వరం
వరం


ప౹౹
కనురెప్పలు మూయకనే నేచూస్తున్నానులే
నిను మెప్పులతో మురిపించ వస్తున్నానులే ౹2౹
చ౹౹
వర్ణించను ఒకటా రెండా ఎన్నెన్ని అందాలు
శోభించినే ఆ వదనం చిలికించి చందనాలు ౹2౹
అందుకో ఆ మది కోరిన ముసిమి ముచ్చట
ఎందుకో అనక ఎలమినే పూయంచై అచ్చట
౹ప౹ చ౹౹
ఎగిరే చిలకా ఎదలోని మాట పలకను లేవా
తగునే నీకిది తమకమే తనువూరించిపోవా ౹2౹
దారులెన్నో ప్రేమకి దరిచేరాకనే ఒకరినొకరు
తీరులెన్నో తిన్నగ మరి సాటిగలరే వేరొకరు
౹ప౹
చ౹౹
కనులేమి చెపుతున్నాయి కలిగిన హాయిలో
అసలేమి జరుగుతున్నది వెన్నెలల రేయిలో ౹2౹
ఒకటా రెండా విశదీకరించను వివరంగానూ
మాటొకటి చాలులే మరులలోన వరంగానూ ౹ప౹