Urs Sudheer AB

Horror

4.8  

Urs Sudheer AB

Horror

బొగ్గలమర కొండ లో

బొగ్గలమర కొండ లో

5 mins
1.7K


అనగనగా ఒక గ్రామం, ఆ గ్రామం లో పంటలు పండించి బ్రతికే రైతులు..ఆ పంటలని అడవి జంతువులు నాశనం చెయ్యకుండా రాత్రులు కాపలా కాయాలి.. అలా సాగుతుండగా ఒకరోజు ఆ ఊరి ప్రజలకి దూరం గా కొండలలో ఒక తెల్లటి ఆకారం తల మీద అగ్గి కుంపటి పెట్టుకొని బొగ్గలమర కొండ లో లేచి పక్కనే ఉన్న పందిమర కొండకి నడవ సాగింది అది చూసిన ప్రజలు భయభ్రాంతులకి గురి అయ్యి బిగ్గరగా దెయ్యం దెయ్యం అని అరవడం మొదలు పెట్టారు..అలా ఆ దెయ్యం రోజూ అక్కడికి తల మీద నిప్పుల కుంపటి తో వెళ్లి రావడం జరిగేది, కానీ అక్కడి ప్రజలు దగ్గరికి వెళ్లి చూసే ధైర్యం చెయ్యలేదు..


ఒక రోజు బొగ్గలమర కొండ దగ్గర ఉన్న మామిడి తోట కి కాపలా కోసం యధావిది గా ఇద్దరు ముసలి దంపతులు వెళ్లారు వారు నమ్మే వారు కాదు అక్కడ దెయ్యం ఉందని..వారు కాపలా కి వెళ్లే సమయానికి ఆ దెయ్యం పంది మర కొండకి వెళ్ళింది..ఇక ఆ ఇద్దరు పొలం అంత తిరిగి జంతువులు ఏమైనా ఉన్నాయేమో అని చూసుకొని తమ పడక ఉన్న గుడిసె కి చేరుకున్నారు..అలా వారు పడుకొని ఉండగా..కచ్చితంగా 11:30 గంటలకి హోరున గాలి వీయడం మొదలు పెట్టింది అది చూసి ప్రకృతి సహజం అనుకోని పడుకున్నారు అవి ఏమి పట్టించుకోకుండా..ఆ రాత్రి అలా గడిచిపోయింది..


తరువాతి రోజు రాత్రి ఆ జంట మళ్ళీ కాపలా కి వెళ్లారు..ఈసారి కూడా అదే సమయానికి గాలి వీయడం మొదలైంది..అది గమనించిన ఆ ఇద్దరు కొంచం అనుమానం తో కొంచం భయం భయం గా దుప్పటి కప్పుకొని పడుకున్నారు.అలా వారు ఘాడ నిద్రలోకి పోగా సరిగ్గా ఒంటి గంట సమయం లో ఆ దెయ్యం తిరగాడా సాగింది ఆ క్రమం లో ఘల్లు ఘల్లు న తన గజ్జెలు బిగ్గరగా సవ్వడి చేయ సాగాయి..ఆ శబ్దానికి మెలుకువ వచ్చిన ఆ ముసలి ఆవిడ తన భర్త ని లేపకుండా ఆ శబ్దం వైపు వెళ్ళ సాగింది ఎవరు ఎవరు అని అరుచుకుంటూ.. అది గమనించిన ఆ దెయ్యం కాసేపు నిశ్శబ్దం పాటించింది..నిశ్శబ్ద పడే సరికి ఆమె తిరిగి వెళ్ళటానికి వెను తిరిగింది, ఇంతలో తన ఎడమ వైపు ఘల్లు న గజ్జెలు మోగాయి ఆమె వెంటనే ఎడమ వైపుకి తిరిగి చూడగా తెల్లటి ఆకారం కనిపించింది అది చూసి ఆమె టార్చ్ లైట్ అటు వైపు వేసింది అక్కడ ఎవరూ లేరు వెంటనే కుడివైపున గజ్జెల మోత వెంటనే అటు వైపు లైటు వెయ్యగా అక్కడా ఎవరూ లేరు ఇక ఆమె భయంతో పరుగులు తియ్యగా ఒక్కసారిగా ఆ దెయ్యం ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది అంతే ఆమె గొంతు మూగపోయింది, శరీర భాగాలు అన్నీ బిగుసుకపోయాయి అలాగే నిలబడి పోయింది అప్పుడు ఆ దెయ్యం ఆమె మొఖం మీద బిగ్గరగా అరవగా ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయి అలాగే నేలపై ఒరిగింది, ఇక ఆ దెయ్యం అక్కడి నుండి వెళ్ళిపోయింది..తెల్లవారి 5 గంటలకి తన భార్య ని వెతుక్కుంటూ వెళ్లిన అతను ఆమెను అలా చూసి భోరున ఏడవడం మొదలు పెట్టాడు ఇక ఆమె ను ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు..


తర్వాత రోజు అలా జరగడానికి కారణం ఏంటి అని ఆలోచించ సాగాడు, అలా ఆలోచించే తరుణం లో ఒక పెద్ద ఆయన అతని దగ్గరికి వచ్చి ఆ బొగ్గల మర కొండ లో తనకి కొద్దిరోజుల క్రితం జరిగిన సంఘటన గురించి వివరించ సాగాడు..


ఒకరోజు అతను ఒక పని గా బొగ్గలమర కొండ మీదుగా సానిపాయి అనే గ్రామానికి వెళ్లి తీరా తిరిగి వస్తుండగా ఒక వింత ఆకారం అతన్ని తరిమింది, ఆ ఆత్మ అతడిని కుడి వైపుకి ఎడమ వైపుకి తరమ సాగింది కానీ అతను భయం లేకుండా గంగమ్మ గుడి దగ్గర నుండి ఆంజనేయుడి దండకం చదవడం మొదలు పెట్టాడు, అలా కొద్ది దూరం ఆ ఆత్మ అతన్ని వెంటాడి విసిగిపోయి బ్రతికిపోయావ్ పో అని చెప్పి వెళ్ళిపోయింది..


అని చెప్పి, ఆ తోట అతనికి ఆ పెద్దాయన ఒక ఉపాయం చెప్పాడు..ఒక ఆంజనేయుడి దండకం తీసుకెళ్లి 11:30 సమయం లో చదువుతూ ఆ తోట మొత్తం తిరగమని చెప్పాడు..ఇక ఆ రోజు రాత్రి అవకనే అయ్యింది..అతను దండకం తీసుకెళ్లి 11:30 సమయం లో చదవడం మొదలు పెట్టాడు, ఇంతలో మళ్ళీ హోరున గాలి మొదలైంది ఆ ఆత్మ కుదురుగా ఉండలేకపోయింది చటుక్కున అతని వెనక్కి వచ్చి చేరుకుంది, అతని వెనుకబడి అతన్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తోంది కానీ ఏదో దైవ శక్తి ఆ ఆత్మ ని ఆపుతోంది, గట్టిగా అరవడం మొదలు పెట్టింది కానీ అతను భయపడకుండా చదువుకుంటూ ముందుకు సాగాడు..ఇక ఆ దెయ్యం అతని ముందుకి ప్రత్యక్షమయ్యింది కానీ అతను ఏమాత్రం జంకకుండా చదవ సాగాడు, ఇక ఆ దెయ్యం విపరీత ప్రయత్నాలు చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది..ఇక అతను ప్రశాంతంగా పడుకున్నాడు..


ఆ తరువాత ఆ దెయ్యం వెళ్ళిపోయింది అనుకొని అతను కాపలాగా పడుకో సాగాడు, అలా ఒంటరి తనం వల్ల అతనికి ఆరోగ్యం కుదురుగా లేదు..ఇక కాపలాదారుడిని నియమించాలని నిర్ణయించుకున్నారు..ఆ కాపాలదారుడికి ఈ ఆత్మ గురించి తెలీదు..అతను ఎదావిధిగా కాపలా కాయడం మొదలుపెట్టాడు, అలా కొద్ది రోజులు సాగగా ఊహించని విధంగా ఒక సంఘటన చోటుచేసుకుంది.


యధావిదిగా అతను సాయంకాలం భోజనం చేసుకుని 8:00 గంటలకి అంతా ఆ తోట కి చేరుకుంటాడు, తోట అంతా టార్చ్ వేసి చూస్తూ తిరిగి వస్తాడు..అన్ని రోజులతో పోలిస్తే ఆ రోజు కొంచం ఎక్కువ చీకటి అలుముకుంది అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ రోజు అమావాస్య దెయ్యాలకి ప్రియమైన రోజు మరియు అవి విచ్చలవిడిగా తిరిగే రోజు..అలా ఉండగా అతను 11:00 గంటలవరకు కాపలా కాసి అలా పడుకున్నాడు, ఇక దెయ్యాల సమయం అవగానే అయ్యింది ఖచ్చితంగా 11:30 అవగానే ముందులాగే గాలి వీయడం మొదలు అయ్యింది, అతనికి మెలుకువ లేదు..ఆ దెయ్యం మల్లెలు ధరించి మంచిగా ముస్తాబు అయ్యి చిందులు వేయసాగింది..ఘల్లు ఘల్లున శబ్దం కానీ అతనికి ఎటువంటి మెలుకువ లేదు ఇంతలో అతనికి ఏదో పురుగు కుట్టినట్లు గా అనిపిస్తే నిద్ర లేచాడు,లేవగానే చెవుల నిండా ఒకే ప్రతిధ్వని ఘల్లు ఘల్లు మని తన టార్చ్ తీసుకొని ఆ శబ్దం వచ్చే వైపు నడవ సాగాడు వెళుతుండగా వెళుతుండగా అతనికి దారిలో ఒక జంతువు మాంసం కనిపిస్తుంది..ఆ మాంసం ఆ దెయ్యం ఆహారంగా తెచుకుంది.అతను ఆ మాంసం చూసి అది ఒక దగ్గర దాచిపెట్టి అలాగే ముందుకి వెల్లసాగడు అక్కడే కొద్ది దూరం లో ఏదో తెల్లటి ఆకారం కదలటం చూసాడు..ఏయ్ ఎవరిది అని బిగ్గరగా అరిచాడు అలా అరవగానే అంతా నిశ్శబ్దం, అక్కడ ఏముందో చూడటానికి అతను టార్చ్ వేసాడు ఆ టార్చ్ వెలగట్లేదు బహుశా ఛార్జ్ అయిపోయినట్లుంది.. దానితో అతను వెనుదిరిగి వెళ్ళసాగడు కొద్ది దూరం వెళ్లి చూస్తే మళ్ళీ ఒక తెల్లటి ఆకారం ఆ మాంసం దొరికిన దగ్గర తిరుగుతూ కనిపించింది, అతను మళ్ళీ బిగ్గరగా అరిచాడు ఎవరదీ అని అప్పుడు ఆ దెయ్యం ఒక్కసారిగా ఆ..అని గట్టిగా అరిచి అతని వైపు తిరిగింది అంతే అతనికి భయం మొదలైంది..ఎవరు నువ్వు ఎవరు నువ్వు అనుకుంటూ మెల్లగా పక్కకి నడవసాగడు ఆ సమయం లో ఆ దెయ్యం అతని చేతులకున్న రక్తం చూసింది అది చూసి కోపంతో అతని వద్దకు వెల్లసాగింది అతను భయం తో పరుగుపెట్టాడు వెంటనే అది అతని ముందు ప్రత్యక్షం అయ్యింది ఒక్కసారిగా అతని ఒళ్ళు మొత్తం చెమటలు పట్టడం మొదలు పెట్టాయి,కాళ్లు వనకడం మొదలయ్యాయి ప్రాణ భయం తో మళ్ళీ వెనుదిరిగి పరుగు మొదలుపెట్టాడు ఇంతలో ఆ దెయ్యం అతని మెడ వెనుక భాగం లో ఉన్న తన చొక్కా పట్టుకొని అలా గాలిలోకి లేపింది అంతే అతనికి గొంతు బిగుసుకుంది సరిగా ఊపిరి ఆడట్లేదు కాళ్ళు ఆడిస్తున్నాడు అలా కచ్చితంగా రెండు నిమిషాల్లో అతని ప్రాణం గాలి లో కలిసిపోయింది ఆ తర్వాత ఆ దెయ్యం అతని పీక కొరికి రక్తం తాగి అక్కడి నుండి వెళ్ళిపోయింది..


ఇక తెల్లవారి ఆ యజమాని తోటకి వచ్చాడు యధావిధిగా ఆ కాపలాధారుడి కోసం గుడిసె వైపు వెళ్ళాడు అక్కడ లేకపోయ్యే సరికి తోటలో తిరిగి చూడ సాగాడు ఇంతలో అతను అక్కడ పడి ఉండడం చూసి అతని వైపు పరుగెత్తుకెళ్లి చూస్తే అతను శవం లా పడి ఉన్నాడు పక్కనే మల్లెలు పడి ఉన్నాయి.. ఇక అతనికి ఏమి తోచక ఊరిలో జనాలని పిలిచి చూపించగా అందరూ ఇది ఆ దెయ్యం పనే అని చెప్పారు ఇక ఆ భయంతో ఆ తోట వైపు గాని ఆ బొగ్గలమర కొండవైపు గాని ఎవరూ వెళ్ళలేదు..కాల క్రమేణా ఆ దెయ్యం ఆ బొగ్గలమర కొండ విడిచి వెళ్ళిపోయింది..


........................................సమాప్తం......................................


                                        


Rate this content
Log in

Similar telugu story from Horror