వ్రాస్తున్నా ప్రేమ లేఖ
వ్రాస్తున్నా ప్రేమ లేఖ
వ్రాస్తున్నా ప్రేమలేఖ..ఇస్తాలే ఎపుడో..!
మనసులోని ఒకమాటే..చెబుతాలే ఎపుడో..!
కసిబూనే కాలమేమి..ఉండదంటె నిజమే..
ఒక్కసారైనా నిన్ను..చూస్తాలే ఎపుడో..!
ఊహమాటు నీ రూపం..ఉండనీ అలాగే..
నీ తియ్యని వలలోపడి..పోయాలే ఎపుడో..!
వెంటాడే అయోమయం..రాలిపోతే బాగు..
నా 'నేను'లగొడవ మంట..పెడతాలే ఎపుడో..!
సమాధెలా ఉంటుందో..నా తలపేనా అది..
నీ పాటకు కోవెలొకటి..కట్టాలే ఎపుడో..!

