అక్కా!నీవే రక్ష
అక్కా!నీవే రక్ష


ప్రభూ! మీరు వేటకు బయలుదేరుతున్నారని తెలిసింది. అనుమతిస్తే మేమూ వస్తాం! అని చిలిపిగా అడిగింది కుంతి పాండురాజుని
'దేవీ! క్రూరమృగాలు సంచరించే చోటికి మీరు....'
'ప్రభువుల అండ మాకు ఉండగా భయ మేల? గోముగా అన్నారు కుంతీ మాద్రులు
శుభముహూర్తాన సపరివార సమేతంగా బయలుదేరారు
రాణివాసాలకు గుడారాలు ఏర్పాటు చేశారు
మూడు రోజులు వేటకు బయలుదేరి వెళ్లారు. జయప్రదమై వచ్చారు
ఆ సాయంకాలం వరకు ఏమృగమూ దొరికే అవకాశం రాలేదు
అలసి సొలసిన పాండు రాజు కెదురుగా జింకలజంట మైధునం చేసుకునే దృశ్యం చూసి బాణాలు వేసి నిలబడ్డాడు
మరుక్షణం అక్కడ ముని దంపతుల శరీరాలు కనిపించాయి
'రాజా! నేను కిందముడనే రుషిని. వినోదంగా లేళ్ళుగా మారి ఆ సుఖభోగం అనుభవిస్తూ వున్నాం. మమ్ము చంపిన నీవు నీ భార్యాసంయోగ మైన మరుక్షణం మరణిస్తావు. _ అని శాపం పెట్టాడు కిందము డనే రుషి ప్రాణం విడుస్తూ
గుడారాలకు విచ్చేసిన పాండురాజు రాణులను నగరానికి వెళ్ళి అక్కడ ఉండి పొమ్మని చెప్పాడు
తానుతపోవృత్తిలో శేషజీవితాన్ని గడుపుతానన్నాడు
'మీకు సేవలు చేస్తూ ఇక్కడే ఉంటా మన్నారు రాణులు
ముని వృత్తి తో శతశృంగంపై కాలం గడిపారు
ఒకనాడు బ్రహ్మలోకం వెళ్తున్న మునులను చూసి వారి వెంట నడిచాడు పాండురాజు
కొంతదూరం వెళ్ళాక సంతానం లేని వారికి ప్రవేశం లేదని తెలిసి అవాక్కయ్యాడు
దిగులుగా ఉన్న ప్రభువును ఓదార్చింది కుంతి
భర్త కోరిక మేరకు చిన్న తనం లో దూర్వాసమహర్షి తన కిచ్చిన వరంతో భర్త సూచన మేరకు యమధర్మరాజు నాహ్వానించి గర్భిణీ అయి సంవత్సరం తర్వాత ధర్మరాజు ను ప్రసవించింది.
అలానే వాయువుద్వారా భీముడు, ఇంద్రుని ద్వారా అర్జునుడు జన్మించారు
మాద్రి కోరిక మేరకు ఆమెకూ మంత్రోపదేశం చేసింది కుంతి
అశ్వినీ దేవతల వల్ల నకులసహదేవులు మాద్రికి కలిగారు
ఓ రోజు నదీస్నానం చేసి వస్తున్న మాద్రిని చూచి కామపరవశుడైన పాండు రాజు ఆమె వారిస్తున్నా కోరిక తీర్చు కొన్నాడు
మరుక్షణం అక్కడే ప్రాణం విడిచాడు
సతీసహగమనం చేస్తానని కుంతి పట్టుబట్టింది
మాద్రి రోదిస్తూ ఇలా అంది:
'అక్కా! నావల్ల ఈ విషాదం జరిగింది. ఈపిల్లలూ నీ వల్ల నాకు పుట్టారు. వీళ్ళను నీ కర్పిస్తున్నా. నీవు సమర్ధవంతంగా పెంచగలవు. కాదనకు! అంటూ భోరున ఏడ్చి సహగమనం చేసింది మాద్రి
అక్కడి మునులు కుంతి నీ పంచపాండవులను ధృతరాష్ట్రుని వద్దకు చేర్చి _ 'మహారాజా! వీరు ఐదుగురు నీ తమ్ముని కుమారులు. మరణం చెందిన నీ తమ్ముని కర్మక్రతువులు నిర్వహించి వీరిని పెంచి పోషీంచే బాధ్యత నీకు అప్పగిస్తున్నా మన్నారు రుషి సత్తములు