక వైపు గా చూస్తూ
ఈ గూడు లో నేను ఉండొచ్చా
ఇక్కడ ప్రేమ ఉంది అంటూ పలికిన మాటలకు
కన్నీరు మున్నిరు అయిన గోరింక
చిట్టి చిలుక గూడు లో ఉంటూ ఉండగా.
గద్ద విన్యాసలు మొదలు పెట్టింది..
ఎలా అయిన చిట్టి చిలుక ను తినేయలి అని
అయితే గోరింక ఉంది చుస్కొడానికి!!
ఇది ఒక కథ
మిగతా కథ వచ్చే బాగం లో చెప్తాను

