వరమంటా
వరమంటా
నీ వెచ్చని చిరునవ్వే..ఈ జన్మకు వరమంటా..!
నీ చల్లని ఒక చూపే..నా మాటకు వరమంటా..!
తలచకనే పసిడిపూలు..కురిసేవే నా పైనే..
నీ తియ్యని పదముద్రలె..నా తోటకు వరమంటా..!
రేయిపగలు చింతలేక..నిలచేవే నాతోనే..
నీ వీడని ఆ వెలుగే..నా బాటకు వరమంటా..!
పరిమళించు జ్ఞాపకాల..వెన్నెలంటె నీతోనే..
నీ చెదరని అనురాగమె..నా పాటకు వరమంటా..!
గుండెలయల కంజిరాను..పలికించే చెలికాడవు..
నీ కమ్మని భావనమే..నా నీడకు వరమంటా..

