Jyothi Muvvala

Tragedy Classics

4.7  

Jyothi Muvvala

Tragedy Classics

అనుమానం పెనుభూతం!

అనుమానం పెనుభూతం!

4 mins
581



పరంధామయ్యకి ఇద్దరు కూతుర్లు, పెద్దమ్మాయి స్వప్న ,రెండో అమ్మాయి స్వరూప. తన భార్య ఈ మధ్యే అనారోగ్యంతో చనిపోయింది. తల్లి లేని ఇద్దరి ఆడ పిల్లల్ని ఉన్నంతలో బాగా చదివించి పెద్దచేశాడు పరంధామయ్య

తన పెద్ద కూతురు స్వప్న అందాలరాశి, పెద్దలంటే మర్యాద, మంచి అనుకువ ఉన్న పిల్ల.ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరి తలలో నాలుకలా ఉండేది. స్వప్న చదువు పూర్తి చేసుకొని కొడుకు లేని తన తండ్రికి తానే కొడుకుగా ఉండాలని నిర్ణయించుకొని ఊర్లోనే ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. పెళ్లీడుకొచ్చిన కూతురుకి పెళ్లి చేసి పంపించడం తన బాధ్యతగా భావించిన పరంధామయ్య కూతురికి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు

అలా తెలిసిన వారి ద్వారా స్వప్నకి ఒక మంచి సంబంధం వచ్చింది. వీరేంద్ర గారికి ఇద్దరు పిల్లలు. కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించాడు. కొడుకుకి అమెరికాలో ఉద్యోగం. ఒక్కడే మగపిల్లాడు అవ్వటంతో తల్లిదండ్రుల్ని కూడా తనతోపాటు విదేశాలకు తీసుకెళ్ళిపోయాడు మహేష్

ఇండియాలో మంచి కుటుంబంలోనీ బాగా చదువుకున్న పిల్ల అయితే తన వారసత్వాన్ని నిలబెడుతుందని భావించిన వీరేంద్ర! కొడుకుకి తెలిసిన వారి ద్వారా మంచి సంబంధాలను వెతకడం మొదలుపెట్టాడు. అలా స్వప్న వాళ్ళ సంబంధం తెలిసింది

పెద్దలు ఇష్టపడి పిల్లల్ని ఒకరికి ఒకరిని పెళ్లి చూపుల్లో పరిచయం చేశారు

తండ్రి మాట మీద గౌరవంతో స్వప్న! తన తండ్రి ఇష్టమే తన ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది. అమ్మాయి చూడటానికి లక్షణంగా కుందనపు బొమ్మలా ఉంది కనుక చూడగానే మహేష్కి నచ్చేసింది

మొదటి చూపులోనే తన అందానికి దాసుడు అయిపోయాడు మహేష్. అందుకే మారు మాట్లాడకుండా పెళ్లికి అంగీకారం తెలిపాడు

అలా నెల తిరగకముందే అనుకున్నది అనుకున్నట్లు అన్నీ కుదిరి వివాహం జరిగిపోయింది స్వప్నకి మహేష్తో

స్వప్నకి వీసా అప్లై చేసాడు మహేష్. వీసా రావడమే తరువు స్వప్న ఇక తండ్రినీ, చెల్లిని వదిలి విదేశాలకు వెళ్లి పోవాలి. పెళ్లి జరిగిన 15 రోజులకే మహేష్ సెలవులు అయిపోవడంతో అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు. పెళ్లి అయిన కొత్త కావడంతో భార్యను విడిచి ఉండలేక రోజు భార్యతో ఫోన్లో రాత్రి పగలు తేడా లేకుండా మాట్లాడుతూ ఉండేవాడు

తన భర్త తనపై చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి స్వప్న చాలా మురిసిపోయింది. మార్నింగ్ లేచినకానించి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ అడుగుతూ ఉండేవాడు

మొదట్లో స్వప్న కూడా తన డైలీ దినచర్య చెప్తూ ఉండేది. ఇక స్వప్న స్కూల్లో టీచర్ ఉద్యోగం మానేసి త్వరలోనే అమెరికా వెళ్ళిపోతుందని తెలిసినా తన స్నేహితులు మరియు స్కూల్లో కొలీగ్స్ కూడా స్వప్ననీ కలవటానికి వస్తూ ఉండేవారు

రోజు తను ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో అన్ని డైలీ అప్ డేట్స్ ఇచ్చిన స్వప్న యధావిధిగా తన భర్తతో జరిగినవి అన్ని  చెప్పేది.

కానీ మహేష్ స్వప్న ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడిందని చెప్తే మాత్రం ఆ రోజు చాలా ముభావంగా ఉండేవాడు

అది గమనించిన స్వప్న రోజు రోజుకి మహేష్లో వస్తున్న మార్పులను గమనించి కొన్ని విషయాలు చెప్పడం మానేసింది. ఒకరోజు మహేష్! స్వప్నతో నువ్వు ఈ మధ్య బాగా మారిపోయావు. ఇన్నాళ్లు ప్రతి చిన్న విషయం నాతో చెప్పే దానివి. కానీ ఈ మధ్య నువ్వు చాలా తక్కువగా మాట్లాడుతున్నావు. నేను చెప్పడమే తప్ప నువ్వు ఏ విషయాలు నాతో షేర్ చేసుకోవడం లేదు అని అన్నాడు

అందుకు స్వప్న అదేమీ లేదని చెప్పి మాట దాటేసింది. కానీ స్వప్న మనసులో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. ప్రతి చిన్న విషయాన్ని అడిగి తెలుసుకునే మహేష్ తత్వాన్ని అభినందించాలో అనుమానం అని అనుకోవాలో అర్థంకాని పరిస్థితి.

జీవిత ప్రయాణం తొలి దశలోనే భర్తలోని మార్పును చూసి భయపడింది స్వప్న. అంతలోనే వీసా రానే వచ్చేసింది. స్వప్న అమెరికా బయలుదేరింది. అమెరికా అయితే వెళ్ళింది గాని స్వప్నలో ఎన్నో తెలియని భయాలు. తన కొత్త జీవితం ఎలా ఉంటుందో,తన భర్తతో తన సంసార జీవితం ఎలా ఉంటుందో అని ఒకటే ఆలోచనలు

కానీ అదృష్టవశాత్తు అక్కడ వాల కమీనిటీలో అందరూ తెలుగు వారే ఉన్నారు. చుట్టుపక్కల వారందరూ తెలుగువారు ఉండటంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది స్వప్న

సహజంగానే కలివిడి మనస్తత్వం కలిగిన స్వప్న వెళ్లిన కొద్దిరోజుల్లోనే అందరితో బాగా పరిచయం పెంచుకుంది. కానీ రాను రాను మహేష్...లో స్వప్న మీద అనుమానం పెనుభూతంలా పెరుగుతూ వచ్చింది

ఒకరోజు ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. మరొక రోజు కారణం లేకుండానే చిరాకు పడుతూ ఉంటాడు. మంచోడా? చెడ్డోడా? తెలియని అనుమాన స్థితిలో అయోమయంలో పడింది స్వప్న

ఇంట్లో పనులన్నీ తనే చూసుకుంటూ అత్త మామని చక్కగా చూసుకునేది. కానీ అనుకోకుండా మహేష్ చెల్లి కడుపుతో ఉండటంవల్ల, మహేష్ తల్లిదండ్రులు తన కూతురి డెలివరీకి సహాయం చేయడం కోసం ఇండియా వెళ్ళిపోయారు

ఒకరోజు స్వప్న సూపర్ మార్కెట్కి సామాన్లు కొనటానికి వెళ్ళింది. అక్కడ " స్వప్న బాగున్నావా అంటూ ఎవరో పలకరించారు. ఎవరా అని తిరిగి చూసింది స్వప్న

  ప్రవీణ్ నువ్వా ... వాట్ ఎ ప్లేసెంట్ సర్ప్రైజ్ అంటూ ప్రవీణ్ని చూసి సంతోష పడింది. స్వప్న

నువ్వేంటి ఇక్కడ అని అడిగింది.నేను ఈ మధ్య న్యూజెర్సీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకీ వచ్చాను అని చెప్పాడు ప్రవీణ్

నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రవీణ్. నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. మావారు అమెరికాలోనే ఉంటారు. నేను కూడా వచ్చి త్రీ మంత్స్ అవుతుంది అని చెప్పింది

ఎప్పుడో కాలేజిలో చూశాను. మళ్లీ ఇన్నేళ్లకి... ఎలా ఉన్నావు అంటూ యోగక్షేమాలు మాట్లాడుకున్నారు.

అలా ఒకరికొకరు ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు 

ఇంటికి వెళ్ళాక ప్రవీణ్ కోసం మహేష్తో చెప్పింది స్వప్న. రోజు అందరితో నవ్వుతూ మాట్లాడే స్వప్న మీద అనుమానం ఉన్న మహేష్! స్వప్న తరుచూ ప్రవీణ్తో మాటలాడటం వలన, ప్రవీణ్తో స్వప్నకి ఏదో సంబంధం ఉందని అపోహ పడ్డాడు

ఆ రోజు నుండి స్వప్న మీద నిఘా పెట్టాడు. స్వప్న ఎక్కడికి వెళ్ళినా తనకు తెలియకుండా తన వెనకాతల వెళ్లేవాడు.అలా ఒకరోజు స్వప్న షాపింగ్ వెళ్లినప్పుడు తనను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. వెంటనే భయపడిన స్వప్న! మహేష్కి కాల్ చేసింది. కానీ స్వప్న వెంట పడుతుంది మహేష్ కనుక తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు

అలా ...ఒకరోజు స్వప్న తనని వెంబడిస్తుంది మహేష్ అని తెలుసుకోని నిర్ఘాంతపోయింది.చాలా బాధపడింది తన భర్త తన మీద అనుమానంతో తనను వెంబడిస్తున్నడు అని తెలిసి తట్టుకోలేక పోయింది. మహేష్ని నీలదిసింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మహేష్ స్వప్నని శారీరకంగా హింసించాడు.

ఆ రోజు నుంచి స్వప్ననీ ఒక ముద్దాయిలా, దొంగలాగా ఎక్కడికి వెళ్ళినా ఆరా తీస్తూ ఉండేవాడు. స్వప్న తన ఇంట్లోనే పరాయి దానిలా బతుకుతుంది. ఇన్నాళ్లు కనీసం అప్పుడప్పుడైనా ప్రేమగా చూసే వాడు. కానీ ఇప్పుడు ఓకే ఇంట్లో ఉన్న ఇద్దరు  మాట్లాడుకోవడం లేదు. ఇక మహేష్తో తన జీవితం సాగించలేక మహేష్ను వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది

అందుకే తన స్నేహితుడి సహాయంతో తిరిగి ఇండియాకి వచ్చేసింది స్వప్న.అదే నెపముగా చూపించి ప్రవీణ్తో లేని పోని సంబంధాలు అంట గట్టి, స్వప్నకు విడాకుల నోటీసు పంపించాడు మహేష్

పరువుగల కుటుంబంలో పుట్టిన స్వప్న తనవల్ల తన తండ్రికి తలవంపులు వస్తాయని ,తన తర్వాత పెళ్ళికి ఎదిగిన చెల్లెలి జీవితం నాశనం అయిపోతుంది. అని ఇన్నాళ్లు జరిగిన విషయాలు ఏవీ చెప్పలేదు.

ఇక మహేష్ విడాకుల నోటీసు పంపించడంతో వారిద్దరి మధ్య జరిగిన సంఘటన అందరికీ తెలిసిపోయింది. మంచి కుటుంబంలో ఇస్తే కూతురు సుఖపడుతుంది అనుకున్నాడు పరంధామయ్య. కానీ తన కూతురు జీవితం ఇలా అర్ధాంతరంగా మోడు బారిపోవటంతో తట్టుకోలేక పోయాడు. ఆ బాధతోనే కన్నుమూసాడు పరంధామయ్య

స్వప్న మళ్లీ టీచర్గా ఉద్యోగం తెచ్చుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. తన చెల్లికి పెళ్ళి చేసి పంపించింది. తను మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.

తాను ఏ తప్పు చేయకపోయినా అనుమానం అనే ఒక జబ్బు తన భర్తను వెంటాడటం వల్ల స్వప్న జీవితం ఇలా మిగిలిపోయింది. అతడి రాక్షస ప్రేమకి ఈమె బలైపోయింది

అందరి జీవితాలు హరివిల్లులోని రంగులంత అందంగా ఉండవు. రోజా పువ్వులగా ప్రతి అందమైన జీవితంలో ఒక విషాదం కూడా ఉంటుంది.అయినా గుండెల్లో బాధని మోస్తూ పైకి నవ్వుతూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు.



*************

శుభం



  ✍️ జ్యోతి మువ్వల.


Rate this content
Log in

Similar telugu story from Tragedy