STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics

4  

SATYA PAVAN GANDHAM

Classics

వర్షించే మేఘం

వర్షించే మేఘం

1 min
328

ఓ జడివానా!


దివి నుండి భువికి చేరే నీ పయణంలో మెరుపై మెరుస్తావు!

ఉరుమై ఉరుముతావు, జలపాతంలా జారుతావు!!

 

మండే ఎండను సైతం మబ్బుల మాటున దాచిపెడతావు!

దుప్పటిలో ఉన్న వెచ్చని కౌగిలిని చెంతకు చేరుస్తావు!!


ఐస్క్రీం రుచిని రెట్టింపు చేస్తావు!

జలుబు, జ్వరాన్ని తెచ్చిపెడతావు!!


చిట పటలాడుతూ......

సింగిల్ గా ఉన్న నాకు రొమాంటిక్ మెలోడిని పరిచయం చేస్తావు!


గల గల పారుతూ... 

అలసిన మనసుని ఆహ్లాదపరిచి కదలకుండా చేస్తావు!!


అన్ని అనుభవిస్తున్న లోపే,

ఆ అదృష్టాన్ని అంతం చేసి, దురదృష్టాన్ని దగ్గర చేస్తూ,

కలలా కరుగుతూ, కథలా ముగిసిపోతావు!!.


Rate this content
Log in

Similar telugu poem from Classics