చెవులు చూపిన కథ...
చెవులు చూపిన కథ...
చల్లటి ప్రదేశం సాయంకాల సమయం ఒక 25 ఏళ్ల కుర్రాడు అలా పెరట్లో బల్ల మీద వాలి కనులు మూయగ చుట్టుపక్కల జరుగు సంభాషణల ధ్వనులు అతని చెవులని చేరగా అతని ఊహా లోకపు తెరలు లేచాయి..
గజిబిజి మాటల పలుకులు, ఆ గందరగోళం లో అతనికి ఏమీ తోచట్లేదు.. ఇంతలో ఆ పలుకుల మధ్య నుండి బిగ్గరగా ఒక మతి స్థిమితం లేని వ్యక్తి అరవడం మొదలు పెట్టాడు..చిలకను గురి పెట్టినప్పుడు అర్జునుడి కళ్ళు చిలక కంటికి ఏకాగ్రత వహించినట్లు, ఇతని చెవులు మతి స్థిమితం లేని వ్యక్తి మాటలకి ఏకాగ్రత వహించాయి..
బహుశా ప్రేమ విఫలుడు అనుకుంటా మొదలు పెట్టడమే మగువ పేరు తలవడం తో మొదలు పెట్టాడు..
అనణ్య..గుర్తుందా మనం చదివిన కాలేజి, మనకు బోధించిన ఉపాధ్యాయులు, మనం రహస్యంగా ప్రేమించుకున్న ప్రదేశాలు, మనం సందర్శించుకున్న గుడిలు, పాలుపంచుకున్న సందేహాలు..
నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు, నిజానికి నువ్వు నా జీవితం లోకి వచ్చాకే అమ్మాయిలని గౌరవించడం మొదలు పెట్టాను..నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వే నా ప్రాణం అని చెప్తుంటే మా అమ
్మ లా ప్రేమించే అమ్మాయి దొరికిందన్న భావన తో పొంగిపొయ్యేవాడిని, కానీ ఇప్పుడు అవంతా అపద్ధపు మాటలు అని తెలుసుకొని కృంగిపోతున్నా..నాలో ఏ చెడు అలవాటు లేని గుణాన్ని చూసి ప్రేమించావో నువ్వు వదిలి వెళ్లిపోయిన తరువాత అదే గుణం అవగుణంగా మారింది..
సప్త సముద్రాలనైనా శాశించి నీతో ఏడడుగులు నడవాలనుకున్నా..ముల్లోకాలని మభ్యపెట్టి అయినా నీ మెడలో మూడు ముళ్ళు వెయ్యాలనుకున్న.. శివ పార్వతులలా నేను నీలో సగమై నువ్ నాలో సగమై ఒకటిగా జీవనం సాగించాలని కలగన్నా..
కానీ నువ్వు వదిలి వెళ్ళాక విరహ వేదన లో విలవిలలాడాను..అంతర్గత ఆలోచనలతో అలమటించి మతిస్థిమితం లేని మనిషి గా కాలక్రమేణా పిచ్చివాడిగా ఇలా మారాను..
మొదట ప్రేమను వ్యక్త పరిచే అంత ధైర్యం ఉందనుకున్నాను కానీ చివర వదిలి వెళ్ళిపొయ్యేంత తెగువ కూడా ఉందని గ్రహించలేక పోయాను..అని చెప్పి అతను ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు..
అలా ఆ పిచ్చి వాడు వెళ్లిపోగా ఆ 25 ఏళ్ల కుర్రాడు అతని మాటల కోసం వేచి చూసి చివరికి తన కర్ర సహాయం తో(అతనికి కళ్ళు కనిపించవు) ఇంట్లోకి నడవ సాగాడు..