వసంతపు శోభ
వసంతపు శోభ


కోకిలమ్మల కిల కిలారావములు
చైత్రమాసపు మేలుకొల్పులు
చిగుటాకుల పచ్చదనములు
వసంతశోభకు తీపి గుర్తులు
ఉదయ భానుడి లేలేత కిరణాలు
ప్రపంచానికి మార్గ నిర్దేశాలు
ఆరురుచుల ఆరగింపులు
ఆరోగ్యకర జీవితానికి అమృతాలు
పంచెకట్టు, పట్టుచీర, పరికిణీలు
తెలుగు సంస్కృతి వెలుగులు
మామిడిపళ్ల మధుర రసాలు
వైశాఖపు ఘన విందులు
ప్రకృతికి వన్నెతెచ్చు వసంతం
మసాలకే రారాణి
ప్రకృతి వాకిట వసంతపు చిరు అడుగు
నూతన తెలుగు వత్సరానికి తొలి పిలుపు