STORYMIRROR

Ramesh Babu Kommineni

Drama

3  

Ramesh Babu Kommineni

Drama

వట్టి మనుషులం

వట్టి మనుషులం

1 min
226

వట్టి మనుషులం మనమంతా మట్టి మనుషులం

గట్టి నటనతో రంగులు పులుము కొన్న నగీషులం

నవ్వుతూనే నవరసాలూ పండించేసే పండితులం

రువ్వుతూనే మాటలూ పుట్టించేస్తాం హాలాహలం

వట్టి మనుషులం మనమంతా మట్టి మనుషులం

గట్టి నటనతో రంగులు పులుము కొన్న నగీషులం


ఎదుటివాడి కొంపముంచనే ఎంతోఎంతో సరదాలే

ఎదుటపడి తనూ కన్పించక కప్పుకొనూ పరదాలే

ఉచ్చనీచాలే మరిచిపోతాం ఎవరూ కానకుంటేను

ఉచ్చిష్ఠమైనా లాగించేస్తాం వేరెవరే చూడకుంటేను

పక్కవాడికి ఎన్నో నీతులు భోధించి నమ్మించేస్తాం

వక్కపొడికూడ దానమివ్వక అంతా అమ్మించేస్తాం

వట్టి మనుషులం మనమంతా మట్టి మనుషులం

గట్టి నటనతో రంగులు పులుము కొన్న నగీషులం


చెప్పుకోను చేంతాడంత ఘనకీర్తి ఉందని అంటాం

వప్పుకొనే వాడుంటే నా అంతటి వాడు లేడంటాం

సహజమైన నటనే మనమూ చూపించి మెప్పిస్తాం

నిజమైన వాలకాన్ని దాచి ఏదో రావాలని లెఖ్ఖిస్తాం

వల్లమాలినా వాత్సల్యాన్ని ఒడలంతా పూయిస్తాం

తెల్లబోయిన సంస్కారాన్ని ఆతెల్లవార్లు వెక్కిరిస్తాం


వట్టి మనుషులం మనమంతా మట్టి మనుషులం

గట్టి నటనతో రంగులు పులుము కొన్న నగీషులం

నవ్వుతూనే నవరసాలూ పండించేసే పండితులం

రువ్వుతూనే మాటలూ పుట్టించేస్తాం హాలాహలం


నట సామ్రాట్టులూ కూడా బలాదూరే మనముందు

పోటిలేని నటన పతకాలన్నీమనకే మునుముందు

నట సామ్రాట్టులూ కూడా బలాదూరే మనముందు

పోటిలేని నటన పతకాలన్నీమనకే మునుముందు

వట్టి మనుషులం మనమంతా మట్టి మనుషులం

గట్టి నటనతో రంగులు పులుము కొన్న నగీషులం



Rate this content
Log in

Similar telugu poem from Drama