ప్రాణ స్నేహం
ప్రాణ స్నేహం


బాల్యం: ఊహ తెలియని వయసులో నా నుండి దూరం వెళ్ళాక ఊసులు పంచుకోటానికి నాతో ఉత్తరం రాయించింది నీ స్నేహం..బహుశా అదే నేను రాసిన మొదటి లేఖ..
కౌమారం: ఈ వయసులో ఊసులు పంచుకునేంత ఊహ వచ్చినా మన మధ్య దూరం భారం గా పెరిగింది,పండగలకి పబ్బాలకి మాత్రమే కలుసుకునే పరిస్థితి ఉన్నా మన స్నేహం బలపడిందే గానీ బలహీనమవలేదు..అందుకే అంటారు మనుషుల మధ్య దూరం పెరిగే కొద్దీ మనసుల మధ్య దూరం తగ్గుతూ వస్తుందని..
యవ్వనం: ఈ దశ లో మన దిశ ని నిర్ధేశించుకున్నాం..ఆ దిశ గా వెళ్లే బాట లో పడ్డాం లేచాం,ఏడిచాం నవ్వాం,ఆడాం పాడాం..
ఎన్ని కన్నీటి అలలు ఎదురొచ్చినా కుంగనివ్వకుండా గోడ లా నిలబడ్డావ్..
వృధ్ధాప్యం: ఈ దశ లో నీకు ఒకటే చెప్పగలను బావ..
నాకంటూ నాలో చోటు లేకపోయినా నీకు మాత్రం పధిలంగా పది కాలాల పాటు ఉంటుంది బావ..