kondapalli uday Kiran

Abstract Inspirational Children

4  

kondapalli uday Kiran

Abstract Inspirational Children

అమ్మ అనే మాట గొప్పది.

అమ్మ అనే మాట గొప్పది.

1 min
364



ప్రవీణ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి 14 ఏళ్లు.వాళ్ళ అమ్మ పేరు జ్యోతి. ప్రవీణ్ కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఏ కష్టం వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగువేయమని ధైర్యం నింపేది.ఒక రోజు ప్రవీణ్ వాళ్ల అమ్మ చనిపోయింది. ప్రవీణ్ కు నోట అంట మాట రాలేదు. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన చివరి మాటలు ప్రవీణ్ కు గుర్తుకొస్తున్నాయి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆరోజు మాతృ దినోత్సవం. ప్రవీణ్ వాళ్ళ పాఠశాలలో ఉపన్యాస పోటీలు జరుగుతున్నాయి.దాంట్లో ప్రవీణ్ పాల్గొన్నాడు. ప్రవీణ్ ఉపన్యాసం మొదలుపెట్టక ముందు వాళ్ళ అమ్మ ఫోటో ని తెచ్చి నమస్కారం చేసి మొదలు పెట్టాడు. ప్రవీణ్ అమ్మ చెప్పిన చివరి మాటలను, వాళ్ళ అమ్మ తో గడిపిన

క్షణాలను ,ఇష్టమైన అనుభూతులను, చెప్పి అలాగే మీరు పొద్దున్నే లేవగానే అమ్మ కాళ్లకు నమస్కారం చేయండి ఆ రోజంతా ఏ పనిచేసినా శుభం జరుగుతుంది అని అన్నాడు. ఆ మాటలకు ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అక్కడికి ఎంతో మంది పెద్దలు వచ్చారు.అసలు విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన పెద్దలు అందరూ వాళ్ళ తల్లిదండ్రులను వృద్ధాశ్రమం లోనే చేర్పించారు. ప్రవీణ్ చెప్పిన మాటలకు వాళ్లకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఒక చిన్న పిల్లవాడికి ఉన్న బుద్ధి కూడా మనకు లేదంటూ సిగ్గుతో అక్కడినుంచి వెళ్లిపోయారు. వెంటనే వృద్ధాశ్రమానికి వెళ్లి వాళ్ల తల్లిదండ్రులను తిరిగి ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి వాళ్లకు పట్టు వస్త్రాలను తొడిగి పాదాభివందనాలు చేశారు. వాళ్ళందరికీ ఒకటీ అర్థమైంది మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత అంతస్తులున్న, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న, అమ్మ ప్రేమ లేకపోతే

ఈ జీవితానికి అర్థం లేదు అని.


చూశారా వాళ్ళ అందరి మనసులను ఒకే ఒక్క పదం మార్చింది.

అదే రెండు పెదవుల కలయిక ,

     అమ్మ...


Rate this content
Log in

Similar telugu story from Abstract