Naveen Surya

Abstract Children Stories Others

4.7  

Naveen Surya

Abstract Children Stories Others

అస్థిత్వం

అస్థిత్వం

3 mins
437


ఇక్కడ బ్రతకడం ఎంత ముఖ్యమో , బ్రతకడానికి అస్థిత్వం కూడా అంతే ముఖ్యం. దాని కొరకే మనిషి పోరాటం , ఆరాటం 

ఒకరికి గౌరవం అస్థిత్వం, ఒకరికి గెలుపు, ఇంకొకరికి ఎదుగుదల ఇంకొకరికి మరొకటి, మనిషి మనుగడ కోసమే ఈ అస్థిత్వం 

నువ్వు నమ్మింది, నువ్వు చేయాలి అని అనుకున్నదే నీ అస్థిత్వం

ఒక మనిషి ప్రపంచానికి తను అనే వాడిని ఒకడిని ఉన్నాను అని తెలియజేయాలి అనుకుంటాడు. ప్రపంచం లో తన ఉనికి కోసం పోరాడుతున్న వ్యక్తి కథే ఇది . ఇది తన గౌరవానికి సంబందించిన కథ 


గౌరవం ప్రతి మనిషి కోరుకుంటాడు , కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే అలా గౌరవం కోరుకున్న వ్యక్తే ఇంకో వ్యక్తి నీ కించపరుస్తారు , తగ్గిస్తారు , తక్కువగా చూస్తారు. మీరే చెప్పండి మనుషులు అందరు ఒకే విధంగా జన్మించారు , అలాగే అందరు ఒకే రకంగా జీవిస్తున్నారు 

ఏ గౌరవం కోసం అయితే నువ్వు బ్రతుకుతున్నావొ , అదే గౌరవం కోసం అందరూ బ్రతుకుతున్నారు . నువ్వు కోరుకున్నదే అందరూ కోరుకుంటున్నారు , నువ్వు ఇంకో వ్యక్తి కి గౌరవం ఇస్తేనే నీకు గౌరవం లభిస్తుంది ..... 


Mr. కైలాష్ . సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు 

2 నిమిషాలు అరవింద్ గారు అయిపోయింది , వస్తున్నాను అని చెప్పండి


ఇప్పుడు చూడండి అయన నన్ను సార్ అన్నారు , నేను గారు అన్నాను కదా ఇచ్చి పుచ్చుకోవడం లోనే మర్యాద , గౌరవం ఉంది 

అందుకే " Give Respect Take Respect" 


ఇంతటితో Personality Development క్లాస్ అయిపొయింది , ఇక రేపు మళ్ళీ కలుద్దాం 

--------------------

 ప్రొఫెసర్ రాజశేఖర్ : Mr కైలాష్ , రేపు ఒక ముఖ్యమైన అతిధి మన కాలేజ్ కి వస్తున్నాడు So , నువ్వే దగ్గర ఉండి అంతా చూసుకోవాలి. ఇంకా ఇది చెప్తే బాగోదు కానీ నువ్వే అర్థం చేసుకోవాలి 

కైలాష్ : చెప్పండి సార్ , పర్లేదు

ప్రొఫెసర్ రాజశేఖర్ : కొంచెం డీసెంట్ గా రండి

కైలాష్ : అలాగే సార్ , తప్పకుండా 

--------------------------------

 ఆనంద కృష్ణ : హ్మ్మ్ , ఎంటి కైలాష్ పాజిటివ్ థింకింగ్ అంటూ క్లాస్ లు పికుతావ్ , నువ్వేంటి అబ్బా డల్ గా ఉన్నావు 

కైలాష్ : ఎం లేదు సార్ . ఎండీ గారు చెప్పారు రేపు డీసెంట్ గా రమ్మని , ఎవరో గెస్ట్ వస్తారు అంట . డిసెంట్ గా రావాలి అంట . 


ఆనంద కృష్ణ : తప్పదయ్య , ఆయన ఇచ్చే జీతాలు మనకి సరిపోవు కానీ ఆయన ఆలోచనలకు మనం సరిపోవాలి , ఈ డబ్బు ఉన్న వాళ్ళకీ ఎప్పుడు లేని వాడంటే చులకన అయ్యా మనకి ఏమి లేదో మనకి గుర్తు చేస్తూ ఉంటారు 


కైలాష్ : కానీ సార్ నా క్లాస్ లో నేను గౌరవం ఇవ్వాలి అని , ఇది అని అది అని ఇలా కొన్ని సార్లు చెప్పి ఉంటాను , కొన్ని వేల మందికి చెప్పి

ఉంటాను , తక్కువ చేసి చూడొద్దు , తగ్గించి మాట్లాడొద్దు అని అలాంటిది నన్నే తగ్గించి మాట్లాడుతుంటే బాధ గా ఉంది సార్ 


ఆనంద కృష్ణ : ఈ దేశం మొత్తానికి తిండి పెడుతున్న రైతుకు 3 పూటలా భోజనం దొరుకుతుందా , లేదు కదా ఇది అంతే , అందరినీ నీ గౌరవించాలి, ఒక మనిషి ఇంకో మనిషి నీ గౌరవించాలి అని కోరుకునే వాన్నే చిన్న చూపు చూసే సమాజం ఇది . ఇది మారదు , మనం మార్చలేము .


రెండు రకాల మనుషులు ఉన్నారు అయ్యా ఈ లోకం లో , ఒకటి వాళ్ళ కంటే గొప్పగా ఉన్నా వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారు . వాళ్ల కంటే తక్కువ గా ఉన్న అది నీకు నాకు ఉన్న తేడా అంటూ హేళన చేస్తారు . 


కైలాష్ : మరి ఎంటి సార్ పరిష్కారం .


అనంద : మనం కూడా వాళ్ళు ఉన్న స్థానం లోనే ఉండాలి , వాళ్ళకి ఉన్న గౌరవ మర్యాదలు మనకి ఉండాలి . కష్టపడాలి , గెలవాలి . వాడు గెలిచెంత వరకు ప్రపంచం దృష్టిలో , డబ్బు ఉన్నొడి దృష్టి లో నువ్వు లోకువ నే . నీ మంచితనం నీకు గౌరవం ఇవ్వదు


ఎందుకంటే డబ్బున్నొడికి ఇచ్చే గౌరవానికి , మంచొడికి ఇచ్చే గౌరవానికి చాలా తేడా ఉంటుంది 


కైలాష్ : నేను రాజశేఖర్ లా ఒక ఇన్స్టిట్యూట్ పెడతాను , నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను , వస్తాను సార్ 


--------------------------

5 సంవత్సరాల తర్వాత 

-------------------------


 రాజశేఖర్ PA : నేను రాజశేఖర్ గారి PA ను సిల్వర్ జూబ్లీ వేడుకలకు CM ని పిలవాలని అనుకుంటున్నాం జూలై 17TH రోజున 

సీఎం PA : అయ్యో లేదండి ఆరోజు సార్ అందుబాటు లో ఉండరు , Mr కైలాష్ గారికి అప్పాయింట్మెంట్ ఉంది అండి


రాజశేఖర్ గారు : ఎవరి కైలాష్ తెలుసుకోండి


ఆనంద కృష్ణ : మీ దగ్గర నెల జీతానికి పని చేసే సాధారణ ఉద్యోగి.   


((( ఓకప్పుడు )))


సశేషం





Rate this content
Log in

Similar telugu story from Abstract