2. ఆగదీ ప్రయాణం

2. ఆగదీ ప్రయాణం

1 min 438 1 min 438

కాపురానికొచ్చిన కొత్తలోనే...అత్తగారింట్లో కలివిడిగా కలిసిపోయింది. అత్తగారు పిలవడమే తరువాయి...ఎదుట ప్రత్యక్షమయ్యేది. పల్లెటూరులో పుట్టి పెరిగిందేమో... అత్తగారు చెప్పే ప్రతిపనినీ క్షణాల్లో చక్కబెట్టేసేది. అందుకేనేమో....అత్తగారితో ఆమె ఎలాంటి మాటా పడలేదు. ఇద్దరూ అన్యోన్యంగా ఉండటం ....చూసేవారికి వింతగానే ఉంది. 


   భూమిక అత్తగారి మనసును గెలవడానికి ఎంతో కాలం పట్టలేదు. మావగారు కూడా కోడలి వంటా వార్పులంటే రుచి మరిగారు. సరైన కోడల్ని తెచ్చుకున్నందుకు ఎంతో సంతోషించారు. 


   భూమికకు అత్త మామలతో...తనకు ఎలాంటి ఇబ్బందీ లేదు.

   ఇబ్బందల్లా...భర్త ఆకాష్ తోనే. 

   

   పెళ్లై మూడు నెలలైనా....వారి మధ్య ఉండాల్సిన సంబంధం దగ్గరవ్వలేదు. దగ్గరకు చేరినప్పుడల్లా..భర్త ఎడంగా పడుకోవడం భూమిక సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా ఉంది.


   తానెన్ని కలలు కంది...? చిలకా గోరింకల్లా కాపురం చేస్తూ...సంతోషంగా గడపాలని. ఆ కలలన్నీ కూలిపోయినట్టేనా...? లేదు...అలా కాకూడదు. సిగ్గు విడిచైనా నేనే చొరవతీసుకోవాలి...ప్రేమతో తానే భర్తకు దగ్గరవ్వాలనుకుంది భూమిక.


    అది అమావాస్య రాత్రే అయినా...ఓ మధురమైన రాత్రిగా మిగిలిపోవాలని ....భర్తను అందాలతో  కైపెక్కించాలని చేసిన తన ప్రయత్నమంతా నీరుగారిపోయింది.


   భూమిక నుంచి దూరంగా జరుగుతూ....సారీ...నాకు పెళ్లి వద్దంటున్నా...నీతో నాకు మావాళ్ళు బలవంతంగా పెళ్లిచేశారు. నేను ఎప్పటికీ సంసార సుఖానికి పనికి రానని నీకు చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను...అంటూ ముఖం చాటేశాడు ఆకాష్. 


    భూమిక భర్తను చూసి చిన్నగా నవ్వింది.


     

    


 Rate this content
Log in

More telugu story from శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Similar telugu story from Romance