STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

యేటీ ఒడ్డు

యేటీ ఒడ్డు

1 min
261


నిన్నల్లుకు ముద్దాడిన..గాలినిలా పంపించవు..!

ఒక్క క్షణం సేదతీరు..భాగ్యమింత కల్పించవు..! 


విరహమైన సౌఖ్యమందు..వేడుకొందు నోకలనే..

రెప్పలింటి కనుపాపల..ఆరాటం తగ్గించవు..! 


గున్నమావి నీడకూడ..ఎండమావిలా ఉన్నది.. 

జ్ఞాపకాల జోలపాట..ఒక్కసారి వినిపించవు..! 


యేటిఒడ్డు కలవరింత..ఆలకించు వీనులార.. 

తానమాడి మాయమైన..వైనమునే మరిపించవు..! 


ఎంతవెర్రి నాదోచెలి..నీ సన్నిధి చేరేందుకు.. 

ఆశపడే ఈ మనసును..ఎందుకనో బంధించవు..! 


నీ తలపుల గీతమొకటి..గొంతుదాటి రాదేమిటి.. 

మౌనవీణ నా హృదయం..అశ్రుధార పలికించవు..! 


నిర్దయయే నీదయగా..భావింతున...

నీ పదములు చేరుదారి..వెన్నుతట్టి నడిపించవు..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance