వ్రాసేది ప్రేమలేఖ
వ్రాసేది ప్రేమలేఖ
వ్రాసేది ప్రేమలేఖని..చెప్పడమే ఇష్టం..!
నిన్ను అల్లుకున్న చూపు..నిలపడమే ఇష్టం..!
విరహమెక్కడుందంటే..మనసుమూల్గు వెనుకే..
ఆవేదన గీతముగా..మలచడమే ఇష్టం..!
చెక్కబడే అక్షరాల..వెల్లువలో భావం..
అపురూపత కోరూపం..ఇవ్వడమే ఇష్టం..!
వెన్నుతట్టి నడిపించే..మెఱుపుతీగ నీవే..
నీ నడకల వయ్యారం..పట్టడమే ఇష్టం..!
నీ రచనా విన్యాసము..అంతుచిక్క నీవా..
కవనశిల్ప సౌందర్యం..అందడమే ఇష్టం..!
నీ అడుగుల జాడకన్న..రహదారే లేదే..
నీజతలో వెన్నెలనై..దూకడమే ఇష్టం..!

