STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

3  

Ramesh Babu Kommineni

Romance

వట్టేసి వచ్చాక..

వట్టేసి వచ్చాక..

1 min
231

ఒట్టేసి వచ్చాకా ఆ గుట్టేమి ఇక విప్పనులే

కట్టేసి హృదయాన్ని కథలేమి నే చెప్పనులే

స్వాగతమే నేస్తం స్వాధీనంలేని మనసుతో

మనోగతమే సమస్తం అంకితం వయసుతో


కలలెన్నో కన్నాను ఊరించే ఊహల్నే కలిపి

కిలకిలలెన్నో విన్నాను సంగతులన్నీ తెలిపి

కలలెన్నో కన్నాను ఊరించే ఊహల్నే కలిపి

కిలకిలలెన్నో విన్నాను సంగతులన్నీ తెలిపి

ఒట్టేసి వచ్చాకా ఆ గుట్టేమి ఇక విప్పనులే

కట్టేసి హృదయాన్ని కథలేమి నే చెప్పనులే


అనుభవమే అవసరంలేదులే ఆలకించను

స్వానుభవమే సరిపోవునులే పులకించను

అవసరమే ఆయుధం అన్నిటిని నెరవేర్చనే

ఆ సరసమే ప్రేమలో కావాలిగా సరి చేర్చనే

గుర్తుండి పోవాలి గురిచూసి మరి విసిరాక

గురి ఉండి నిలవాలి గుండెల్లోనే ముసిరాక


ఒట్టేసి వచ్చాకా ఆ గుట్టేమి ఇక విప్పనులే

కట్టేసి హృదయాన్ని కథలేమి నే చెప్పనులే

స్వాగతమే నేస్తం స్వాధీనంలేని మనసుతో

మనోగతమే సమస్తం అంకితం వయసుతో



Rate this content
Log in

Similar telugu poem from Romance