వ్యసనాలు
వ్యసనాలు
కళ్ళు తెరచి కానవా
దురలవాట్లు మానవా
తగిలిందో ఈ హవా
మానలేవు మానవా !!
మత్తులతో పొత్తులా
సారాలకు మారాలా
జర్దాలతో సరదాల
రేసులపై కాసులా !!
పొంచి ఉన్న ముప్పులు
తెలిసి తెలిసి తప్పులు
అలవాట్లకు అప్పులు
కలిసి వెరసి తిప్పలు !!
వక్కపొడిని వదలరా
ముక్కుపొడిని మరవరా
పేకాటలో జోకరా
మంచి దారి నడవరా !!
చుట్ట, బీడీ సిగరెట్లు
అలవాట్లో పొరపాట్లు
పదును పెట్టి పనిముట్లు
చేసుకోరా పనిపాట్లు !!