యుద్ధనౌక
యుద్ధనౌక
పడిలేచే కెరటంలా జీవితమే యుద్ధనౌక
మౌనరాగ విపంచితో పాడడమే యుద్ధ నౌక
ఎన్నాళ్ళో ఈ పయనం అంతులేదు ఓ శ్యామల
బంధాలను బాధ్యతలుగ మార్చడమే యుద్ధనౌక
రాళ్ళెన్నో ముళ్ళెన్నో నువు వచ్చిన దారి వెంట,
కను మూయని రాత్రులతో జగడాలే యుద్ధనౌక
సంతోషం,సంతాపం సగమైనా నిలువనీవు.
ఎదవాకిట విచ్చుకత్తి నాటడమే యుద్ధనౌక
అమ్మ పాత్ర నాటకాన ముగిసిపోదు చివరికంట
కమ్ముకున్న మేఘాలను నమ్మడమే యుద్ధనౌక...
