వ్రాసిందొక లేఖ
వ్రాసిందొక లేఖ
వ్రాసిందొక లేఖ
ఆమె కన్నుల కాటుకతో
అతని చూపు మరల్చనీయకుండా చదివించడానికి
వ్రాసిందొక లేఖ
ఆమె తన లిప్స్టిక్ ముద్రలతో
అతని పెదవులు ఆ అక్షరాల్ని ముద్దాడాలని
వ్రాసిందొక లేఖ
ఆమె తన యద గుర్తులతో
అతని మనసు తాపంతో అల్లాడాలని
వ్రాసిందొక లేఖ
ఆమె తన కన్నీటితో
అతనికి నిద్రను దూరం చేయడానికి
అతని కౌగిలిలో ఆమె ఒదిగిపోవడానికి
ఇదిగో వస్తున్నా
అదిగో వస్తున్నా
అనే ప్రియుడిని రప్పించడానికి
ఆమె మనసు వ్రాసిందొక లేఖ
అతడిని ఆమెతో కలిపిందా లేఖ