Naveen Surya

Abstract Inspirational Others

3.5  

Naveen Surya

Abstract Inspirational Others

ఆర్ట్ ఆఫ్ గివింగ్

ఆర్ట్ ఆఫ్ గివింగ్

2 mins
327


 భవానీ : సార్ గుడ్ మార్నింగ్ ! నేను భవానీ నీ మాట్లాడుతున్నాను , లాస్ట్ నెల కిందట మా పాపకి రక్తదానం చేశారు . ఇప్పుడు కూడా అవసరం అయింది ఎవరైనా ఉన్నారేమో అని

వేణు : మళ్ళీ ఏమి సమస్య వచ్చింది అండి , ఇంకా కోలుకోలేదా

భవానీ : పుట్టినప్పటి నుండి ఉంది సార్ సమస్య 

వేణు : ప్రాబ్లెమ్ ఎంటి 

భవానీ : తలసేమియా సార్ ! ప్రతి 15 రోజులకు ఒకసారి ఎక్కించాలి . పుట్టిన పిల్లలకు వస్తుంది సార్ ఇది . హీమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల వస్తుంది సార్ , 

వేణు : దీనికి చికిత్స లాంటివి ఏమి లేవా

భవానీ : bone marrow transplantation ద్వారా దీన్ని తగ్గించవచ్చు కానీ నెల జీతం కోసం పని చేసే వాళ్ళకి అంతా డబ్బు ఎక్కడిది సార్

వేణు : అలాగా , బాబు ఇప్పుడు ఏ హాస్పిటల్ లో ఉన్నాడు అండి

భవానీ : ఇంతకు ముందు బ్లడ్ డొనేట్ చేసిన హాస్పిటల్ లోనే జాయిన్ చేశాం సార్ అక్కడకి వచ్చి మా బాబు పేరు చెప్తే మేము ఉన్న వార్డ్ చెప్తారు 

వేణు : ఒకే నేను ప్రయత్నిస్తాను , బ్లడ్ గ్రూప్ A కదా 

భవానీ : అవును సార్ 

-------------------------

వేణు : అరేయ్ దినేష్ ! నీకు డీటైల్స్ పెట్టాను , వెళ్ళి బ్లడ్ డొనేట్ చెయ్ వాళ్ళకి 

దినేష్ : అన్న ఆఫీస్ ఉంది , బాస్ ఒప్పుకోడు , అర్థం చేసుకో

వేణు : చిన్న పాపకి దినేష్ ఎలాగోలా వెళ్ళే ప్రయత్నం చేయవా

దినేష్ : సరే అన్న ! ఇస్తాను , 

వేణు : సరే 

-------------------------

దినేష్ : పేషెంట్ పేరు ఆనంద్ 

జనరల్ వార్డ్ సెకండ్ ఫ్లోర్ , అతనికి బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను మేడం

కమల : ఇక్కడ మీ వివరాలు రాయండి 

దినేష్ : ఒకే అండి

కమల : ఇది ఫస్ట్ టైమా 

దినేష్ : లేదండి 3 సార్లు ఇచ్చాను

కమల : మీకు ఆవిడ బంధువు అవుతారా 

దినేష్ : వాళ్ళెవరో కూడా తెలీదు అండి , మా ఫ్రెండ్ అడిగాడు అని వచ్చి ఇస్తున్నాను 

కమల : ఫ్రెండ్స్ , ఫ్యామిలీ లే ఇవ్వాళ ముందుకు రావట్లేదు , అలాంటిది వాళ్ళ గురించి మీకేం తెలియక పోయినా వచ్చి సాయం చేస్తున్నారు అంటే మీరు చాలా గొప్పవాళ్ళు అండి

దినేష్ : మీకు తెలియంది ఏముంది మేడం , మా ఫ్రెండ్ కూడా ఇలాగే అందరిలో చైతన్యం తీసుకొచ్చి అందరూ ముందుకు వచ్చి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు , కానీ అది అవ్వట్లేదు మేడం ,

ఇయ్యాల ,రేపు దావత్ అంటే వస్తున్నారు కానీ సాయం అంటే తల తిప్పే వాడు కూడా లేరు , 

కమల : అవును బాబు ! మొదట మన ఫ్యామిలీ , ఫ్రెండ్స్ నీ అడిగి ఆ తర్వాత బయట ప్రయత్నం చేయాలి కానీ అది జరగటం లేదు 

దినేష్ : బ్లడ్ అనేది తయారు చేసే వస్తువు కాదు , అది మన శరీర నిర్మాణం లోనే ఉంటుంది అని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో

, వీళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుందో 

దినేష్ : ఇంతకీ తలసేమియా ఎంటి మేడం 

కమల : అది కూడా తెలియకుండా వచ్చావా బాబు నువ్వు !?? తలసేమియా అనేది కూడా ఒక వ్యాధి , వీళ్ళకి రక్తం ఎక్కిస్తునే ఉండాలి . పాపం పసి మనసులు చేతి నిండా సూది మచ్చలే

దినేష్ : అవునా అండి ! నేను గర్భం తో ఉన్న వాళ్ళకి చేస్తుంటా ! ఇక మీదట తలసేమియా బాధితులకు కూడా చేస్తాను రక్తదానం 

కమల : సూపర్ చిన్నా ! ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళి బ్లడ్ డొనేట్ చెయ్ 

------------------------------

దినేష్ : అన్న డొనేట్ చేశాను 

వేణు : Thank You రా

----

వేణు : భవానీ గారు బ్లడ్ డొనేషన్ చేశారు మా ఫ్రెండ్ 

భవానీ : థాంక్స్ యు సో మచ్ అండి 

--------------------------------

మీరు కూడా రక్తదానం చేసి , మీ వాళ్ళతో చేపించండి 

మీ పది నిమిషాల విలువైన సమయం - ఒక నిండు జీవితం


డొనేట్ బ్లడ్ - సేవ్ లైఫ్ 



Rate this content
Log in

Similar telugu story from Abstract